Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Shri Vinayaka Vijayamu (1979)




చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, వీటూరి, కొసరాజు
నటీనటులు: కృష్ణంరాజు, రామకృష్ణ, వాణిశ్రీ, ప్రభ
మాటలు, పద్యాలూ, శ్లోకాలు: వీటూరి 
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాత: జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి
విడుదల తేది: 22.12.1979



Songs List:



జగన్మాత శ్లోక పాట సాహిత్యం

 
శ్లోకం 1

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: జి.వి. రంగాచార్యులు
గానం: శైలజ 

-; జగన్మాత శ్లోకం :-

వందేలోక హితం కరీమ్ శుభకరీమ్
శర్వార సంపత్కరీమ్
వందే శ్రీ భువనైక పాలన ప్రభామ్
వందే జగన్మాతరమ్




విఘ్నేశ్వర స్తుతి పాట సాహిత్యం

 
శ్లోకం 2

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: జి.వి. రంగాచార్యులు
గానం: సాలూరి రాజేశ్వరరావు 

-: విఘ్నేశ్వర స్తుతి :-

సర్వ విఘ్న హరమ్ దేవమ్ 
పార్వతీ ప్రియనందనమ్ సర్వసిద్ధి ప్రదాతారమ్ 
వందేశ్రీ గణనాయకమ్ వందే శ్రీ గణనాయకమ్!




నమో నమో తాండవకేళీలోలా పాట సాహిత్యం

 
శ్లోకం 3

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి 
గానం: యస్.పి.బాలు & కోరస్ 

“శివలీలలు-నారద దేవతల బృందనృత్యగానం”

ఓంకారనాద ప్రణవాంకిత జీవనాయ
సాకారరూప నిఖిలాంతర చిన్మయాయ
కామేశ్వరీ ప్రణయ రంజిత మానసాయ 
హరాయ శుభకరాయ నమశ్శివాయ

నమో నమో తాండవకేళీలోలా
నమో నమో ఆశ్రితజనపాలా
దయాకిరణముల ప్రసరించే - మీ
చూపుల సుమధుర భావనలు
ఈ జగతికి చల్లని దీవెనలు

అలనాడు - అమృతమును ఆశించి
పాలకడలి మదియించగా
హాలాహలమే ప్రభవించీ - విష జ్వాలలే వెదజల్లగా
అభయమొసంగీ - గరళము మింగీ
జగములగాచిన జగదీశా పరమేశా

పృధివి రధముగా - రవి చంద్రులే చక్రాలుగా
నాల్గు వేదములె హయములుగా
బ్రహ్మ దేవుడే సారధిగా - మేరు పర్వతమే విల్లుగా శ్రీహరి అస్త్రముకాగా
ప్రళయకాల పర్జన్య గర్జనగ- భీషణ శంఖము పూరించి
పాశుపతమ్మును సంధించి త్రిపురాసురులను వధియించి 
లోకాలను గాచిన దేవా మా
శోకము మాపిన మహానుభావా 





విలాసాల వేళ లాలించనీ పాట సాహిత్యం

 
పద్యం 4

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి
గానం: యస్.జానకి 

-: ప్రియం వద పూజ పాట :-

అన్నిలోకాల నేలెడు కన్నతల్లి
కామితము లెల్ల దీర్చెడు - కల్పవల్లి
పూజలను గొని - దయగని భువన జనని
కావరావె - కల్యాణి - శంకరుని రాణి

శోకం :
ఓం... ఐం.... హ్రీం.... శ్రీం.... శ్రీ మాతాయైనమః
చిదగ్నికుండ సంభూతాయైనమః
హర విలాసి న్యైనమః
మనోరూపేక్ష కోదండాయెనమః
శ్రీ చక్రనగర సామ్రాజ్యేశ్వర్యైనమః
శ్రీ రాజ రాజేశ్వర్యైనమః

-:పాట:-

విలాసాల వేళ లాలించనీ
సరాగాలతో - మనోహర లీల
హృదయ వీణనే - ఇలా మేళ వించు - సదా
వలపు గుండెలో - మోహాలా పాన్పు వేయనీ
ఆరని - కోరికా హారతీ ఇవ్వనీ
పొందులోన నిందు సేయనీ
ఆడినీ - పాడనీ - రాజా !

నీ బిగి కౌగిట - పులకించనీ నీలోనన్నే లీనముకానీ
రాగలహరిలో రాసకేళిలో
సరసాలలో - అంచులే చూడనీ
ఆడనీ – పాడనీ - రాజా !




ఎవరవయా ఏ దివ్య భువినుండి పాట సాహిత్యం

 
పాట 5

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల 

[వినాయకుని జన్మము - పార్వతి పాట]

ఎవరవయా ఎవరవయా ఏ దివ్య భువినుండి దిగి
ఈ అమ్మ ఒడిలోన ఒదిగి - ఎవరవయా ఎవరవయా
ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులోగాని
ఆ నవులు పలికేని ఏ వేద మంత్రాలో
వేల్పులందరిలోనా తొలివేల్పువోయేమో
పూజలలో మొదటి పూజ నీదేనేమో !

చిట్టిపొట్టి నడకలు - జిలిబిలి పలుకులు 
ఇంతలో ఔరౌర ఎన్నెన్ని విద్యలో ఎన్నెన్ని వింతలో
ఎన్నెన్ని కోరికలు నిండినే కన్న
ఎన్నెన్నొ స్వప్నాలు పండి చిన్నారి ఈమూర్తివై నావో
ఈరేడు లోకాలు ఏలేవో




డూ - డూ - డూ - బసవన్నా పాట సాహిత్యం

 
పాట 6

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: రామకృష్ణ, రమోల & కోరస్

[గంగిరెద్దు వాళ్ళ నృత్యగానం]

-: శివస్తోత్రం :-

వచనం :
శుభోజ్జయం - శుభోజ్జయం
మహా ప్రభూ - గంగిరెద్దుల వాళ్ళం
భూలోక, భువర్లోక, స్వర్గలోక, మహాలోక
జనలోక, తపోలోక, సత్యలోకాలను
అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల పాతాళలోకాలు తిరిగి మా విద్యను ప్రదర్శించి
బహుమానాలు పొందాం - మీ ఖ్యాతి విని,
మీ దర్శనానికి వచ్చాం। మా విద్యను తిలకించాలి ప్రభూలు

-: పాట :-

డూ - డూ - డూ - బసవన్నా
భళిరా అందెల బసవన్నా
ఏడేడూ పదునాల్గు లోకముల
మెప్పించావు గదరన్నా 

ప్రభువుగారికి దణ్ణం పెట్టు - ప్రతాపమంతా చూపెట్టు 
గజ్జెలు ఘల్లనగంతులు వెయ్- వినోదాలతో వింతలు చెయ్
రత్న కంబళం కప్పిస్తారు. బంగారపు తొడు వేయిస్తారూ

విష్ణువు మోహిని రూపుతొ చేసిన నృత్యవిలాసం చూడండి
నటరాజుగ శివమూర్తి చేసినా నాట్య కౌశలం తిలకించండి
గంధర్వులె మా ఆట పాటలకు సిగ్గుతో తల వంచాలండీ
కర్మవశమున మేము వేషాలు వేశాము
దేశ దిమ్మరులమై యాచింప వచ్చాము

ధాటి గల్గినా ధర్మప్రభువులు ఓహో ఓహో
మాట తప్పనీ మహారాజులూ ఓహో ఓహో
అడిగిందానికి కాదనబోరు - ప్రాణమైనా ఇచ్చేస్తారూ !
పరమశివుని నిజగర్భంలో దాచుకున్న శివభకులు మీరూ

-: శివ స్తోత్రం :-

సాంబ సదా శివ - శంభో శంకర
పరమ దయాకర - భక్తవశంకర
నంది వాహనా- నాగభూషణా
ఫాలలోచనా - భయ విమోచనా
కాలకూట - విషకంఠాభరణా
చంద్ర చూడహే - గిరిజా రమణా

శ్రీకర శుభకర - త్రిపురాసురహర
సురగణ వందిత - మునిజన సన్నుత
ఓం నమశ్శివాయ । ఓం నమశ్శివాయ
శివ శివ శివ శివ - శత్రుభయంకర
హర హర హర హర వ్యాఘ్రాంబరధర
జయ జయ జయ జయ - జగదోద్దారా
ఓం నమశ్శివాయ । ఓం నమశ్శివాయ
ఆఁడపిండ బ్రహ్మాండమునంతా
నిండియున్న అఖిలాండేశ్వరా
దీనులగాచే దీన శరణ్యా
భ క్తులబ్రోచే పరమపావనా
మా మొర వినవా - రావా - రావా

శంభోశంకర సాంబసదా శివ
శంభోశంకర సాంబసదా శివ
హర హర హర హర శంభోశంకర
శంభోశంకర సాంబసదా శివ





బాలను లాలించరా గజననా పాట సాహిత్యం

 
పాట 7

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల 

[లాలస నృత్యగానం]

బాలను లాలించరాగజననా-మేలిమి నెరజాణరా
కళలను తెలిసిన రసికండవనుకొని ఏరికోరి చేరినాను
కదరా - కనరా - కొనరా
కన్నెలేడిరా - ఇది వన్నెలాడిరా
కనులు విప్పరా - మనసు చెప్పరా
లేత వయసులో తపము లేలరా
నీ మీద మరులాయె నన్నేలుకోరా.. ఈ లాలసను మన్నించి
అంతులేని వింతహాయి నిడరా
లేరా - రారా - ఔరా

పంతమాడితే - కేరింత లాడనా
నువు బిగువు చూపితే - నే తెగువ చేయనా
కౌగిలించకా కదలి పోనురా
నీ బెట్టు సడలింతు పట్టి వలపింతు
కాంత కోరితే - కరిగి పోవనీ
హొంతకారి - యింతదాక - భువిలో
దీవిలో కలడా చెలుడా




ఏది చల్లనా పాట సాహిత్యం

 
సాకీ 8

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, విజయలక్ష్మీ శర్మ

[శివపార్వతుల ప్రణయ నృత్యగానం]

మ్రోగిమ్రోగి మూగవైనవేలా ఆ గంధర్వ వీణలతీగెలు
ఆగనేలా పరుగు సందడుల గలగలలు
ఆ మంచు మలలందు వాగులు
ఆవైపు ఆకాశ సౌధాని కెందుకో అడ్డుగా మేఘాల తెరలు
ఆ వెనుసాగునేమో ఆది దంపతుల
పార్వతీ పరమేశ్వరుల ప్రణయ లీలలు

-: పాట :-

పార్వతి : ఏది చల్లనా 
శివుడు : ఏది తియ్యనా 
పార్వతి : శిరసున ఆ జాబిల్లి మల్లి పువ్వా
శివుడు : అరవిరిసిన ఆ పెదవుల లేతనవ్వా
 
శివుడు : ఇటు చూడు గిరిరాజ నందినీ
ఈ పూలు పరచిన వేడినీ
పార్వతి : ఎవ్వారు పరచారో గాని ఎవరి పవ్వళింపులకో
శివుడు : ఏ సురవల్లీ సుమములో
ఏరి ఏరి ఈమేసు నొచ్చునని
పార్వతి : ఏ ప్రేయసీ ప్రియుల కోసమో !
శివుడు : చేరి చేరి - ఇలా, ఇలా ఒరగవచ్చునని




కోటి నదులందు మునిగిన మేటి ఫలము పాట సాహిత్యం

 
పద్వం 9

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి
గానం: రమేష్ 

-: వినాయకుని పద్యం :-

కోటి నదులందు మునిగిన మేటి ఫలము
భూమి ముమ్మారు చుట్టిన పుణ్య ఫలము
కన్న తలిదండ్రులకు ప్రదక్షణము సేయ
కలుగుననుచు - వేదాలు తెలుపలేదే |





ఒక వంక వరినీల కబరీ భరమ్ము పాట సాహిత్యం

 
దండకం 10

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి
గానం: శైలజ, రమేష్ 

[అర్ధనారీశ్వర స్తుతి]

ఒక వంక వరినీల కబరీ భరమ్ము
ఒక వంక ఘనజటా జూట భరితమ్ము
ఒక వంక మణి మయోజ్వల కుండలాలు
ఒక వంక భయద పన్నగ భూషణాలు
ఒక వంక కారుణ్య అవలోకనాలు
ఒక కంట విస్ఫులింగ గచ్చటాలు
ఒక వంక రమణీయ కాంచనాంబరము
ఒక వంక నిర్వికారము దిగంబరము

ఒక పదమ్మున ప్రణయ నాట్య విన్యాసమ్ము
ఒక పదమ్మున ప్రళయ తాండవ విజృంభణము
విశ్వశ్రేయార్దకము సృష్టి పరమార్థమ్ము
శక్తి శివశక్తుల సంగమ స్వరూపమ్ము
సర్వ రక్షాకరము దుష్ట పీడా హరము - అనశ్వరము
శుభకరము - అర్ధనారీశ్వరము



విశ్వరూప సందర్శనం పాట సాహిత్యం

 
స్తోత్రం 11

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి
గానం: శైలజ, రమేష్ 

[విశ్వరూప సందర్శనం]

శ్రీమన్మహా దేవదేవా అమేయ ప్రభావా భవా
భవ్య కారుణ్య భావా శివా!
భవానీ ప్రియా చిన్మయానంద హృదయా అద్వయా
దివ్య పంచాక్షరీ వేద మంత్రాలయా! అవ్వయా
ప్రకృతీ పురుషులై శక్తియున్ నీవు ఆధారచక్రాన
విహరించి - సంరక్తితో సృష్టి గావించి పాలించవే
సూర్య చంద్రాగ్నులే - నీదు నేత్రాలుగా ।
నాల్గు వేదాలు నీ శంఖు నాదాలుగా
భూమి నీ పాదపీఠమ్ముగా గంగయే నీ శిరో రత్నమ్ముగా
___జమే నీకు నీరాజనమ్ముగా

వాయువే వింజామరమ్ముగా - నభము భత్రమ్ముగా
పంచ భూతాలు సతతమ్ము సేవించగా
సప్తపాదోనిధుల్ – సుప్త శైలేంద్రముల్
సర్వలోకాలు - తీర్ధాలు నీ కుక్షిలో సదా
ప్రక్షి ప్తమై యుండవే
నిశ్వరూపా నమో వేద భువన ప్రదీపా
సంతతానంద కేళీకలాపా 
జగద్గిత కీర్తి లసత్ భూకవర్తీ 
సదానందమూర్తీ నమో దేవతా
చక్రవర్తీ
నను స్తే.... నను స్తే....నమః ...




కిల కిల నగవుల జలకము లాడగ పాట సాహిత్యం

 
పాట 12

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: వాణీ జయరాం

[వైశాలీ గంధర్వ కన్యల జలక్రీడలు]

కిల కిల నగవుల జలకము లాడగ
జలి బిలి పలుకుల సరసము లాడగ
మేను పొంగాలి - నెమ్మేను పొంగాలి

తేలి తేలి తూలిపోయి ఆటలాడాలీ సయ్యాట లాడాలి
ప్రేమలోనా - తొలి ప్రేమలోనా
దోరవయసు వాడే - నను కోరి చేరుతాడే
దొంగాటలూ - దోబూచులూ ఆడించునే

అందానికి ఋతురాజు చందానికి నెలరాజు
విందుల తన పొందులనన్నేలే
చెలికాడు నా మదిలో నెలకొన్న రతిరాజు

నిన్న రేయి కలలో ఆ వన్నెకాడు పొదలో
నన్నెంతగా - గిలిగింతల ఆలరించెనే
నా సొగసును మెచ్చాడే - బిగి కౌగిలి యిచ్చాడే
నే సిగ్గుతో వారించినా విడలేదే
ఆ స్వప్నమె పండాలి – సౌభాగ్యం నిండాలి





కండకావరమున కాంతల చెరబట్టి పాట సాహిత్యం

 
పద్యం 13

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి
గానం: యస్.పి.బాలు 

-: యుద్ధభూమి వినాయకుని పద్యం :-

కండకావరమున కాంతల చెరబట్టి
ఏడ్పించి నందులకిది ఫలమ్ము
తాపసులను బట్టి తాళ్ళ తోడను గట్టి
ఈడ్పించి నందుల కిది ఫలమ్ము
సురయక్ష కిన్నర గరుడోరగాదుల
హింసించి నందుల కిది ఫలమ్ము
మాన నీయుల డాసి మతిభ్రష్టులను చేసి
ఇకిలించి నందుల కిది ఫలమ్ము 

ధరణి నీ వంటి విశ్వ విధ్వంసకులను
సర్వమును ఖర్వమును చేసి శాస్తి చేతు
తులువ ఇకనైన మా శక్తి తెలుసు కొమ్ము
పొమ్ము దిక్కున్నచోటుకి పొమ్ము.. పొమ్ము 




యుద్ధ భూమి మూషికుని పద్యం పాట సాహిత్యం

 
పద్యం 14

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి
గానం: మాధవపెద్ది సత్యం

[యుద్ధ భూమి మూషికుని పద్యం]

ద్వేషము మీర కేశవుడు దివ్య సుదర్శనమెత్తి వచ్చినన్
రోషకషాయ నేత్రుడయి రుద్రుడు పాశుపతాగ్ని చిమ్మినన్
భీషణ సంగరాంగణ విభీషణుడాహవదుర్నిరీక్ష్యుడు
ఈ మూషిక చక్రవర్తినిల మోహర ముందున గెల్వ శక్యమే



పాహిమాం - పాహిమాం హే జగన్మాతా పాట సాహిత్యం

 
స్తోత్రం 15

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి
గానం: యస్.జానకి 

[ప్రియంవద స్తోత్రం]

పాహిమాం - పాహిమాం హే జగన్మాతా
సౌభాగ్య నిర్ణేత - శ్రిత పారిజాతా
హ్రీంకార సుప్రీత - సురలోక వినుతా
శ్రీచక్ర పురనేత - శ్రీ మహాలలితా

పసుపుకుంకుమలేని - పడతి బ్రతుకేలా
చరణంటి నీ దివ్య చరణాల మ్రోలా
దయతోడ పతిభిక్ష దయసేయవమ్మా
కాంతునీ ప్రాణాలు కాపాడవమ్మా 
నిరతమ్ము నీపూజనే చేసితేనీ
సతతమ్ము నీ పేరే స్మరియించి తేనీ
భక్తజన వరదవను బిరుదు నిజమేనే
జగములను శాసించు శక్తి నీవేనే
మాంగళ్యమును నిలుపు సర్వ మంగళవేనే
కాపాడరాదా ! కరుణ రాలేదా !
పతిలేని సతిబ్రతుకు వ్యర్థమే కాదా
ప్రాణాల నర్పింతు చేకొనవె తల్లీ 
నీలోన చేర్చుకో...ఓ కల్పవల్లీ...ఓ కల్పవల్లీ 





జగన్మాతస్తుతి పాట సాహిత్యం

 
స్తోత్రం 16

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి
గానం: జయదేవ్, వసంత & కోరస్

-: జగన్మాతస్తుతి :-

హే పరమేశ్వరి - భక్త వశంకరి
చంద్రకళాధరి లోకశుతే - వేద వినోదిని నాదస్వరూపిణి
త్రిపుర విహరిణి - కల్పలతే శ్రీ జగదంబ కళా నికురంబ
మనోజ్ఞనితంబ దయా కరితే
జృంభిత శుంభ నిశుంభ విలాసిని
వింధ్య నివాసిని శ్రీ లలితే
పాహిమాం - పాహిమాం త్రైలోక్యమాతా
రక్షమాం - రక్షమాం - ప్రణవసంజాతా
నమో దేవ దేవీ ప్రసీద ప్రసీద
నమో సర్వ శుభదా ప్రసీద - ప్రసీద




మంగళ శాసనం పాట సాహిత్యం

 
శ్లోకం 17

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: జి. వి. రంగాచార్యులు
గానం: సాలూరి రాజేశ్వరరావు, శైలజ, రేఖ

-: మంగళ శాసనం :-

వేద వేదాంత రూపాయ  బ్రహ్మ విష్ణు శివాత్మకే
పంచ వదనాయ దివ్యాయ విఘ్న రాజాయ మంగళమ్
పార్వతీ వరపుత్రాయ దేవాసురసుపూజితే
పంచ భూత స్వరూపాయ విఘ్నరాజాయ మంగళమ్

No comments

Most Recent

Default