చిత్రం: శాంతినివాసం (1960) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా గానం: ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, పిఠాపురం, జిక్కీ, పి.లీల , ఏ.పి.కోమలి , స్వర్ణలత నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, రాజసులోచన, కృష్ణ కుమారి, దేవిక, కాంతారావు దర్శకత్వం: సి.ఎస్.రావు నిర్మాతలు: సుందర్ లాల్ నహత, టి.అశ్వద్నారాయణ విడుదల తేది: 14.01.1960
Songs List:
రావే రాధ రాణి రావే పాట సాహిత్యం
చిత్రం: శాంతినివాసం (1960) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా గానం: గంటసాల, జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి) రావే రాధ రాణి రావే రాధ నీవే కృష్ణుడనేనే రమ్యమైన శారదరాత్రి
చక్కని దాన చిక్కని దాన పాట సాహిత్యం
చిత్రం: శాంతినివాసం (1960) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా గానం: స్వర్ణలత, పిఠాపురం చక్కని దాన చిక్కని దాన ఇంకా అలకేనా
కలనైనా నీ వలపే పాట సాహిత్యం
చిత్రం: శాంతినివాసం (1960) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా గానం: పి. లీల సాకీ: తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన ఈ కలువ నిరీక్షణ...నీ కొరకే.. రాజా... వెన్నెల రాజా.... పల్లవి: కలనైనా నీ వలపే కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే చరణం: 1 కలువ మిఠారపు కమ్మని కలలు కలువ మిఠారపు కమ్మని కలలు కళలూ కాంతులూ నీ కొరకేలే కళలూ కాంతులూ నీ కొరకేలే చెలియారాధన సాధన నీవే జిలిబిలి రాజా జాలి తలచరా కలనైనా నీ వలపే కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే చరణం: 2 కనుల మనోరధ మాధురి గాంచి...ఆ ..ఆ..ఆ... కనుల మనోరధ మాధురి గాంచి కానుక చేసే వేళకు కాచి కానుక చేసే వేళకు కాచి వాడే రేకుల వీడని మమతల వేడుచు నీకై వేచి నిలచెరా కలనైనా నీ వలపే కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే
రాగాలా సరాగాలా పాట సాహిత్యం
చిత్రం: శాంతినివాసం (1960) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా గానం: ఘంటసాల, పి. సుశీల పల్లవి: ఆ ఆ ఆ ఆ.. రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం చరణం: 1 పతిపద సేవయె యోగముగా నాతికి పతియే దైవముగా పతిపద సేవయె యోగముగా నాతికి పతియే దైవముగా సతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావనయే పతి ధర్మముగా సతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావనయే పతి ధర్మముగా రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం చరణం: 2 మాయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా మాయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా జతబాయని కూరిమి జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా జతబాయని కూరిమి జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం హా య్.. సుఖజీవన సారం
సెలయేటి గాలిలాగ పాట సాహిత్యం
చిత్రం: శాంతినివాసం (1960) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా గానం: పి.లీల , ఏ.పి.కోమలి సెలయేటి గాలిలాగ చిందేసే లేడిలాగా సరదాగా గాలిలోన తేలిపోదామా మనము తేలిపోదామా
శ్రీ రఘురాం పాట సాహిత్యం
చిత్రం: శాంతినివాసం (1960) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా గానం: పి.బి. శ్రీనివాస్, సుశీల పల్లవి: శ్రీరామచంద్రః ఆశ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహచంచరీకః... నిరంతరం మంగళ మాతనోతు ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. శ్రీ రఘురాం జయరఘురాం సీతామనోభిరాం... శ్రీ రఘురాం జయరఘురాం చరణం: 1 అన్నదమ్ముల ఆదర్శమైనా ఆలూమగల అన్యోన్యమైనా అన్నదమ్ముల ఆదర్శమైనా ఆలూమగల అన్యోన్యమైనా ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. తండ్రిమాటను నిలుపుటకైనా ధరలో మీరే దశరథరాం శ్రీ రఘురాం జయరఘురాం సీతామనోభిరాం... శ్రీ రఘురాం జయరఘురాం చరణం: 2 వెలయునే ఎడ నీ దివ్యమూర్తీ వెలిగేనా ఎడ ఆనందజ్యోతీ వెలయునే ఎడ నీ దివ్యమూర్తీ వెలిగేనా ఎడ ఆనందజ్యోతీ వెలసి మాగృహం శాంతినివాసం సలుపవె శుభగుణ శోభితరాం శ్రీ రఘురాం జయరఘురాం సీతామనోభిరాం... శ్రీ రఘురాం జయరఘురాం శ్రీ రఘురాం జయరఘురాం శ్రీ రఘురాం జయరఘురాం
ఆశలు తీర్చవే ఓ జనని పాట సాహిత్యం
చిత్రం: శాంతినివాసం (1960) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా గానం: జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి) ఆశలు తీర్చవే ఓ జనని ఆదరముంచవే జాలిగొని
కం కం కంగారు నీకేలనే పాట సాహిత్యం
చిత్రం: శాంతినివాసం (1960) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా గానం: ఘంటసాల, జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి) కం కం కంగారు నీకేలనే నావంక రావేలనే చెలి నీకింక
No comments
Post a Comment