చిత్రం: గుడిగంటలు (1964) సంగీతం: ఘంటసాల నటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణకుమారి మాటలు: ముళ్ళపూడి వెంకట రమణ దర్శకత్వం: వి.మధుసూధనరావు నిర్మాతలు: సుందర్లాల్ నహత, డూండి విడుదల తేది: 14.01.1964
Songs List:
నీలి కనుల పాట సాహిత్యం
చిత్రం: గుడిగంటలు (1965) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సి. నారాయణ రెడ్డి గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల నీలి కనుల
నీ కను దోయని పాట సాహిత్యం
చిత్రం: గుడిగంటలు (1965) సంగీతం: ఘంటసాల సాహిత్యం: నర్ల చిరంజీవి గానం: ఎస్. జానకి నీ కను దోయని
దూరాన నీలి మేఘాలు పాట సాహిత్యం
చిత్రం: గుడిగంటలు (1965) సంగీతం: ఘంటసాల సాహిత్యం: ఆరుద్ర గానం: పి. సుశీల దూరాన నీలి మేఘాలు
ఎవరికి వారు పాట సాహిత్యం
చిత్రం: గుడిగంటలు (1965) సంగీతం: ఘంటసాల సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల ఎవరికి వారౌ స్వార్ధంలో హృదయాలరుదౌ లోకంలో ఎవరికి వారౌ స్వార్ధంలో హృదయాలరుదౌ లోకంలో నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే నాకమృతం తెచ్చిన జాబిలివే ధనము కోరి మనసిచ్చే ధరణి మనిషిని కోరి వచ్చావే నా అనువారే లేరని నేను కన్నీ రొలికే కాలంలో ఉన్నానని నా కన్న తల్లివలే ఒడిని జేర్చి నన్నోదార్చావే నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే నాకమృతం తెచ్చిన జాబిలివే ప్రేమ కొరకు ప్రేమించే వారే కానరాక గాలించాను గుండెను తెరచి ఉంచాను గుడిలో దేవుని అడిగాను గంటలు గణ గణ మ్రోగాయి నా కంటిపాప నువ్వన్నాయి నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే నాకమృతం తెచ్చిన జాబిలివే ఈ అనురాగం ఈ ఆనందం ఎవ్వరెరుగని ఈ అనుబందం ఈ అనురాగం ఈ ఆనందం ఎవ్వరెరుగని ఈ అనుబందం ఊడలు పాకీ నీడలు పరిచీ ఉండాలి వెయ్యేళ్ళు చల్లగా ఉండాలి వెయ్యేళ్ళు తియ్యగ పండాలి మన కలలు ఎవరికి వారౌ స్వార్ధంలో హృదయాలరుదౌ లోకంలో నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే నాకమృతం తెచ్చిన జాబిలివే
నీలోన నన్నే పాట సాహిత్యం
చిత్రం: గుడిగంటలు (1965) సంగీతం: ఘంటసాల సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల పల్లవి: నీలోన నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవో ఓ ఏ కవి భావనవో చరణం: 1 ఎల్లోర గుహలో పిల్ల ఉంది నీలో నండూరివారి ఎంకి ఉంది నీలో అల విశ్వనాథ చెలి కిన్నెరుంది మా బాపిరాజు శశికళ ఉంది... చరణం: 2 ఖయ్యాము కోలిచే సాకివి నీవే కవి కాళిదాసు శకుంతల నీవే ఖయ్యాము కోలిచే సాకివి నీవే కవి కాళిదాసు శకుంతల నీవే తొలి ప్రేమదీపం వెలిగించినావే తొలి పూలబాణం వేసింది నీవే...
జన్మమెత్తితి రా పాట సాహిత్యం
చిత్రం: గుడిగంటలు (1965) సంగీతం: ఘంటసాల సాహిత్యం: అనిశెట్టి గానం: ఘంటసాల జన్మమెత్తితిరా అనుభవించితిరా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా మంది గెలిచి మానవుడుగ మారినానురా.. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా స్వార్ధమను పిశాచి మదిని స్వారి చేసెరా బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా స్వార్ధమను పిశాచి మదిని స్వారి చేసెరా బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా దైవశక్తి మృగస్వభునే సంహరించెరా దైవశక్తి మృగస్వభునే సంహరించెరా సమర భూమి నా హృదయం శాంతి పొందెరా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా క్రోధ లోభ మోహములే పడగలెత్తెరా బుసలు గొట్టి గుండెలోన విషము గ్రక్కెరా క్రోధ లోభ మోహములే పడగలెత్తెరా బుసలు గొట్టి గుండెలోన విషము గ్రక్కెరా ధర్మ జ్యోతి తల్లివోలె ఆదరించెరా ధర్మ జ్యోతి తల్లివోలె ఆదరించెరా నా మనసే దివ్య మందిరముగా మారిపోయెరా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా మట్టి యందే మాణిక్యము దాగియుండురా మనిషియందే మహాత్ముని కాంచగలవురా మట్టి యందే మాణిక్యము దాగియుండురా మనిషియందే మహాత్ముని కాంచగలవురా ప్రతి గుండెలో గుడి గంటలు ప్రతిధ్వనించురా ప్రతి గుండెలో గుడి గంటలు ప్రతిధ్వనించురా ఆ దివ్య పదం న్యాయ పధం చూపగలుదురా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా
No comments
Post a Comment