చిత్రం: బలిపీఠం (1975) సంగీతం: కె. చక్రవర్తి నటీనటులు: శోభన్ బాబు, శారద, మురళీమోహన్ దర్శకత్వం: దాసరి నారాయణరావు నిర్మాత: వై.సునీల్ చౌదరి విడుదల తేది: 17.07.1975
Songs List:
చందమామ రావే.. పాట సాహిత్యం
చిత్రం: బలిపీఠం (1975) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: దాశరథి గానం: వి. రామకృష్ణ, పి.సుశీల పల్లవి: చందమామ రావే.. జాబిల్లి రావే అమ్మాయి అలిగింది.. అలక తీర్చిపోవే.. అలక తీర్చిపోవే చందమామ రావే.. జాబిల్లి రావే అబ్బాయి నోటికి.. తాళమేసి పోవే.. తాళమేసి పోవే చందమామ రావే చరణం: 1 చల్ల గాలి ఝడిపిస్తోంది.. ఎలాగా ? గళ్ళ దుప్పటి కప్పుకోండి.. ఇలాగా.. పండు వెన్నెల రమ్మంటో౦ది.. ఎలాగా? తలుపు తీశా వెళ్లిరండి.. ఇలాగా.. అందాల ఈ రేయీ వెళతాను అంటో౦ది ఇద్దరిని ఒక్కటిగ చూడాలి అంటో౦ది ఏదో వంకతో ఎందుకు పిలవాలి? .. కావాలంటే సూటిగానే అడగలేరా చందమామ రావే.. చరణం: 2 అమ్మాయి పుడితేను.. ఎలాగా? పెళ్లి చేసి పంపాలి.. ఇలాగా అబ్బాయి పుడితేను.. ఎలాగా? గొప్పవాణ్ణి చెయ్యాలి.. ఇలాగా అమ్మాయి పుట్టినా.. అబ్బాయి పుట్ట్టినా మీలాగే ఉండాలి.. మీ మనసే రావాలి తల్లే పాలతో మంచిని పోయాలి ఆ మంచితోనే వారు మనకు పేరు తేవాలి చందమామ రావే.. జాబిల్లి రావే పాపాయి పుడితేను.. జోల పాడరావే.. జోల పాడరావే.. చందమామ రావే
కుశలమా.. నీకు కుశలమేనా? పాట సాహిత్యం
చిత్రం: బలిపీఠం (1975) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: కుశలమా.. నీకు కుశలమేనా? మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే..అంతే .. అంతే.. కుశలమా.. నీకు కుశలమేనా? - ఇన్నినాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాశాను.. అంతే ..అంతే .. అంతే.. చరణం: 1 చిన్న తల్లి ఏమంది? ... నాన్న ముద్దు కావాలంది పాలుగారు చెక్కిలి పైన... పాపాయికి ఒకటి తేనెలూరు పెదవులపైన.. దేవిగారికొకటి ఒకటేనా.. ఒకటేనా.. ఎన్నైనా.. ఎన్నెన్నో.. మనసు నిలుపుకోలేక.. మరీ మరీ అడిగాను.. అంతే ..అంతే.. అంతే.. కుశలమా... హాయ్ చరణం: 2 పెరటిలోని పూలపానుపు... త్వర త్వరగా రమ్మంది. పొగడ నీడ పొదరిల్లో.. దిగులు దిగులుగా ఉంది. ఎన్ని కబురులంపేనో.. ఎన్ని కమ్మలంపేనో పూలగాలి రెక్కలపైనా.. నీలిమబ్బు పాయలపైనా అందేనా.. ఆ.. ఒకటైనా..ఆ.. ఆ ఆ అందెనులే... తొందర తెలిసెనులే ఇన్నినాళ్ళు వదలలేక - ఏదో ఏదో రాశాను అంతే .. అంతే.. అంతే..
మారాలి మారాలి.. పాట సాహిత్యం
చిత్రం: బలిపీఠం (1975) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: సినారె గానం: ఎస్.పి. బాలు, సుశీల పల్లవి: మారాలి మారాలి.. మనుషుల నడవడి మారాలి మారాలి మారాలి.. మనుషుల నడవడి మారాలి మారాలి మారాలి.. మనుషుల నడవడి మారాలి తరతరాలుగా మారని వాళ్లను.. మీ తరమైనా మార్చాలి మారాలి మారాలి.. మనుషుల గారడి మారాలి మారాలి మారాలి.. మనుషుల గారడి మారాలి మెప్పుల కోసం చెప్పేవాళ్లను.. మీ తరమైనా మార్చాలి మారాలి మారాలి.. మనుషుల గారడి మారాలి చరణం: 1 అందరు దేవుని సంతతి కాదా.. ఎందుకు తరతమ భేదాలు అందరు దేవుని సంతతి కాదా.. ఎందుకు తరతమ భేదాలు అందరి దేవుడు ఒకడే ఐతే.. అందరి దేవుడు ఒకడే ఐతే.. ఎందుకు కోటి రూపాలు అందరి రక్తం ఒకటే కాదా.. ఎందుకు కులమత భేదాలు అందరి రక్తం.... ఒకటే అయితే.. అందరి రక్తం.... ఒకటే అయితే.. ఎందుకు రంగుల తేడాలు మారాలి మారాలి.. మనుషుల గారడి మారాలి మారాలి మారాలి.. మనుషుల నడవడి మారాలి చరణం: 2 తెలిసి తెలిసి బురద నీటిలో.. ఎవరైనా దిగుతారా ఆ బురదలోనే అందాల కమలము.. పుడుతుందని మరిచేరా కమలం కోసం బురదలోనే.. కాపురముండేదెవరు మనసులోని బురద కడుగుకొని.. మనుషుల్లా బతికేవారు సమధర్మం చాటేవారు.. సమధర్మం చాటేవారు వారిదే ఈనాటి తరం.. వారిదే రానున్న యుగం వారిదే ఈనాటి తరం.. వారిదే రానున్న యుగం కాదనే వారు.. ఇంకా కళ్లు తెరవనివారు మేలుకోక తప్పదులే.. మేలుకోక తప్పదులే మారిపోక తప్పదులే.. తప్పదులే... మారాలి మారాలి.. మనుషుల నడవడి మారాలి మారాలి మారాలి.. మనుషుల నడవడి మారాలి తరతరాలుగా మారనివాళ్లను.. మీ తరమైనా మార్చాలి మారాలి మారాలి.. మనుషుల నడవడి మారాలి
కలసి పాడుదాం తెలుగు పాట పాట సాహిత్యం
చిత్రం: బలిపీఠం (1975) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: శ్రీశ్రీ గానం: యస్.పి. బాలు పల్లవి: కలసి పాడుదాం తెలుగు పాట.. కదలి సాగుదాం వెలుగుబాట తెలుగువారు నవజీవన నిర్మాతలనీ.. తెలుగుజాతి సకలావనికే జ్యోతియనీ కలసి పాడుదాం తెలుగు పాట.. కదలి సాగుదాం వెలుగుబాట చరణం: 1 కార్యశూరుడు వీరేశలింగం కలంపట్టి పోరాడిన సింగం దురాచారాల దురాగతాలను తుదముట్టి౦చిన అగ్నితరంగం అడుగో.. అతడే.. వీరేశలింగం మగవాడెంతటి ముసలాడైనా మళ్ళీ పెళ్ళికి అర్హత వుంటే బ్రతుకే తెలియని బాల వితంతువుకెందుకు లేదా హక్క౦టాను చేతికి గాజులు తొడిగాడు చెదిరిన తిలకం దిద్దాడు..... మోడు వారిన ఆడబ్రతుకుల పసుపూ కుంకుమ నిలిపాడు.. నిలిపాడు కలసి పాడుదాం తెలుగు పాట... కదలి సాగుదాం వెలుగుబాట చరణం: 2 అడుగో.. అతడే.. గురజాడ మంచిచెడ్డలు లోకమందున ఎంచి చూడగా రెండే కులములు మంచిచెడ్డలు లోకమందున ఎంచి చూడగా రెండే కులములు మంచియన్నది మాలయైతే... మాల నేనౌతాను.. మాల నేనౌతాను అన్నాడు..... కలసి పాడుదాం తెలుగు పాట.. కదలి సాగుదాం వెలుగుబాట తెలుగువారు నవజీవన నిర్మాతలనీ... తెలుగుజాతి సకలావనికే జ్యోతియనీ కలసి పాడుదాం తెలుగు పాట... కదలి సాగుదాం వెలుగుబాట
టక్కు టిక్కు టక్కులాడి బండి పాట సాహిత్యం
చిత్రం: బలిపీఠం (1975) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: కొసరాజు గానం: యస్.పి. బాలు, యస్.జానకి టక్కు టిక్కు టక్కులాడి బండిరా అబ్బో అబ్బో యిది వట్టి మొండిరా | పొట్టి బండిరా గట్టి బండిరా - మిడిసిపడుతోందిరా లెఫ్ట్ రైట్ తెలియని డ్రైవరూ సీటు మీద కూర్చుంటే కంగారు ముందు కనబడదు వెనక వినబడదు బుర్ర పని చెయ్యదూ నొక్కుతుంటే దీని మోత చూడాలిరా పక్క వాళ్లు హడిలి చచ్చిపోవాలిరా చిర్రు బుర్రు మంటుంది బిర్ర బిగుసు కుంటుంది చెప్పినట్టు వినకుందిరా కర్మగాలీ చేతగాని డ్రైవరుకు చిక్కావే ఈ జన్మకూ జాలి తలిచి సర్దుకోవే.... పోచుకోలు మాటలు పిచ్చి పిచ్చి పాటలు కట్టి పెట్టమని చెప్పవే.... హహహ... . టక్క టిక్కు తమాషాల బండిరా బలే బలే మోటారు బండిగా సరదా బండిరా ! జలసా బండిరా ! జోరుగ పోతుందిరా...
ఏసుకుందాం బుడ్డోడ పాట సాహిత్యం
చిత్రం: బలిపీఠం (1975) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: కొసరాజు గానం: పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం ఏసుకుందాం బుద్దోడా - ఏసుకుందాము అరకాయ - ఏసుకుందాం అరకోణ్ణి కోసుకుందాం అర్దరేతిరి దాకా అంతు చూసు కుందాము కల్లు తాగినవాడు కన్నయ్య కొడుకు సారాయి తాగినోడు సాంబయ్య కొడుకు బ్రాందీ తాగినవాడు బ్రెమ్మయ్య కొడుకు ఏమీ తాగనివాడు ఎర్రిముండా కొడుకో.... ఓరి నీ యవ్వ ... ఏంజెప్పావురా... అయిదు రూపాయ్ లిచ్చినాసరె - శేరు బియ్యం కరువురా అదురూపాయ్ పెట్టినా అరె కోడి గుడ్డుకు కరుపురా ఇందుగలదూ అందు లేదని సందేహము వద్దురా ... అయ్యో ! సందు గొందుల ఎందు జూచిన మందు కరువే లేదుగదరా : ఓరి నీ యవ్వ ... ఎత్తరా సీసా యెహె...
No comments
Post a Comment