చిత్రం: దొరబాబు (1974) సంగీతం: జె.వి.రాఘవులు నటీనటులు: నాగేశ్వర రావు , మంజుల, చంద్రకళ దర్శకత్వం: తాతినేని రామారావు నిర్మాత: జె. సుబ్బారావు, జి. రాజేంద్రప్రసాద్ విడుదల తేది: 31.10.1974
Songs List:
దేవుడెలా వుంటాడని పాట సాహిత్యం
చిత్రం: దొరబాబు (1974) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: దేవుడెలా వుంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా వుంటాడని అంటాను నేను అనురాగమెలా వుంటుందని ఎవరైనా అడిగితే మా చెల్లిలా వుంటుందని చెబుతాను నేను చరణం: 1 చెల్లెలున్న యీ యిల్లే సిరిమల్లె తోట మా....ఆమ్మలు చిరునవ్వే ముత్యాల మూట అన్నయ్య హృదయమే అందాల మేడ చెల్లాయికి కలకాలం అది చల్లని నీడ కన్నతల్లి తీపికలల రూపాలం మనము కోవెలలో వెలిగించిన దీపాలం మనము చరణం: 2 అల్లారు ముదుగా నను పెంచినావు అమ్మనూ నాన్ననూ మరిపించినావు ఇల్లాలివై నీవు విలసిల్ల వమ్మా పాపలతోటి చల్లగా వుండవమ్మా పుట్టినింటవున్నా, మెట్టినింటవున్నా అన్నయ్య దీవనే శ్రీరామరక్ష
చంద్రగిరి చంద్రమ్మా పాట సాహిత్యం
చిత్రం: దొరబాబు (1974) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల, కోరస్ పల్లవి: చంద్రగిరి చంద్రమ్మా - సందేళ కొస్తానమ్మా అందాక నలగిపోక - అలసిపోక వుండమ్మా చంద్రగిరి చంద్రయ్యా - సందేళ కొస్తానయ్యా అందాక పనిచేసి - ఆకలేసి వుండయ్యా చరణం: వలమాలిన వయసేమో వెలువంటిది దాని కాశయాల కానకట్ట వేసుకోవాలి కోరస్: ఆనకట్టనే వేసుకోవాలి ఆడది మగవాడు ఆడుతూ పాడుతూ దాన్ని మళ్ళించి మంచితనం పండించాలి చరణం: మట్టినీళ్ళల్లా మనమేకం కావాలి చెట్టాపట్టగ చేయిపట్టి నడవాలి కోరస్ : పట్టి నడవాలి పుట్టినందు కేదైన గట్టి పనిచేయాలి పుట్టబోయేవాళ్ళు మన పేరు చెప్పుకోవాలి చరణం: కావేరి గోదారి గంగా కృషమ్మలను కలిపేసి నిలవేసి కక్షలను మాపాలి కోరస్: కక్షలను మాపాలి ప్రతిపల్లె పెళ్ళికాని పడుచుపిల్ల కావాలి పంటలక్ష్మి యింటింటా భరతనాట్యమాడాలి
అమ్మమ్మొ.... యీ గుంటడు పాట సాహిత్యం
చిత్రం: దొరబాబు (1974) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: మైలవరపు గోపి గానం: రామకృష్ణ, పి.సుశీల పల్లవి: అమ్మమ్మొ.... యీ గుంటడు ఎంతకిలాడి గుచ్చిగుచ్చి చంపుతడు కళ్ళతోటి-దొంగకళ్ళతోటి అన్నన్న.... యీ కుర్రది టక్కులాడి బులిపించి చంపుతది మాటలాడి మాయమాటలాడి చరణం: 1 నీ చెవిలో ఏదో మంత్రమున్నది తాకగానే నా గుండె కొట్టుకుంటది చంద్రం తాకితేనే నీ గుండె కొట్టుకుంటది తాకకుంటె నా గుండె ఆగిపోతది చరణం: 2 నీ కంట్లో నా నీడ వెచ్చగుంటది నాకేమో ఆ వేడి ధక్క నంటది నీడైతే నా కంట్లో కుదురుగుంటది నువ్వైతే నా ఒళ్లు అలసిపోతది చరణం: 3 నీ సొగసే నా చూపుకి తిండి పెడతది పిసినిగొట్టు నీ మనసే కసిరికొడతది చూపుతో నీ వయసుకు కరువు తీరదు తీరిస్తే నా సిగ్గుకు పరువు మిగలదు
నీకూ నాకూ పెళ్ళంటే పాట సాహిత్యం
చిత్రం: దొరబాబు (1974) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: చెరువు ఆంజనేయ శాస్త్రి గానం: రామకృష్ణ, పి.సుశీల పల్లవి: నీకూ నాకూ పెళ్ళంటే నింగి నేలా మురిశాయి వయసూ సొగసూ కలిబోసి రంగవెల్లి వేశాయి చరణం: 1 కొత్త కొత్త కోరికలేవో నాలో చెలరేగాయి కౌగిలిలో బంధిస్తేనే కలత నిదురపోతాయి తెలిసింది నీ ఎత్తు ఆ ఎత్తే గమ్మత్తు సందెలో విందులా విందులో — పొందులా చరణం: 2 ఏడడుగులు నడిచావటే ఎండమొహం చూడనీయను వలపు జల్లు తడిసిన ఒళ్లు ఎక్కడ ఆరేసుకోను నాలోనే వేడుంది నీ ధోరణి బావుంది ఎండలో - వానలా వానలో - హాయిలా చరణం: 3 మూడు ముళూ వేయకముందే నన్నల్లరి చెయ్యొద్దు ఇల్లాలినవి కావాలంటే యివ్వాలి తొలిముద్దు ఏమిటి యీ చిలిపితనం అంతేలే కుర్రతనం పూవులో - తేటిలా తేటిలో - పాటలా
వద్దు వద్దు వద్దు పాట సాహిత్యం
చిత్రం: దొరబాబు (1974) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: ఆత్రేయ గానం: రామకృష్ణ, పి.సుశీల వద్దు వద్దు వద్దు ముద్దు యివ్వొద్దు అది తేనెకన్న తియ్యనని చెప్పొద్దు నాకు చెప్పొద్దు వద్దు వద్దు వద్దు ముద్దు వద్దనవద్దు దాని తీపిఎంతో తెలిసికోక చెప్పద్దు వద్దుచెప్పద్దు చరణం: 1 నా పెదవిపై పేరువుంది చదువుకో నా హృదయమందు రూపముంది చూసుకో దొరబాబు ఆ పేరు నాదని, రూపు నాదని నీ చెంప ఎరుపు చెప్పకే చెప్పింది ఒప్పుకోమంది చరణం: 2 గుప్పెడంత గుండెలోన గుట్టుంది విప్పలేని చిక్కుముడై వేసింది చిక్కుముడిని పంటనొక్కి విప్పుకోవచ్చు గుట్టులన్ని కళ్ళతోటి చెప్పుకోవచ్చు చరణం: 3 పాట వింటు పరవశించి పోవద్దు ఆట కట్టి పోవునని అనుకోవద్దు పాట పాడినా పరవశించినా పగబట్టిన నాగుబాము పడగ దించునా కాటు మానునా ?
ఒంటరిగా వున్నాను పాట సాహిత్యం
చిత్రం: దొరబాబు (1974) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: మైలవరపు గోపి గానం: రామకృష్ణ, పి.సుశీల పల్లవి: ఒంటరిగా వున్నాను ఇస్సిరిస్సు రంటున్నాను ఇంతకన్న ఏం చెప్పుకోనురో బావయ్యో యిడమరిచి చెప్పుకుంటే సిగ్గయ్యో పక్కన నేనున్నాను ఆవురావురంటున్నాను దారిలేక ఆగానమ్మో చిట్టమ్మో కంటికేమో కునుకు రాదు ఒట్టమ్మో నా మనసుకు బుద్దిలేదు పదారేళ్లుగా బుద్దొచ్చి మరుగుతోంది నాలుగేళ్లుగా నా మోజుకు రంజులేదు నువ్వు చేరకా రంజులోన లబ్జులేదు కోర్కెతీరకా పొద్దు పొడుపు యెందుకనో చురుక్కుమంటది పొద్దు గుంకితే నాలో కలుక్కుమంటది పొద్దుకైన వొకరైతే చులకనే మరి ఇద్దరమూ వొకటైతే వోడిపోతది…
రారా పడకింటికి పాట సాహిత్యం
చిత్రం: దొరబాబు (1974) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల రారా పడకింటికి నిదుర రాదూ నా కంటికి తగిన మందివ్వరా - రగిలే నా ఒంటికి ఎందుకు పడకింటికి పోదాములే పొదరింటికి తగిన మందుందిలే రగిలే నీ ఒంటికి .... చరణం: వెచ్చగా చలివేసింది. మత్తుగా మసకేసింది కొత్తమోజు రేగింది అది పిచ్చిగా నినుకోరింది మోజే ప్రేమయితే - ప్రేమే పిచ్చయితే ఆ పిచ్చి ముదిరితే - నీ మనసు బెదిరితే ఆఁ... అందుకే చరణం: ఆడదాని వలపులు ఏటిలోని తరగలు ఏ గాలికి అవి చెదురునో ఏ గట్టు తాకీ విరుగునో నీలాంటి దొరబాబే నా జంటగా వుంటే నా మనసు చెదిరిపోదు యీ వలపు విరిగిపోదు ఆహాఁ ... అయితే ఎందుకు పొదరింటికి - పోదాములే పడకింటికీ తగిన మందుందిలే రగిలే నీ వొంటికీ
No comments
Post a Comment