చిత్రం: సంసారం ఒక చదరంగం (1987) సంగీతం: కె. చక్రవర్తి నటీనటులు: గొల్లపూడి మారుతీరావు, శరత్ బాబు, సుహాసిని, రాజేంద్రప్రసాద్ దర్శకత్వం: ఎస్.పి.ముత్తురామన్ నిర్మాతలు: ఎమ్.శరవణన్, ఎమ్.బలసుబ్రమణియన్ విడుదల తేది: 14.01.1987
Songs List:
సంసారం ఒక చదరంగం పాట సాహిత్యం
చిత్రం: సంసారం ఒక చదరంగం (1987) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం స్వార్ధాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు ఋణపాశాలు తెంచేవేళలో సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం చరణం: 1 గుండెలే బండగా మారిపోయేటి స్వార్ధం తల్లిని తాళిని డబ్బుతో తూచు బేరం రక్తమే నీరుగా తెల్లబోయేటి పంతం కంటికి మంటికి ఏక ధారైన శోకం తలపై విధిగీత ఇలపైనే వెలసిందా రాజులే బంటుగా మారు ఈ క్రీడలో జీవులే పావులైపోవు ఈ కేళిలో ధనమే తల్లి ధనమే తండ్రి ధనమే దైవమా సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం స్వార్ధాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు ఋణపాశాలు తెంచేవేళలో సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం చరణం: 2 కాలిలో ముల్లుకి కంటనీరెట్టు కన్ను కంటిలో నలుసుని కంట కనిపెట్టు చెయ్యి రేఖలు గీతలు చూడదీరక్తబంధం ఏ పగా చాలదు ఆపగా ప్రేమ పాశం గడిలో ఇమిడేనా మదిలోగల మమకారం పుణ్యమే పాపమై సాగు ఈ పోరులో పాపకే పాలు కరువైన పట్టింపులో ఏ దైవాలు కాదంటాయి ఎదలో ప్రేమని సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం ప్రాణాలు తీసినా పాశాలు తీరునా అదుపూ లేదు ఆజ్ఞా లేదు మమకారాలలో సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం చరణం: 3 కౌగిలే కాపురం కాదులే పిచ్చితల్లి మల్లెలా మంచమే మందిరం కాదు చెల్లి తేనెతో దాహము తీర్చదేనాడు పెళ్లి త్యాగమే ఊపిరై ఆడదయ్యేను తల్లి కామానికి దాసోహం కారాదే సంసారం కాచుకో భర్తనే కంటి పాపాయిగా నేర్చుకో ప్రేమనే చంటిపాపాయిగా మన్నించేది మనసిచ్చేది మగడే సోదరి సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక గుణపాఠం ప్రేమే సంసారము ప్రేమే వేదాంతము వయసూ కాదు వాంఛా కాదు మనసే జీవితం సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక గుణపాఠం చరణం: 4 చుక్కలు జాబిలి చూసి నవ్వేది కావ్యం నింగికే నిచ్చన వేసుకుంటుంది బాల్యం తారపై కోరిక తప్పురా చిట్టి నేస్తం రెక్కలే రానిదే ఎగరనేలేదు బ్రమరం వినరా ఓ సుమతి పోరాదు ఉన్నమతి పాత పాఠాలనే దిద్దుకో ముందుగా నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా నిను పెంచేది గెలిపించేది చదువే నాయనా సంసారం ఒక చదరంగం చెరిగిందా నీ చిరు స్వప్నం ఈ గాలి వానలో నీ మేఘమాలలో ఉరిమే మబ్బు మెరిసే బొమ్మ చెరిపే వేళలో సంసారం ఒక చదరంగం చెరిగిందా నీ చిరు స్వప్నం
జానకి రాముల కళ్యాణం పాట సాహిత్యం
చిత్రం: సంసారం ఒక చదరంగం (1987) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల జానకి రాముల కళ్యాణం
సిరికే సీమంతమంతా పాట సాహిత్యం
చిత్రం: సంసారం ఒక చదరంగం (1987) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల సిరికే సీమంతమంతా
లాలీ జో జో పాట సాహిత్యం
చిత్రం: సంసారం ఒక చదరంగం (1987) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల లాలీ జో జో
జగమే మాయ బ్రతుకే మాయ పాట సాహిత్యం
చిత్రం: సంసారం ఒక చదరంగం (1987) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనమ్మా జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు ఆశ అనే హరివిల్లు వర్ణాలమ్మా పాశమనే ఎదముళ్లు యమవాదమ్మ ఆశ పాశాలు మాసే వర్ణాలే కలగంటే తప్పు నీకేనమ్మా ఈ బాదేనమ్మా భార్యా పుత్రులనే వలలో పడకోయి కాసులకే నీ సుతుడు అంకితమోయి కాసులకే నీ సుతుడు అంకితమోయి నాది నాది అనే బంధం వలదోయి నీ గుటకే నిర్మాలానందమోయ్ నిమిషామానంద మోయ్ నీతులు చెబుతుంటే కూతురు వినదోయి తనపాటం గుణపాఠం కొడుకే కనడోయ్ తనపాటం గుణపాఠం కొడుకే కనడోయ్ కట్టే బట్టైన మాటే వినదోయి కాబట్టే మందు కొట్టేనోయి జో కొట్టేనోయి ఇల్లు వాకిలి పిల్ల మేకని బ్రమపడకు బ్రతుకంత నాటకమోయి శ్రమపడితే మిగిలేది బూటకమోయి బాకీ బ్రతుకుల్లో బిడ్డలు వడ్డీలోయ్ కనుగొంటే సత్యమింతేనోయి ఈ సంతేనోయి జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా జగమే మాయ బ్రతుకే మాయ
No comments
Post a Comment