చిత్రం: మల్లెపూవు (1978) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి, వీటూరి, ఆత్రేయ, ఆరుద్ర నటీనటులు: శోభన్ బాబు, జయసుధ, లక్ష్మీ దర్శకత్వం: వి.మధుసూధనరావు అసోసియేట్ డైరెక్టర్: ఎ. కోదండరామిరెడ్డి నిర్మాతలు: వి.ఆర్.యాచేంద్ర, కె.చటర్జీ విడుదల తేది: 26.02.1978 (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు: 1.యమగోల (1977) 2. మల్లెపువ్వు (1978) 3. విజయ (1979) 4. బొమ్మాబొరుసే జీవితం (1979) 5. చెయ్యెత్తి జై కొట్టు (1979) 6. జూదగాడు (1979) 7. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 8. మంగళ గౌరి (1980) ఈ ఎనిమిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )
Songs List:
మల్లెపువ్వులు వసంతం మా తోటకొచ్చింది పాట సాహిత్యం
చిత్రం: మల్లెపూవు (1978) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు మల్లెపువ్వులు వసంతం మా తోటకొచ్చింది
చక చక సాగే చక్కని బుల్లెమ్మా పాట సాహిత్యం
చిత్రం: మల్లెపూవు (1978) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి గానం: యస్.పి.బాలు, సుశీల పల్లవి: చక చక సాగే చక్కని బుల్లెమ్మా మిస మిస లాడే వన్నెల చిలకమ్మ నీ పేరేమిటో .. నీ ఊరేమిటో నీ పేరేమిటో .. నీ ఊరేమిటో గలగల పారే ఏరే నా పేరూ పొంగులు వారే వలపే నా ఊరూ చినదాననూ..నే చినదాననూ చినదాననూ..నే చినదాననూ చరణం: 1 కన్నులు చెదిరే.. వన్నెల చిలకా..నీ వయసే ఎంతా? కన్నులు చెదిరే.. వన్నెల చిలకా..నీ వయసే ఎంతా? చూపే కనులకు రాసే కవులకు ఊహకు రానంతా..ఊహకు రానంత.. అందీ అందక ఊరించే నీ మనసు లోతెంతా..హా ! మమతే ఉంటే.. ఏ ఏ.. దూరమెంతో లేదూ నా మనసే నీ వెంటే నీడల్లే ఉంటుంది కసి కసి చూపులు చూసే సోగ్గాడా ముసి ముసి నవ్వులు విసిరే మొనగాడా నీ పేరేమిటో .. నీ ఊరేమిటో నీ పేరేమిటో .. నీ ఊరేమిటో పదమును పాడే వేణువు నా పేరూ మధువులు చిందే కవితే నా ఊరూ చినవాడనూ..నే నీవాడనూ చినవాడనూ..నే నీవాడనూ చరణం: 2 వరసలు కలిపే.. ఓ చినవాడా..నీ వలపే ఎంతా? విలువే లేనిది..వెలకే రానిది..వలపే కొండంత..నా వలపే జీవితమంత నిన్నే కోరిన కన్నెబ్రతుకులో వెన్నెలా ఎపుడంటా..హో గుండెల గుడిలో దేవివి నీవంటా.. సయ్యంటే ఈ నాడే నీకూ నాకూ పెళ్ళంటా చల్లని గాలీ సన్నాయి ఊదిందీ పచ్చిక వెచ్చని పానుపు వేసిందీ కల నిజమైనదీ.. ప్రేమ ఋజువైనదీ కల నిజమైనదీ.. ప్రేమ ఋజువైనదీ
చిన్న మాట ఒక చిన్న మాట పాట సాహిత్యం
చిత్రం: మల్లెపూవు (1978) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల పల్లవి: చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట సందె గాలి వీచి సన్నజాజి పూసీ సందె గాలి వీచి సన్నజాజి పూసీ జలధరించే చల్లని వేళ చిన్న మాట ఒక చిన్న మాట ఆ.. చిన్న మాట ఒక చిన్న మాట చరణం: 1 రాక రాక నీవు రాగ వలపు యేరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా రాక రాక నీవు రాగ వలపు యేరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్విలిస్తే పూజ చేస్తా వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట.. మాట.. చిన్న మాట ఒక చిన్న మాట ఆ.. చిన్న మాట ఒక చిన్న మాట చరణం: 2 కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయె నీ పాటలోనే నే మాటనైతే నా మేను నీ వేణువాయే అందమంతా ఆరబోసి మల్లె పూల పానుపేసి వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు మాట.. మాట.. చిన్న మాట ఒక చిన్న మాట ఆ.. చిన్న మాట ఒక చిన్న మాట సందె గాలి వీచి సన్నజాజి పూసీ సందె గాలి వీచి సన్నజాజి పూసీ జలధరించే చల్లని వేళ చిన్న మాట ఒక చిన్న మాట ఆ.. చిన్న మాట ఒక చిన్న మాట
ఎవ్వరో ఎవ్వరో.... పాట సాహిత్యం
చిత్రం: మల్లెపూవు (1978) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు పల్లవి: ఎవ్వరో ఎవ్వరో.... ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగేవారెవ్వరో ఈ పాపం కడిగే దిక్కెవ్వరో ఎవ్వరో వారెవ్వరో... అందెలు సందడి చేసిన జాతరలో.. ఆకలేసి ఏడ్చిన పసికందులు అందం అంగడికెక్కిన సందులలో.. అంగలార్చి ఆడిన రాబందులు ఎందుకో ఈ చిందులు... ఎవరికో ఈ విందులు ఏమిటో ఏమిటో ఏ ధర్మం ఇది న్యాయం అంటుందో ఏ కర్మం ఈ గాయం చేసిందో? ఏమిటో.. ఆ ధర్మం ఏమిటో? చరణం: 1 శీలానికి శిలువలు.. కామానికి కొలువులు కన్నీటి కలువలు.. ఈ చెలువలు కదులుతున్న ఈ శవాలు.. రగులుతున్న శ్మశానాలు మదమెక్కిన మతితప్పిన.. నరజాతికి నందనాలు ఎప్పుడో ఎప్పుడో ఈ జాతికి మోక్షం ఇంకెప్పుడో ఈ గాధలు ముగిసేదింకెన్నడో? ఎన్నడో? మోక్షం ఇంకెప్పుడో? చరణం: 2 అత్తరు చల్లిన నెత్తురు జలతారులలో మైల పడిన మల్లెలు ఈ నవ్వులు కుక్కలు చింపిన విస్తరి తీరులలో ముక్కలైన బ్రతుకులు ఈ పూవులు ఎందరికో ఈ కౌగిళ్ళు.. ఎన్నాళ్ళో ఈ కన్నీళ్ళు ఎక్కడా ఎక్కడా ఏ వేదం ఇది ఘోరం అన్నదో ఏ వాదం ఇది నేరం అన్నదో? ఎక్కడో? ఆ వేదం ఎక్కడో? చరణం: 3 ఈ మల్లెల దుకాణాలు.. ఈ గానాబజానాలు వెదజల్లిన కాగితాలు.. వెలకట్టిన జీవితాలు.. వల్లకాటి వసంతాలు.. చస్తున్నా స్వాగతాలు కట్లు తెగిన దాహాలకు.. తూట్లు పడిన దేహాలు ఎక్కడో? ఎక్కడో? ఈ రాధల బృందావనమెక్కడో? ఈ బాధకు వేణుగానం ఎన్నడో? ఎన్నడో? ఎక్కడో? ఎప్పుడో?
నువ్వు వస్తావని బృందావని పాట సాహిత్యం
చిత్రం: మల్లెపూవు (1978) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి గానం: వాణీజయరాం (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ వీరిద్దరు పాటలు రచయితలు వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాయటం ఇది రెండవసారి. మొదటిగా, యమగోల (1977) లో అలాగే, మల్లెపువ్వు (1978) అంటే మళ్ళీ ఈ సినిమాలో రెండవసారి పాటలు రాశారు. తరువాత, మంగళ గౌరి (1980) ఈ మూడు సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి ) పల్లవి: నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా... కృష్ణయ్యా.. నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా... కృష్ణయ్యా వేణువు విందామని నీతో వుందామని... నీ రాధా వేచేనయ్యా రావయ్యా... ఓ.... గిరిధర... మురహర... రాధా మనోహరా... నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా..రావయ్యా.. చరణం: 1 నీవు వచ్చే చోట... నీవు నడిచే బాట మమతల దీపాలు వెలిగించాను మమతల దీపాలు వెలిగించాను కుశలము అడగాలని... పదములు కడగాలని కన్నీటి కెరటాలు తరలించాను ఓ....ఓ.... గిరిధర... మురహర... నా హృదయేశ్వరా.. నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా.... కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా.... చరణం: 2 నీ పద రేణువునైనా... పెదవుల వేణువునైనా బ్రతుకే ధన్యమని భావించానూ..బ్రతుకే ధన్యమని భావించానూ నిన్నే చేరాలని... నీలో కరగాలని... నా మనసే హారతిగా వెలిగించానూ.. గోవిందా గోవిందా గోవిందా .... గోపాలా.......
ఓహో..లలితా.. పాట సాహిత్యం
చిత్రం: మల్లెపూవు (1978) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, పి.సుశీల పల్లవి: ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా గగనవీణ సరిగమలు పాడగా.. ఆ ఆ ఆ ఆఆ నీ జఘనసీమ స్వరజతులనాడగా.. ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ తళత్తళలతో తరుణ కిరణ సంచలిత లలిత శృంగార తటిల్లత కదలగా కనులు చెదరగా.. కదలిరా..కవితలా..వలపుకే..వరదలా... ఓహో..హో..హో..లలితా.. నా ప్రేమ కవితా.. చరణం: 1 మల్లెపూవులు మధువు పొంగులా వెల్లువైన కవితా.. నీ కన్నెవయసు నా ఇంద్రధనుస్సుగా కదలిరావే నా లలితా గున్నమావిలా కన్నెమోవి సన్నాయి పాట వినిపించగా కవి మనస్సులో తొలి ఉషస్సు నా నుదుట తిలకమే ఉంచగా నీ అందాలే మకరందాలై మల్లె సుగంధం నాలో విరిసే సిగమల్లె పిలుపులో అందుకో సిరిమల్లె తీగవై అల్లుకో ఈ మల్లెపూవే నీ సొంతము కదలిరా.. కవితలా..వలపుకే వరదలా ఓహో హోహో లలితా నా ప్రేమకవితా నాప్రేమ కవితా చరణం: 2 వయసు తోటలో మనసు పాటలా వెల్లివిరిసెలే నీ కథా నా అణువు అణువు నీ వలపు వేణువై ఝుల్లుమన్నదీ నా ఎదా తెలుగు పాటలే జిలుగు పైటలై పరువాలే పలికించగా పూల ౠతువు నీ లేత పెదవిలో పున్నమలై పులకించగా నీ ఊహలలో నే ఊర్వశినై నీ కౌగిలికి నే జాబిలినై నీ కాలిమువ్వ నా కవితగా నా దారిదివ్వె నీ మమతగా ఈ మల్లెపూవే నా లలితగా కదలిరా కవితలా వలుపుకే వరదలా ఓహో హోహో లలితా నా ప్రేమకవితా నాప్రేమ కవితా
ఓ.. ప్రియా.. పాట సాహిత్యం
చిత్రం: మల్లెపూవు (1978) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి.బాలు పల్లవి: చేయి జారిన మణిపూస చెలియ నీవు తిరిగి కంటికి కనబడితీవు గాని చూపు చూపున తొలినాటి శోకవన్నె రేపుచున్నావు... ఎంతటి శాపమే ఓ.. ప్రియా.. మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తియ్యనిది మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తియ్యనిది మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినది.. చరణం: 1 సఖియా.. ఆ..ఆ.. నీవెంతటి వంచన చేశావు సిరిసంపదకమ్ముడు పోయావు సఖియా.. ఆ..ఆ.. నీవెంతటి వంచన చేశావు సిరిసంపదకమ్ముడు పోయావు విడనాడుట నీకు సులభం విడనాడుట నీకు సులభం నిను విడువదులే నా హృదయం.. ఓ.. ప్రియా.. మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తియ్యనిది మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినది.. చరణం: 2 తొలి ప్రేమకు ఫలితం కన్నీరు విరహానికి ఫలితం నిట్టూర్పు తొలి ప్రేమకు ఫలితం కన్నీరు విరహానికి ఫలితం నిట్టూర్పు చెలి చేసిన గాయం మానదులే..ఏ.. చెలి చేసిన గాయం మానదులే చెలరేగే జ్వాల ఆరదులే.. ఓ.. ప్రియా.. మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తియ్యనిది మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినది.. ఓ.. ప్రియా..
ఎవరికి తెలుసు.. పాట సాహిత్యం
చిత్రం: మల్లెపూవు (1978) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు పల్లవి: వలపు కోయిలలు పాడే వసంతం నీ సొంతం మల్లెల మంటలు రేగిన గ్రీష్మం నా గీతం పున్నమి పువ్వై నవ్విన వెన్నెల నీ ఆనందం ఆ వెన్నెలతో చితి రగిలించిన కన్నులు నా సంగీతం ఆపేసావేం బాబు బాగుంది ఆలపించు ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసూ... చరణం: 1 మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువనీ మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువనీ చీకటి మూగిన వాకిట తోడుగ నీడై నా దరి నిలువదనీ జగతికి హృదయం లేదని.. ఈ జగతికి హృదయం లేదని నా జన్మకు ఉదయం లేనే లేదనీ ఆ..ఆ.. ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసూ... చరణం: 2 గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినదీ జీవితం గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినదీ జీవితం నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం ప్రేమకు మరణం లేదని నా ప్రేమకు మరణం లేదని నా తోటకు మల్లిక లేనే లేదనీ ఆ..ఆ.. ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసూ...
జుంబాంబ జుంబాంబ పాట సాహిత్యం
చిత్రం: మల్లెపూవు (1978) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆరుద్ర గానం: కె. చక్రవర్తి పల్లవి: మాలీష్.. మాలీష్ జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ జుమ్ జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ జుమ్ జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ జుమ్ అరె హా హా..మాలీష్ అరె హే హే హో హా మాలీష్ రాందాస్ మాలీష్.. నిమ్నూన్ మాలీష్ చాలంజీ మాలీషు... చాన్నాళ్ళ సర్వీసు హెయ్..చాలంజి మాలీషు..చాన్నాళ్ళ సర్వీసు రాందాసు మాలీషండోయ్... మాలీష్ మాలీష్..మాలీష్..మాలీష్..మాలీష్. మా... మా చరణం: 1 అరె... హా అరె.... హో మాలీషు చేస్తుంటె బాలీసు మీద నువ్వు తొంగున్న హాయుంటది అరె... హా తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె... డుం..డుం..డుం తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె... రంబొచ్చి రమ్మంటదీ అరె ఒళ్ళంత జిల్లంటదీ..హా..ఓహో..ఓ.. అనిపిస్తదీ అరె ఒళ్ళంత జిల్లంటదీ..షమ్మ..ఓహో..ఓ... అనిపిస్తదీ అమ్మ తోడు..నిమ్మ నూనే..అంటగానే..తస్సదియ్యా అమ్మ తోడు నిమ్మ నూనే..అంటగానే తస్సదియ్యా అబ్బోసి తబ్బిబ్బులే..మాలీష్ మాలీష్..మాలీష్ రాందాస్ మాలీష్..నిమ్నూన్ మాలీష్ జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ జుమ్ జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ జుమ్ చరణం: 2 అరె హో..తల బిరుసు బుఱ్ఱైన మన చేయి పడగానె మహ తేలికైపోతదీ అరె హా..పొద్దంత పని చేసి ఒళ్ళంత బరువైతె మాలీషు మందౌతదీ అరె సంపంగి నూనుంది రాజా..అరె సమ్మ సమ్మ గుంటాది రాజా అరె సంపంగి నూనుంది రాజా..మహ సమ్మ సమ్మ గుంటాది రాజా హ చెవిలోన..చమురేసీ..చెయి మూసి..గిలకొడితే..హమ్మా హబ్బ..చెవిలోన చమురేసి..చెయి మూసి గిలకొడితే సంగీతమినిపిస్తదీ సా..సరి..గా.. మా..పా..మద..పని..మసా సరిగమపదనిని..సరిగమపదనిని..సా జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ జుమ్ జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ జుమ్ అరె హో మాలీష్..అరె హో మాలీష్ హెయ్..చాలంజి మాలీషు..చాన్నాళ్ళ సర్వీసు రాందాసు మాలీషండోయ్..మాలీష్..మాలీష్ రాందాస్ మాలీష్..నిమ్నూన్ మాలీష్
బ్రతుకున్న చచ్చినట్టే పాట సాహిత్యం
చిత్రం: మల్లెపూవు (1978) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు పల్లవి: ఏమి లోకం... ఏమి స్వార్ధం ఎక్కడున్నది మానవత్వం?? బ్రతుకున్న చచ్చినట్టే ఈ సంఘంలో... చస్తేనే బ్రతికేది ఈ లోకంలో... బ్రతుకున్న చచ్చినట్టే ఈ సంఘంలో... చస్తేనే బ్రతికేది ఈ లోకంలో... నిజం నలిగిపోతోంది ధనం చేతిలో నీల్గిమూల్గుతున్నది వల్లకాడిలో బ్రతుకున్న చచ్చినట్టే ఈ సంఘంలో... చస్తేనే బ్రతికేది ఈ లోకంలో... చరణం: 1 మనుషులెందరున్నారు ఇందరిలో... మనసనేది ఉన్నది ఎందరిలో మనుషులెందరున్నారు ఇందరిలో... మనసనేది ఉన్నది ఎందరిలో ఒక్క మనసు బ్రతికున్నా... ఊరుకోదు మౌనంగా రగిలి రగిలి మండుతుంది మహాజ్వాలగా... మహాజ్వాలగా బ్రతుకున్న చచ్చినట్టే ఈ సంఘంలో... చస్తేనే బ్రతికేది ఈ లోకంలో... చరణం: 2 సాటిమనిషి చస్తున్నా జాలి పడని వీళ్ళు లాభముంటే శవానైన పూజించే వీళ్ళు సాటిమనిషి చస్తున్నా జాలి పడని వీళ్ళు లాభముంటే శవానైన పూజించే వీళ్ళు ఈ ఊసరవెళ్లులూ.. ఈ దగాకోరులూ వీళ్ళే మన సంఘంలో పెద్దమనుషులు... చీడపురుగులు బ్రతుకున్న చచ్చినట్టే ఈ సంఘంలో... చస్తేనే బ్రతికేది ఈ లోకంలో... చరణం: 3 మండిపోనీ... మసైపోనీ... ధనమదాందులు... జరాదందులు ఈ రాబందులు ఏలే లోకం... కాలిపోనీ పేదల గుండెల నెత్తుటి కంటల పేరిచి కట్టిన కోటలన్నీ... కూలిపోనీ కులాల పేరిట మతాల పేరిట తరతరాలుగ చరిత్ర కుళ్ళు... మాసిపోనీ శపిస్తుతున్నా... శాసిస్తున్నా... శపధం చేస్తున్నా ఆగిపోదు ఈ గీతము... మూగపోదు ఈ కంఠము ఇది ప్రళయం... ఇది విళయం ఇది మహోదయం... ఆగిపోదు ఈ గీతము... మూగపోదు ఈ కంఠముఇది ప్రళయం... ఇది విళయంఇది మహోదయం...
No comments
Post a Comment