చిత్రం: వేడుక (2007)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరణ్ , హరిణి
నటీనటులు: రాజా ఎబుల్, పూనమ్ బజ్వా, నరేష్
దర్శకత్వం: వై. జితేంద్ర
నిర్మాత: వెంకటేశ్వరరావు పొన్నమనేని
విడుదల తేది: 31.05.2007
నవ్వే నవ్వే నవ్వే , నా వెన్నెల పువ్వే నవ్వే
నాలో ప్రేమే నవ్వే, నా ప్రాణాలే నవ్వే
ఔనౌనా! నిజమేనా! పడి పడి నవ్వి
తడి కన్నీరైన ఈ క్షణాన్నడుగు నువ్వే!
నవ్వే నవ్వే నవ్వే , నా వెన్నెల పువ్వే నవ్వే
నాలో ప్రేమే నవ్వే, నా ప్రాణాలే నవ్వే
తారేరె ...
నింగి నవ్వు చినుకే , చినుకు పడి నేల నవ్వు మొలకే!
కంటి నవ్వు కలలే, కలలుగనె కన్నె నవ్వు కబురే !
నీ కబురొచ్చాకే పాదం నవ్విందీ,
అది పరుగులు తీసి దగ్గరికొస్తే దూరం నవ్విందీ!
నీ పరమైనందుకు పరువం నవ్వింది, ఈ ప్రేయసి పదవే నాదే నందుకు గర్వం నవ్విందీ!
ఆ పదం వింటూ నీ ఎదల్లోకి నా పెదాలొచ్చి నవ్వే!
నవ్వే నవ్వే నవ్వే , నా వెన్నెల పువ్వే నవ్వే
నాలో ప్రేమే నవ్వే, నా ప్రాణాలే నవ్వే
దాగి ఉన్న మనసే ఎగసెగసి మూగ నవ్వు కొసరే!
వేగుతున్న వయసే, తెగ విసిగి వేడి నవ్వు విసిరే
మన తొందర చూసి సరసం నవ్విందీ!
ఇక ఇద్దరినొదిలీ వెళ్ళొస్తానని విరహం ఏడ్చిందీ!
నీ సందిట చేరీ సమయం నవ్విందీ,
ఇక ఇద్దరి మధ్యన చోటే లేదని సిగ్గే ఏడ్చిందీ!
ఆ బాధల్లోన ఈ నవ్వుల్లోన జత పడే బ్రతుకు నవ్వే!
నవ్వే నవ్వే నవ్వే , నా వెన్నెల పువ్వే నవ్వే
నాలో ప్రేమే నవ్వే, నా ప్రాణాలే నవ్వే
ఔనౌనా! నిజమేనా! పడి పడి నవ్వి తడి కన్నీరైన ఈ క్షణాన్నడుగు నువ్వే!
No comments
Post a Comment