చిత్రం: స్వాతిచినుకులు (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: మనో, జానకి
నటీనటులు: వాణిశ్రీ, రమ్యకృష్ణ, సురేష్, జయసుధ, శరత్ బాబు
దర్శకత్వం: శ్రీ చక్రవర్తి
నిర్మాతలు: టి.ప్రతాప్, కాంతారావు
విడుదల తేది: August 1989
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..లాలలా..లాలలాల
నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ
నీడలోనా..వెలుగులోనా
అనుబంధాల..ఆరాధన..ఆ
నాకు నీవు...నీకు నేను
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా
నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ
నిన్ను కన్నా..
నీ కళ్ళు పాడేటి..కధలు..ఊఊఊ
అధరాలలో..పొంగు సుధలు..ఊఊఉ
ఇటు ప్రేమించుకున్నాక..ఎదలు..ఊఊఊ
పేరంట మాడేటి...పొదలు..ఊఊఊఉ
చేమంతిపూల..సీమంతమాడే
హేమంత వేళ..ఈ రాసలీల
వెయ్యేళ్ళ వెన్నెల్లు..కాయాలిలే
నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ
నాకు నీవు...నీకు నేను
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా
నిన్ను కన్నా..మనసు విన్నా
కౌగిళ్ళలో పండు..కలలు..ఊఊఉ
వేవిళ్లలో దాటు..నెలలు..ఊఊఊ
బిగిసందిళ్లకేటందు..కళలు..ఊఊఉ
సందేళ మందార..గెలలు..ఊఊఉ
రాసేదికాదు..ఈ చైత్రగీతం
రాగాలు తీసే..ఈ ప్రేమవేదం
పూలారబోసింది..ఈ తోటలో
నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ
నీడలోనా..వెలుగులోనా
అనుబంధాల..ఆరాధన..ఆ
నాకు నీవు..ఆ..నీకు నేను..ఆ
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా
నిన్ను కన్నా..మనసు విన్నా
ఎదలో..మోహనాలాపన..ఆ
నిన్ను కన్నా..
No comments
Post a Comment