చిత్రం: సీతారాములు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎస్.పి.బాలు, సుశీల నటీనటులు: కృష్ణంరాజు, జయప్రద, మోహన్ బాబు దర్శకత్వం: దాసరి నారాయణరావు నిర్మాత: జయకృష్ణ విడుదల తేది: 01.08.1980
Songs List:
తొలి సంధ్య వేళలో పాట సాహిత్యం
చిత్రం: సీతారాములు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాసరి నారాయణరావు గానం: యస్.పి.బాలు పల్లవి: తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం ఎగరొచ్చి కెరటం సింధూరం తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం ఎగరొచ్చి కెరటం సింధూరం చరణం: 1 జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం ఆ.. ఆ... ఆ.. జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం ఆ హృదయం సంధ్యారాగం మేలుకొలిపే అనురాగం తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం ఎగరొచ్చి కెరటం సింధూరం చరణం: 2 సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం వచ్చే ప్రతికెరటం చేరదు అది తీరం వచ్చే ప్రతికెరటం చేరదు అది తీరం లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం ఎగరొచ్చి కెరటం సింధూరం
హేయ్ బుంగమూతి బుల్లెమ్మా.. పాట సాహిత్యం
చిత్రం: సీతారాములు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: హేయ్ బుంగమూతి బుల్లెమ్మా దొంగ చూపు చూసింది ఆహా.. బుంగమూతి బుల్లెమ్మా దొంగ చూపు చూసింది ఆ చూపులో ఏదో సూదంటురాయి అబ్బా.. చురుక్కు చురుక్కు మంటొంది పగలు రేయి చురుక్కు చురుక్కు మంటొంది పగలు రేయి కోడెకారు చిన్నోడు చేతిలో చెయ్ ఏశాడు కోడెకారు చిన్నోడు చేతిలో చెయ్ ఏశాడు కోడెకారు చిన్నోడు చేతిలో చెయ్ ఏశాడు ఆ చేతిలో ఏముందో ఆకురాయి అబ్బా చురుక్కు చురుక్కు మంటోంది పగలు రేయీ చురుక్కు చురుక్కు మంటోంది పగలు రేయీ చరణం 1: మరుమల్లె తీగలాగ నిలువెల్లా చుట్టేస్తుంది అణువణువు నాలో నిండీ మనసంతా పండిస్తుందీ మనసులో ఏముందో అంత గారం నన్ను కొరుక్కు కొరుక్కు తింటోంది ఆ సింగారం ఓ.. కొరుక్కు కొరుక్కు తింటోంది ఆ సింగారం వద్దన్న ఊరుకోడు కలలోకి వచ్చేస్తాడు మొగ్గలంటి బుగ్గలమీద ముగ్గులేసి పోతుంటాడు ముచ్చటలో ఏముందో చెప్పలేను అబ్భా.. ఉలిక్కి ఉలిక్కి పడుతుంటాను నాలో నేనూ అహా..బుంగమూతి బుల్లెమ్మా దొంగచూపు చూసింది ఆ చూపులో ఏదో సూదంటూరాయి అబ్భా.. చురుక్కు చురుక్కు మంటుంది పగలూ రేయీ అహా చురుక్కు చురుక్కు మంటుంది పగలూ రేయీ చరణం 2: చుక్కల్లో చక్కదనం వెన్నెల్లో చల్లదనం అడుగడుగున అందిస్తుందీ చిరునవ్వులు చిలికిస్తుందీ నవ్వుల్లో ఏముందో ఇంద్రధనుస్సు అబ్భా ఖలుక్కు ఖలుక్కు మంటోంది నాలో వయసూ ఉడికించే రాతిరిలో ఊరించే సందడిలో బాసలనే పానుపు చేసి ఆశలనే కానుకచేసి స్వర్గాలు చూడాలి ఆ మనసులో నేను ఇరుక్కు ఇరుక్కు పోవాలి ఆ గుండెలో కోడెకారు చిన్నోడు చేతిలో చెయ్ ఏసాడు.. ఆ చేతిలో ఏముందో ఆకురాయి అబ్బా అబ్బా చురుక్కు చురుక్కు మంటుంది పగలూ రేయీ చురుక్కు చురుక్కు మంటుంది పగలూ రేయీ
పలికినదీ పిలిచినదీ పాట సాహిత్యం
చిత్రం: సీతారాములు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి. సుశీల ప్రార్ధనః వరవీణా మృదుపాణీ పనరుహ లోచన రాణీ సురచుర్ సంబరవేణీ సురనుత కళ్యాణి నిరుపమ శుభగుణ లోలా నిరత జయాప్రద శీల వరదా ప్రియ రంగ నాయకి వాంచిక ఫలదాయకి సురశీ జానన జననే జయ జయ జయ వరవీణా పల్లవి: పలికినదీ పిలిచినదీ పరవసమై నవ మోహనరాగం పలికినదీ పిలిచినదీ పరవసమై నవ మోహనరాగం పలికినదీ - పిలిచినదీ చరణం: 1 గగనాంగ నాలింగ నోత్సాహియై జగ మెల్ల పులకించె సుమగుచ్ఛమై గగనాంగ నాలింగ నోత్సాహియై జగ మెల్ల పులకించె సుమగుచ్ఛమై మమతలు అల్లిన పెళ్ళిపందిరై మమతలు అల్లిన పెళ్ళిపందిరై మనసులు వీచిన ప్రేమ గంధమై పలికినదీ పిలిచినదీ పరవసమై నవ మోహనరాగం పలికినదీ - పిలిచినదీ చరణం: 2 గంగా తరంగాల సంగీతమై కమనీయ రమణీయ యువగీతమై (2) కలిమికి లేమికి తొలి వివాహమై కలిమికి లేమికి తొలి వివాహమై యువతకు నవతకు రసప్రవాహమై పలికినదీ పిలిచినదీ పరవసమై నవ మోహనరాగం పలికినదీ - పిలిచినదీ చరణం: 3 మలయాద్రి పపనాల ఆలాపనై మధుమాస యామిని ఉద్దీపనై (2) అనురానికి ఆదితాళమై అనురానికి ఆదితాళమై ఆనందానికి అమరనాదమై పలికినదీ పిలిచినదీ పరవసమై నవ మోహనరాగం పలికినదీ - పిలిచినదీ
రంగు రంగు బిళ్ళ పాట సాహిత్యం
చిత్రం: సీతారాములు (1980) సంగీతం: మాధవపెద్ది సత్యం సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి. సుశీల శ్లోకం: ఓం శివరూపాయ విష్ణురూపాయ స్వరూపాయ సర్వేసర్వత్రరూపాయ శక్తిరూపాయ ముక్తి రూపాయ భక్తరూపాయ ఓం శాంతి శాంతి శాంతిః రంగు రంగు బిళ్ల రూపాయిన బిళ్ల ఖంగుమంటే కరిగేను కాలం తద్దిత్తళాంగు మంటే తిరిగేను లోకం శివరూపాయ విష్ణురూపాయ అన్నది వేదం రూపాయని పూజించనిదే బతకదీలోకం లోకానికి పెద్దదిక్కు వున్నవాడే స్వర్గానికి మొదటి మెట్టు కలవాడే రూపాయల పాపాయి. నవవేదం వినిపించకు శివవిష్ణువు లిద్దరికీ కొత్తర్థం కల్పించకు డబ్బులేనివాడు డుబ్బుకైన కొరగాడు కాసులేనినాడు వడ్డీ కాసులవాడే లేడు శ్రీమంతుల చినదానా...సిరిఅంటే గుణమంట అది పేదల ధనమంది. ఆసిరి మీకేదంట ఓ మతిలేని కలవారి శ్రీమతి ... ॥రుంగురుంగు|| నో.. మనీ ఈజ్ ది హానీ ఆఫ్ ఫ్ ఈకాసులేని రాకాసులు కలవాళ్ళకు తిరకాసులు ఆకల కేకలమూకలు తోకలేని కోతులు కన్నవాళ్ళకన్న వీళ్లు చల్లనివాళు వున్నవాళ్ల బజారులో చెల్లనివాళు ఆమె చేతకాని వేదాంతం చేతకాని లేని రాద్దాంతం చెలరేగిందీ నాటికి శ్రమజీవన సిద్దాంతం పుణ్యామ్మలు కనిపించరు పునాదులు కనిపించవు ఆనాదిగా కలవాళ్ళకు లేనివాళ్ళు వినిపించరు జానెడు పొటట్టలకోసం సర్కస్చేసే మృగాలు వెట్టిచాకిరీకోసం పుట్టిన ఏడుపు మొఖాలు పేదల నెత్తుటి విందులు వెక్కే రాబందులు పెరుగుట విరుగుట కొరకని ఎరుగని ధసమధాందులు పేదల బతుకులు ఎంగిలి మెతుకులు తెలుసుకో ఆ ఎంగిలిమింగే పెద్దలబ్రతుకులు తలుచుకో తలవంచుకో పేదల కోపం పెదవికి చేటు తెలుసుకో ఆ పేదల కోపం మీరే శాపం తెలుసుకో
తొలిసంజవేళలో (Female) పాట సాహిత్యం
చిత్రం: సీతారాములు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాసరి నారాయణరావు గానం: పి.సుశీల తొలిసంజవేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధూరం తొలిసంజవేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూరుపులో..వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధూరం జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం..ఆ ఆ ఆ జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక ఉదయం ఆ హృదయం సంధ్యారాగం మేలుకొలిపే అనురాగం తొలిసంజ వేళలో సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం వచ్చే ప్రతీ కెరటం చేరదు అది తీరం వచ్చే ప్రతీ కెరటం చేరదు అది తీరం లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలుపే అనురాగం తొలిసంజవేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధూరం
ఏవండోయ్ శ్రీమతిగారు.. పాట సాహిత్యం
చిత్రం: సీతారాములు (1980) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాసరి నారాయణరావు గానం: యస్.పి.బాలు పల్లవి: ఊఁ... ఉహు...హు... హుహు... ఏవండోయ్ శ్రీమతిగారు.. లేవండోయ్ పొద్దెక్కింది.. ఏవండోయ్ శ్రీమతిగారు.. లేవండోయ్ పొద్దెక్కింది.. ఇల్లు ఊడ్చాలి.. కళ్ళాపు చల్లాలి.. నీళ్ళు తోడాలి.. ఆపై కాఫీ కాయాలీ..ఈ.. ఏవండోయ్ శ్రీమతిగారు.. లేవండోయ్ పొద్దెక్కింది.. చరణం: 1 హబ్బ.. ప్లీజ్.. ఒక్క గంటండీ.. గంటా గంటని అంటూ ఉంటే లోనుంచీ ఆకలి మంటా.. మంటా మంటని గిజ గిజమంటే అమ్మానాన్నతో తంటా.. మంటను మరి చేసి తలుపులు మూసేసీ.. దుప్పటి ముసుగేసి సరిగమ పాడేసి.. ఆఫీసుకి నామం పెడితే ఆడబాసుతో తంటా.. హూఁ 'Who is that రాక్షసి' ఉన్నది ఒక శూర్పణఖా.. లేటైతే నొక్కును నా పీకా.. ఆపై ఇచ్చును ఒక లేఖా.. ఆ లేఖతో ఇంటికి రాలేకా.. నలిగి నలిగి.. కుమిలి కుమిలి.. చచ్చి చచ్చి.. బ్రతికి బ్రతికి.. అయ్యబాబోయ్.. అందుకే.. ఏమండోయ్ శ్రీమతిగారూ.. లేవండోయ్ పొద్దెక్కింది.. హబ్బా.. చరణం: 2 కాఫీ.. కాఫీ.. కాఫీ కాఫీ అంటూ ఉంటే ఉలకరు పలకరు ఏంటంటా... వంటా వార్పు చేసేది ఇంటికి పెళ్ళామేనంటా... అఫ్కోర్స్ నాకు రాదే.. ఒక్కసారి చేసి చూపించండీ... మ్మ్.. పాలను మరిగించీ.. గ్లాసులో పోసేసి పౌడరు కలిపేసీ.. స్పూనుతో తిప్పేసి వేడిగ నోటికి అందిస్తే.. నాన్సెన్స్.. చక్కెర లేదు.. హబ్బా.. అరవకు అరవకు ఓ తల్లీ.. అరిస్తె ఇల్లే బెంబెల్లీ.. ఇరుగూపొరుగూ బయల్దేరి నిన్నూ నన్నూ చూసెళ్ళి... ఇంటా బయటా.. ఊరూ వాడా.. గుస గుసలాడేస్తే నిజంగా.. నీతోడు అందుకే.. ఏవండోయ్ శ్రీమతిగారు.. ఆగండోయ్ చల్లారండీ..
No comments
Post a Comment