చిత్రం: బంగారు చెల్లెలు (1979) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: శోభన్ బాబు, జయసుధ, శ్రీదేవి, మురళీమోహన్ మాటలు: సత్యానంద్ దర్శకత్వం: బోయిన సుబ్బారావు నిర్మాత: టి.త్రివిక్రమ రావు బ్యానర్: విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ విడుదల తేది: 29.03.1979
Songs List:
విరిసిన సిరిమల్లి.. పాట సాహిత్యం
చిత్రం: బంగారు చెల్లెలు (1979) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు పల్లవి: విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి పాలవెల్లి పుట్టిన తల్లి... నా చెల్లి విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి చరణం: 1 రుక్మిణి వలచింది శ్రీకృష్ణుని... అన్నయ్య అన్నాడు అది తగదని రుక్మిణి వలచింది శ్రీకృష్ణుని... అన్నయ్య అన్నాడు అది తగదని రాయబారమంపింది రా రమ్మని.... రాయబారమంపింది రా రమ్మని పెళ్ళాడి వెళ్ళింది దొంగదారిని... నా చెల్లెలే రుక్మిణైతే... రానిస్తానా ఆ గతిని కాళ్ళు కడిగి తెస్తాను... తాను కోరుకున్నవాడిని విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి చరణం: 2 కైక లేని రాముడు నీ కరమును పట్టాలి... కానకెళ్లకే లవకుశులు నీ కడుపున పుట్టాలి కైక లేని రాముడు నీ కరమును పట్టాలి... కానకెళ్లకే లవకుశులు నీ కడుపున పుట్టాలి రామా రామా అన్న కవలలు మామా మామా అని పిలవాలి రామా రామా అన్న కవలలు మామా మామా అని పిలవాలి అన్నయ్య కన్నుల ఆనందాశ్రువులు అక్షితలవ్వాలి అన్నయ్య కన్నుల ఆనందాశ్రువులు అక్షితలవ్వాలి విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి చరణం: 3 అన్నే అమ్మగ పెరిగిన చెల్లి... అన్నెంపున్నెం ఎరుగని తల్లి అన్నే అమ్మగ పెరిగిన చెల్లి... అన్నెంపున్నెం ఎరుగని తల్లి కన్నతల్లి కాంచిన కలలీ అన్నయ్య కంటికి రావాలి కన్నతల్లి కాంచిన కలలీ అన్నయ్య కంటికి రావాలి అవి అన్నీ పండాలి... నా పండుగ కావాలి అవి అన్నీ పండాలి... నా పండుగ కావాలి పాలవెల్లి పుట్టిన తల్లి... నా చెల్లి విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి
అన్నయ్య హృదయం దేవాలయం పాట సాహిత్యం
చిత్రం: బంగారు చెల్లెలు (1979) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు పల్లవి: అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం..ఊఁ..ఊఁ.. అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం అనురాగమే కొలువున్న దైవం అనుబంధమే గోపురం మా అనుబంధమే గోపురం అన్నయ్య హృదయం దేవాలయం..ఊఁ..ఊఁ.. చరణం: 1 పంచుకున్నది ఒకటే రక్తం.. పెంచుకున్నది ఒకటే పాశం పంచుకున్నది ఒకటే రక్తం.. పెంచుకున్నది ఒకటే పాశం బ్రతుకున్నది ఆ పాశం కోసం.. బ్రతుకున్నది ఆ పాశం కోసం.. కోరుకునేది ఇద్దరి క్షేమం అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం అన్నయ్య హృదయం దేవాలయం.. ఊఁ..ఊఁ. చరణం: 2 ఊయలలూపి జోలలు పాడే తల్లినెరగను.. మోసుకు తిరిగి... ముచ్చట తీర్చే తండ్రినెరగను.. కళ్ళు తెరిచి నే చూచినదే ఈ కరుణామూర్తిని మాట నేర్చి నే పిలిచినదే అన్నా అన్నది అన్నయ్య హృదయం దేవాలయం.. చరణం: 3 కృష్ణుడు పలికిన గీతవాక్కు.. వేదం అయినా ఎందుకు నాకూ..ఊ.. కృష్ణుడు పలికిన గీతవాక్కు.. వేదం అయినా ఎందుకు నాకు నా పాలి వేదం అన్నయ్య పలుకు.. నా పాలి వేదం అన్నయ్య పలుకు.. అన్నయ్య నవ్వే నా దారి వెలుగు.... అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం అనురాగమే కొలువున్న దైవం అనుబంధమే గోపురం మా అనుబంధమే గోపురం అన్నయ్య హృదయం దేవాలయం..ఊఁ..ఊఁ..
పసుపు కుంకుమ తెస్తాడు పాట సాహిత్యం
చిత్రం: బంగారు చెల్లెలు (1979) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల పల్లవి: పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు పట్టిన చేయి విడవని రాజుకు.. పట్టపు రాణిని ఔతాను పట్టిన చేయి విడవని రాజుకు.. పట్టపు రాణిని ఔతాను పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు చరణం: 1 మబ్బులలోనా దాగున్నా... మచ్చే ఎరుగని చెందురుడు మబ్బులలోనా దాగున్నా... మచ్చే ఎరుగని చెందురుడు మమతల వెన్నెల కురిపిస్తాడు... మనుగడ పున్నమి చేస్తాడు మమతల వెన్నెల కురిపిస్తాడు... మనుగడ పున్నమి చేస్తాడు అహహ...ఆ... ఆ... అహహాహా... ఆ... ఆ... ఆ... పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు చరణం: 2 నా నీడనే నేను వెతికాను... ఆ జాడ తెలియక నిలిచాను నా నీడనే నేను వెతికాను... ఆ జాడ తెలియక నిలిచాను పిచ్చిప్రేమకు కళ్ళే లేవని పెద్దలు అన్నది నిజమేను పిచ్చిప్రేమకు కళ్ళే లేవని పెద్దలు అన్నది నిజమేను అహహ...ఆ... ఆ... అహహాహా... ఆ... ఆ... ఆ... పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు పట్టిన చేయి విడవని రాజుకు.. పట్టపు రాణిని ఔతాను పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు ఆ.... ఆ... ఆ... ఆ... ఆ... ఉహ్మ్మ్... ఉహ్మ్... ఉహ్మ్....
ముందు వెనకా వేటగాళ్లు... పాట సాహిత్యం
చిత్రం: బంగారు చెల్లెలు (1979) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, యస్.పి.బాలు పల్లవి: ముందు వెనకా వేటగాళ్లు... ముద్దులాడే జంట లేళ్లు ప్రేమా.. ఎంత ప్రేమా... అమ్మమ్మ.. ఏదమ్మా... కొండకోన పొదరిల్లు.. గుండెలోనా పడకటిల్లు ప్రేమా.. అదే ప్రేమా అమ్మమ్మా.. ఔనమ్మా చరణం: 1 అడవి గాలిలా నన్ను కమ్ముకో.. ఉమ్మ్ అయోద్య రాముడల్లే ఆదుకో.. బంగారు లేడి నిన్ను అడగను పో.. శృంగార రామూడివై ఏలుకో... నా అందాల ఏలికవై ఉండిపో.. ముందు వెనకా వేటగాళ్లు... ముద్దులాడే జంట లేళ్లు ప్రేమా.. ఎంత ప్రేమా... అమ్మమ్మా.. ఔనమ్మా చరణం: 2 ఆ...ఆ.. ఆ... ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. అహ.. హా.. నీలాల నీ కురుల దుప్పటిలో...సిరిమల్లెపూల చిలిపి అల్లరిలో నీ వయసు మెరిసింది కన్నులలో.. నా మనసు ఉరిమింది చూపులలో నే కరగాలి నీ కన్నే కౌగిలిలో... అమ్మమ్మ..ఏదమ్మా... కొండకోన పొదరిల్లు.. గుండెలోనా పడకటిల్లు ప్రేమా.. అదే ప్రేమా అమ్మమ్మా.. ఏదమ్మా చరణం: 3 నా గుండెలో నీ తల దాచుకో నా ఎండలో నీ చలి కాచుకో.. నా వన్నెచిన్నెలన్నీ పంచుకో.. నన్నింక నీలోనే పంచుకో... ఈ గురుతునే బ్రతుకంతా ఉంచుకో అమ్మమ్మా.. ఔనమ్మా ముందు వెనకా వేటగాళ్లు... ముద్దులాడే జంట లేళ్లు ప్రేమా.. అదే ప్రేమా... అమ్మమ్మ..ఏదమ్మా... అమ్మమ్మ..ఏదమ్మా...
చలి.. జ్వరం.. పాట సాహిత్యం
చిత్రం: బంగారు చెల్లెలు (1979) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, యస్.పి.బాలు పల్లవి: చలి.. జ్వరం.. చలి.. జ్వరం.. ఇది.. చెలి జ్వరం చలి.. జ్వరం.. చలి.. జ్వరం.. ఇది.. చెలి జ్వరం మల్లెపూలు ముసిరినా.. పిల్లగాలి విసిరినా.. మాపకేళ్ళకొస్తుంది ప్రతిదినం.. చలి.. జ్వరం.. చలి.. జ్వరం.. ఇది చలి జ్వరం చందమామ పొడిచినా..అందగాడు పిలిచినా సందెవేళకొస్తుంది ప్రతిదినం.. చలి.. జ్వరం.. చలి.. జ్వరం.. ఇది చలి జ్వరం చరణం: 1 మాట వినను పొమ్మన్న మనసుల్లో.. మాటమాట రమ్మన్న వయసుల్లో మాట వినను పొమ్మన్న మనసుల్లో.. మాటమాట రమ్మన్న వయసుల్లో ముసిముసి నవ్వులూ.. విసిరే కవ్వింతలో.. కసికసిగా పెనవేసే కౌగిలింతలో ముసిముసి నవ్వులూ.. విసిరే కవ్వింతలో.. కసికసిగా పెనవేసే కౌగిలింతలో ఒకరికొకరు మందంది వింత జ్వరం.. ఆహా..ఒకరికొకరు మందంది వింత జ్వరం ఇద్దరు ఇచ్చిపుచ్చుకొమ్మంది.. ఏమి జ్వరం..ఇది ఏమి జ్వరం.. మ్మ్..చలి.. జ్వరం.. చలి.. జ్వరం.. ఇది.. చెలి జ్వరం మల్లెపూలు ముసిరినా.. పిల్లగాలి విసిరినా.. మాపకేళ్ళకొస్తుంది ప్రతిదినం.. చలి.. జ్వరం.. చలి.. జ్వరం.. ఇది చలి జ్వరం.. చరణం: 2 మబ్బులెంత కురిసినా తడవదూ.. ఆకాశం తడవదూ మాటలెన్ని చెప్పినా తీరదు.. ఆరాటం తీరదు మబ్బులెంత కురిసినా తడవదూ.. ఆకాశం తడవదూ మాటలెన్ని చెప్పినా తీరదు..ఆరాటం తీరదు తొలకరి చినుకులే ఏరులైన తీరులో.. ఇరువురు ఏకమై ఎల్లువైన వేళలో తొలకరి చినుకులే ఏరులైన తీరులో.. ఇరువురు ఏకమై ఎల్లువైన వేళలో ఎప్పుడెప్పుడంటుంది ఏమి జ్వరం.. ఆహా..ఎప్పుడెప్పుడంటుంది ఏమి జ్వరం పెళ్ళెప్పుడెప్పుడంటుంది ప్రేమ జ్వరం.. మన ప్రేమ జ్వరం చలి.. జ్వరం.. చలి.. జ్వరం.. ఇది.. చెలి జ్వరం చందమామ పొడిచినా..అందగాడు పిలిచినా సందెవేళకొస్తుంది ప్రతిదినం.. చలి.. జ్వరం.. చలి.. జ్వరం.. ఇది.. చెలి జ్వరం మ్మ్..చలి.. జ్వరం.. చలి.. జ్వరం.. ఇది..చలి జ్వరం
అన్నయ్య హృదయం దేవాలయం (Female) పాట సాహిత్యం
చిత్రం: బంగారు చెల్లెలు (1979) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల పల్లవి: అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం..ఊఁ..ఊఁ.. అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం అనురాగమే కొలువున్న దైవం అనుబంధమే గోపురం మా అనుబంధమే గోపురం అన్నయ్య హృదయం దేవాలయం..ఊఁ..ఊఁ.. చరణం: 1 పంచుకున్నది ఒకటే రక్తం.. పెంచుకున్నది ఒకటే పాశం పంచుకున్నది ఒకటే రక్తం.. పెంచుకున్నది ఒకటే పాశం బ్రతుకున్నది ఆ పాశం కోసం.. బ్రతుకున్నది ఆ పాశం కోసం.. కోరుకునేది ఇద్దరి క్షేమం అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం అన్నయ్య హృదయం దేవాలయం.. చరణం: 2 ఊయలలూపి జోలలు పాడే తల్లినెరగను..ఊ.. మోసుకు తిరిగి ముచ్చట తీర్చే తండ్రినెరగను..ఊ.. కళ్ళు తెరిచి నే చూచినదే ఈ కరుణామూర్తిని మాట నేర్చి నే పిలిచినదే ' అన్నా ' అన్నది అన్నయ్య హృదయం దేవాలయం.. చరణం: 3 కృష్ణుడు పలికిన గీతవాక్కు.. వేదం అయినా ఎందుకు నాకూ..ఊ.. కృష్ణుడు పలికిన గీతవాక్కు.. వేదం అయినా ఎందుకు నాకు నా పాలి వేదం అన్నయ్య పలుకు.. నా పాలి వేదం అన్నయ్య పలుకు.. అన్నయ్య నవ్వే నా దారి వెలుగు..ఊ.. అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం అనురాగమే కొలువున్న దైవం అనుబంధమే గోపురం మా అనుబంధమే గోపురం అన్నయ్య హృదయం దేవాలయం..ఊఁ..ఊఁ..
లగ్గం పెడితే లగెత్తుకోచ్చా పాట సాహిత్యం
చిత్రం: బంగారు చెల్లెలు (1979) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎల్.ఆర్.ఈశ్వరి లగ్గం పెడితే లగెత్తు కొచ్చా - సైఁరో జంబైరో సరైన మొగుడు సరకారోడు ఎవడో ఏడున్నాడో నగలూ నాణెం అన్నీ వున్నై వగలూ వాటం ఎన్నో వున్నై పదహారేళ్లూ పద పద మంటే బందరు బండీ ఎక్కాను సిలకఅరిస్తే నన్నాను సిలకలపూడి అనుకొన్నాను - ఈ ఎలకల బోనులో పడిపోయాను కన్నూ కన్నూ కలిసేవున్నై నిన్నూ నన్నూ కలవాలన్నై చల్లని జాబిలి సలసలమంటె చెప్పలేని గిలిదాచాను చెట్టు నీడకే వచ్చాను. మీ చేతిలోన పడిపోయాను చుక్క పొడి స్తే చక్కర కేళీ ఈ పొద్దు గడిస్తే సర్వం ఖాళీ
ఈశానాం జగతోస్య పాట సాహిత్యం
చిత్రం: బంగారు చెల్లెలు (1979) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డివోషనల్ గానం: పి.సుశీల ఈశానాం జగతోస్య వేంకటపతేర్విష్ణోః పరాంప్రేయసీం తద్వక్షస్థ్యం నిత్యవాసర సికాంతతాన్తి సంవర్ణనీం పద్మాలఙ్కృత పాణి పల్లవ యుగాం పద్మాసన స్ధాంశ్రియం వాత్సల్యాదిగుణో జ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్
No comments
Post a Comment