Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ardhangi (1955)






చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
నటీనటులు: నాగేశ్వరరావు, సావిత్రి
దర్శకత్వం: పి. పుల్లయ్య
నిర్మాతలు: శాంతకుమారి, పి. పుల్లయ్య
విడుదల తేది: 26.01.1955



Songs List:



ఇంటికి దీపం ఇల్లాలే పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం:  ఆకుల నరసింహా రావు 

ఇంటికి దీపం ఇల్లాలే 






ఎక్కడమ్మా చంద్రుడూ? పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి)

ఎక్కడమ్మా చంద్రుడూ? 
ఎక్కడమ్మా చంద్రుడూ?
చక్కనైన చంద్రుడు
చుక్కలారా, అక్కలారా
నిక్కి నిక్కి చూతురేల 

ఎక్కడమ్మా చంద్రుడూ…?

చక్కనైన చంద్రుడు 
ఎక్కడమ్మా కానరాడు
మబ్బు వెనక దాగినాడో 
మనసులేక ఆగినాడో

ఎక్కడమ్మా చంద్రుడూ…?

పెరుగునాడు తరుగునాడు
ప్రేమ మారని సామి, నేడు
పదము పాడి బ్రతిమలాడి 
పలుకరించిన పలుకడేమి!

చక్కనైన చంద్రుడు 
ఎక్కడమ్మా కానరాడు
ఏలనో కానరాదు 
ఎక్కడమ్మా చంద్రుడు
చక్కనైన చంద్రుడు 
ఎక్కడమ్మా చంద్రుడూ..!



పెళ్లి ముహూర్తం కుదిరిందా పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం: పి.లీల, జిక్కి, బృందం   

పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా 
పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా 

భలే మొగుణ్ణి పట్టావు
భలే మొగుణ్ణి పట్టావు
ముసళ్ళ పండగ ముందేలే.. ఏ.. ఏ.. 
ముసళ్ళ పండగ ముందేలే
అసలు వడ్డీ యివ్వాల్లే
పిల్లా నీ పొగరణిగిందా

పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా 

మహరాజింటి మనువంటె
మజాక అనుకున్నావంటే!
మహరాజింటి మనువంటె
మజాక అనుకున్నావంటే!

బంగరు నగలు రంగులరాళ్ళు
బంగరు నగలు రంగులరాళ్ళు
బారీ కోకలు పట్టు రైకలు
గంగిరెద్దులా సింగారించి
గాడిద బరువూ మోయాలోయ్‌ పిల్లా
గాడిద బరువూ మోయాలోయ్‌
పిల్లా నీ పొగరణిగిందా పొగరణిగిందా 

పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా 
   
పెత్తన మొస్తుందనుకోకు
నెత్తికి కళ్ళు రానీకు
పెత్తన మొస్తుందనుకోకు
నెత్తికి కళ్ళు రానీకు
అత్తా మామా ఉన్నారూ
అత్తా మామా ఉన్నారూ
నీ సత్తా ఏమో చూస్తారు
పిల్లా నీ పొగరణిగిందా

పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా 

పరదా లోపల మురగాలి 
తిరిగే కాలు నిలవాలి
పరదా లోపల మురగాలి 
తిరిగే కాలు నిలవాలి
పలుకూ తీరూ మారాలి
పలుకూ తీరూ మారాలి 
నీ తల బిరుసంతా తగ్గాలి 
పిల్లా నీ పొగరణిగిందా.. 

పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా 
పొగరణిగిందా పొగరణిగిందా  





ఏడ్చే వాళ్ళని ఏడ్వని పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం: పి,లీల 

ఏడ్చే వాళ్ళని  ఏడ్వని



రాధను రమ్మన్నాడు పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం:  ఆకుల నరసింహా రావు 

రాధను రమ్మన్నాడు
రాసక్రీడకు మాధవదేవుడు
రాధను రమ్మన్నాడు
నల్లనివాడు అల్లరివాడు
నమ్మినవారికి చల్లనివాడు
ముల్లోకాలను పిల్లన గ్రోవితో
మురిపించే మోహనకృష్ణుడు

గోపాలుడు మా పాలిటి దేవుడు
రేపల్లెకు తానెపుడూ పాపడు
చల్లను తెచ్చే గొల్లపిల్లతో
సరసలాడుచు ఉన్నాడు
యమునా తటిలో ఉన్నాడు
ఇది అనువౌ సమయం అన్నాడు
యశోదమ్మకీ విషయాలేవీ
తెలుపవద్దనీ బ్రతిమాలాడూ



రాక రాక వచ్చావు పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి)

రాక రాక వచ్చావు చందమామ
లేక లేక నవ్వింది కలువ భామ

మబ్బులన్ని పోయినవి మధుమాసం వచ్చినది
మరులు కొన్న విరికన్నె విరియ బూసి మురిసింది

లేక లేక నవ్వింది కలువభామ

రేకులన్ని కన్నులుగా లోకమెల్ల వెతకినది
ఆకసాన నిను జూచి ఆనందం పొంగినది
ఆకసాన నిను జూచి ఆనందం పొంగినది

లేక లేక నవ్వింది కలువభామ

తీరని కోరికలే తీయని తేనియలై
తీరని కోరికలే తియ తీయని తేనియలై
వెన్నెల కన్నులలో వెల్లివిరిసి మెరిసినవి…
దొంగలాగ దూరాన తొంగి చూతువేల
రావోయి రాగమంత నీదోయి ఈ రేయి

రాక రాక వచ్చావు చందమామ
లేక లేక నవ్వింది కలువ భామ




వద్దురా కన్నయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి)

పల్లవి :
వద్దురా కన్నయ్యా వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇల్లు వదిలి పోవద్దురా అయ్యా...

చరణం: 1
పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ
పసిపాలను బూచి పట్టుకెళ్లే వేళ 

చరణం: 2
పట్టు పీతాంబరము మట్టిపడి మాసేనూ
పాలుగారే మోము గాలికే వాడేను
వద్దురా... వద్దురా కన్నయ్యా

చరణం: 3
గొల్లపిల్లలు చాలా అల్లరి వారురా
గోలచేసి నీపై కొండెములు చెప్పేరు
ఆడుకోవలెనన్న పాడుకోవలెనన్న
ఆడటను నేనున్న
అన్నిటను నీదాస

వద్దురా... వద్దురా... వద్దురా...
వద్దురా కన్నయ్యా... కన్నయ్యా




తరలిరావా పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం: ఘంటసాల 

తరలిరావా




సిగ్గేస్తదోయ్ బావ సిగ్గేస్తదీ పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం: పి.లీల

సిగ్గేస్తదోయ్ బావ సిగ్గేస్తదీ
మొగ్గలేను ఒగ్గలేను
మొగమెత్తి చూడలేను

పచ్చికా బయలులోన
మచ్చికగా మనముంటే
సిగ్గులేని చందమామ
చాటుగుండి చూస్తాడు

రెప్పలార్పకుండా 
నిన్నెప్పుడైనా చూస్తినా
టక్కులాడి చుక్కలన్ని
ఫక్కుమని నవ్వుతాయి

గుట్టుగా చెట్టుకింద
గుసగుసలు చెప్పుకుంటే
చెట్టుమీది పిట్టలన్ని
చెవులు నిక్కబెడతాయి

ఎందుకో అందరికి
ఇంత ఈసుమనమంటే
ఎవ్వరూ చూడలేని
ఏడకైన ఎళదాము


No comments

Most Recent

Default