చిత్రం: Dear కామ్రేడ్ (2019) సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మీక మందన్న దర్శకత్వం: భరత్ కమ్మ నిర్మాత: యాష్ రంగినేని విడుదల తేది: 26.07.2019
Songs List:
నీ నీలి కన్నుల్లోని పాట సాహిత్యం
చిత్రం: Dear కామ్రేడ్ (2019) సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ సాహిత్యం: రెహ్మాన్ గానం: జస్టిన్ ప్రభాకరన్, గౌతమ్ భరద్వాజ్ నీ నీలి కన్నుల్లోని ఆకాశమే తెల్లారి అల్లేసింది నన్నే నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి నీ వైపే లాగేస్తుంది నన్నే ఓ... ఓఓఓఓఓ నీ పూల నవ్వుల్లోని ఆనందమే తేనెల్లో ముంచేసింది కన్నే నీకోసమే, నా... కళ్ళే వాకిల్లే తీసి చూసే ముంగిల్లే రోజు ఇలా, నే... వేచే ఉన్నానే ఊగే ప్రాణం నీ వల్లే ఎవరు చూడని ఈ అలజడిలో కుదురుమరచిన నా ఎదసడిలో ఎదురుచూస్తూ ప్రతి వేకువలో నిదుర మరిచిన రాతిరి వడిలో నీ నీలి కన్నుల్లోని ఆకాశమే నీకాలి అందెల్లోని సంగీతమే సోకి దేరన దేరానన దేనా...
కడలల్లె వేచె పాట సాహిత్యం
చిత్రం: Dear కామ్రేడ్ (2019) సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ సాహిత్యం: రెహ్మాన్ గానం: ఐశ్వర్య రవిచంద్రన్, సిద్ శ్రీరామ్ కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే ఒడిచేరి ఒకటై పోయే ఒడిచేరి ఒకటై పోయే తీరం కోరే ప్రాయం విరహం పొంగెలే హృదయం ఊగెలే అధరం అంచులే మధురం కోరెలే అంతేలేని ఏదో తాపం ఏమిటిలా నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా చెంతచేరి సేదతీర ప్రాయమిలా చెయ్యి చాచి కోరుతోంది సాయమిలా కాలాలు మారినా - మారినా నీ ధ్యాస మారునా- నీ ధ్యాస మారునా అడిగింది మోహమే నీ తోడు ఇలా ఇలా విరహం పొంగెలే హృదయం ఊగెలే అధరం అంచులే మధురం కోరెలే కడలల్లె వేచి కనులే కదిలేను నదిలా కలలే కడలల్లె వేచి కనులే కదిలేను నదిలా కలలే నిన్నే నిన్నే కన్నులలో దాచానులే లోకముగా నన్నే నన్నే మలిచానే నీవుగా బుగ్గమీద ముద్దెపెట్టే చిలిపితనం ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగుణం పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో నిండిపోయే ఉండిపోయే గుండెలోతుల్లో నీలోన చేరగా - చేరగా నా నుంచి వేరుగా - నా నుంచి వేరుగా కదిలింది ప్రాణమే నీ వైపు ఇలా ఇలా
గిర గిర పాట సాహిత్యం
చిత్రం: Dear కామ్రేడ్ (2019) సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ సాహిత్యం: రెహ్మాన్ గానం: గౌతమ్ భరద్వాజ్, యామిని ఘంటసాల గిర గిర గిర తిరగలి లాగ తిరిగి అరిగి పోయినా దినుసె నలగ లేదులే హొయ్ హొయ్ హొయ్ హొయ్ అలుపెరగక తన వెనకాలె అలసి సొలసి పోయినా మనసె కరగ లేదులే హొయ్ హొయ్ హొయ్ హొయ్ చిన్నదేమొ తిరిగె చూడాదే ప్రేమంటె అసలే పడదె హొయ్... గిర గిర గిర తిరగలి లాగ తిరిగి అరిగి పోయినా దినుసె నలగ లేదులే హొయ్ హొయ్ హొయ్ హొయ్ అలుపెరగక తన వెనకాలె అలసి సొలసి పోయినా మనసె కరగ లేదులే హొయ్ హొయ్ హొయ్ హొయ్ అలలు అలిసి చతికిలపడున కలలు నిలిచి కలవర పడున సహజ గునము నిమిషము విడున ఏమి జరిగినా... మనసునెపుడు వదలని తపన వినదు అసలు ఎవరేమనినా గగనమొరిగి తనపై పడిన ఆశ కరుగునా... వేసవిలోన పెనుతాపం ఓ ఆరాటం ల నింగిని తాకి దిగి రాద వర్షంలా గిర గిర గిర తిరగలి లాగ తిరిగి అరిగి పోయినా దినుసె నలగ లేదులే సన్నాయి డోలు పెల్లి పాట పాడె అబ్బాయి వోరకంట చూస్తున్నాడె బంగారు బొమ్మ తల యెత్తి చూడె నీ ఈడు జోడె అందాల చందురూడె ఎవరికెవరు తెలియదు మునుపు అడిగి అడిగి కలగదు వలపు ఒకరికొకరు అని కలపనిదె మనని వదులునా ఎదురు పడిన క్షణమొక మలుపు అడుగు కలిపి కదిలితె గెలుపు దిసలు రెండు వెరై ఉన్న పయనమాగునా నెనంటె తానె తను నేనె ఒకటై ఉన్నానె పొమ్మన్న పోనె పడతానె లేస్తానె గిర గిర గిర తిరగలి లాగ తిరిగి అరిగి పోయినా దినుసె నలగ లేదులే హొయ్ హొయ్ హొయ్ హొయ్ అలుపెరగక తన వెనకాలె అలసి సొలసి పోయినా మనసె కరగ లేదులే
The Canteen Song పాట సాహిత్యం
చిత్రం: Dear కామ్రేడ్ (2019) సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ సాహిత్యం: రెహ్మాన్ గానం: Karthik Rodriguez The Canteen Song
Comrade Anthem పాట సాహిత్యం
చిత్రం: Dear కామ్రేడ్ (2019) సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: స్టోని సైకో, విజయ్ దేవరకొండ, MC Vickey Comrade Anthem
మామ చూడరొ పాట సాహిత్యం
చిత్రం: Dear కామ్రేడ్ (2019) సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ సాహిత్యం: రెహ్మాన్ గానం: కార్తీక్ తాలం వెయ్యరొ సరికొత్తగ పాటె పాడరో మేలం ఊదరొ ఇన్నల్లకు ఇది కుదిరిందిరో హేయ్ మామ చూడరొ కథ మల్లి మొదలయ్యిందిరో చూస్తావేందిరొ దరువేస్తు అడుగె వెయ్యరో గడియారం చూడొద్దురో మన గత కాలం యెగిరొచ్చిందిరో సరదాల సందల్లలో నువు తుది ఆట ఆడెయ్యరో నీ స్నేహం దూరమై ...యెంతకాలం ఈనాడె చేరువై ...నిండె ప్రాణం తియ్యని గ్నాపకం గుండెనే తాకితే హేయ్ తియ్యని హేయ్ గ్నాపకం హేయ్ గుండెనె హేయ్ తాకితె హ తాకితె హ తాకితె తక తక తాకితె హేయ్ ఉప్పొంగేటి ఎన్నొ ఎన్నొ ఆనందాలె వెల్లువల్లె ముంచేస్తుంటె ఎంత బాగుందో ఆ సందేహంలొ మనసెమయ్యిందో ఇక ఎన్నళ్ళైన అంతం కాని బంధలెన్నొ నిన్ను నన్ను బందిస్తుంటె ఎంత బాగుందో ఆ బంధంలోన ఎంత బలముందో
ఓ కలల కథలా పాట సాహిత్యం
చిత్రం: Dear కామ్రేడ్ (2019) సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ సాహిత్యం: రెహ్మాన్ గానం: డి. సత్యప్రకాష్ , చిన్మయి శ్రీపాద ఓ కలల కథలా కలిసి దూరాలె తీరాలై ఓ జతగ జగమై కదిలె పాదాలే ప్రాణాలై ఇది విదియే విదిగా కలిపే ఊహించని మలుపై ఇరుదిశలే ఒకటై నిలిచే తొలి వేకువలో ఈ క్షణమే మనకే దొరికే సంతోషం మనదై కడవరకు మనతో నడిచె ఈ దారిలొ రా రా రెక్కలనె ఒక్కటిగ కలిపి ఇల రా రా దిక్కులనె చుక్కలనె దాటి అలా రా రా కోరుకొనే కొత్త జగం చేరుకొనె ఓ స్వేచ్చ కదా ఈ పయనం గడిచిన కాలం గాయం ఏదొ చేసిన మనసుపై మందె పూసే మంత్రమున్నదె నిరంతరం నీడ లాగ ఉంటున్నది తానేగా ఉషస్సులొ ఊపిరి పంచె గాలి పాటలా ఒక చినుకేదొ తాకి చిగురేస్తుంటె చైత్రం తడి కన్నుల్లొ విరిసె చిరునవ్వె నీ సొంతం విడిపోలేవు గంధాలు ఆ పూలకుండె అవి కనరాని బంధాలులె దారిలొ దారిలొ దారిలొ. రా రా రెక్కలనె ఒక్కటిగ కలిపి ఇల రా రా దిక్కులనె చుక్కలనె దాటి అలా రా రా కోరుకొనె కొత్త జగం చేరుకొనె ఓ స్వేచ్చ కదా ఈ పయనం మనసుకె నేడె మల్లి ఇంకొ జన్మల యెడారిలొ పూలై పూసే వాన జల్లులా… వసంతమై ఈ ప్రవాహం వర్నాలతొ సావాసం ప్రతిక్షణం పచ్చగ నవ్వె కొత్త జీవితం పడి లేచేటి పాదాలు పారాడుతుంటె నడిపిస్తుంది ఈ కాలమె… రా రా రెక్కలనె ఒక్కటిగ కలిపి ఇల రా రా దిక్కులనె చుక్కలనె దాటి అలా రా రా కోరుకొనె కొత్త జగం చేరుకొనె ఓ స్వేచ్చ కదా ఈ పయనం ఓ కలల కథల కలిసి దూరాలె తీరాలై ఓ జతగ జగమై కదిలె పాదాలె ప్రాణాలై ఇది విదియె విదిగా కలిపే ఊహించని మలుపై ఇరుదిశలె ఒకటై నిలిచె తొలి వేకువలొ ఈ క్షణమే మనకె దొరికె సంతోషం మనదై కడవరకు మనతో నడిచె ఈ దారిలొ రా రా రెక్కలనె ఒక్కటిగ కలిపి ఇల రా రా దిక్కులనె చుక్కలనె దాటి అలా రా రా కోరుకొనె కొత్త జగం చేరుకొనె ఓ స్వేచ్చ కదా ఈ పయనం
ఎటు పోనే పాట సాహిత్యం
చిత్రం: Dear కామ్రేడ్ (2019) సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ సాహిత్యం: రెహ్మాన్ గానం: కాలభైరవ ఎటు పోనే నిను తలచి తలచి కలలు విడిచి యెటు పోనె ఎటు పోనే ఎదకెదురు నిలిచె పిలుపు విడిచి యెటు పోనే బహుదూరపు దారిలో నిను చేరె మలుపుకె నడిపించె దిక్కుకై నిను వెతికానే. తెగుతున్న దారమె గురుతులతో నేయనా మన గాలిపటమునె నేనెగరేయన.. ఆపలేని కోపమె మార్చలేని లోపమా అదుపులేని మంటని నేను వచ్చి కౌగిలించవా.. మంచై ఆవహించవా.. నిదరె రాదు కన్నీటికె అడ్డె పడె కాలి మరకలె చెరగవె పడిలేచె పయానాలే ఓర్పంటె నేర్పెనులే యెకాంతం సాయం శాంతముకె అడిగితేనె పంటి బిగువున బాదనిచ్చే నవూతున్న నిను తలచె ఏమైన నాతొ వేరవని తీరొకటే వెల్లొద్దే వెల్లొద్దే నువ్వె ఉంటానె తక్కుందె నధె నీ రక్తం నీ వెన్నెలె పడుతుంటె నాలొ నేనొక యెగసె ఉప్పెననె...ఉప్పెననె చిగురాకైన రాల్చను లె...రాల్చను లె కురులను సైతం బాదించని గాలె అవనా...అవనా తెదిలేని మాసమై యండమావి తీరమై ఉండలేను ఊపిరాగుతు ఇంకా నీకు దూరమై ఇంకా నీకు దూరమై ఏటు పోనె నిను తలచి తలచి కలలు విడిచి యెటు పోనె యెటు పోనె యెటు పోనె యెదకెదురు నిలిచె పిలుపు విడిచి యెటు పోనె
No comments
Post a Comment