చిత్రం: పెద్దమనుషులు(1999)
సంగీతం: ఈశ్వర్ (తొలిపరిచయం)
సాహిత్యం: సినారే, వేటూరి
గానం: ఎస్.పి.బాలు, మనో, చిత్ర, స్వర్ణలత, సుజాత
నటీనటులు: సుమన్, రచన, హీరా రాజగోపాల్
కథ: కొమ్మనాపల్లి గణపతిరావు
మాటలు: పరుచూరి బ్రదర్స్
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 1999
పల్లవి:
హొయ్ పట్టి పట్టి చూడు నాడీ పాట పాడేస్తుంది
హొయ్ ముట్టి ముట్టి చూడు వేడి మోత పుట్టిస్తుంది
ఇద్దరిని ముడి వేసే ఆ ముద్దుకు మొదటి సలాం
బలె బలె భజరంగం గిలి గిలి వీరంగం
వలె వలె భజరంగం తలుపుల తారంగం
చరణం: 1
ఏరై పారు మనసే ఎల్లలుదాటి పరుగిడుతోంది
ఏవో ముద్దు ఆశలు తరగవుగా
నిన్ను నన్ను తరిమే వెన్నెల నాగు బుసకొడుతోంది
ఎన్నో నిన్ను కోరికలెగబడగా
వడివడిగా వచ్చేసే వలపంతా ఇచ్చేసే
తడబాటు చిమ్మేసి వడి నిండా కమ్మేసే
హోయ్ ఆరేసే అందాలే అల్లుకుంటే
పిల్లడికి గుండెల్లో జిల్లుమందే
బలె బలె భజరంగం గిలి గిలి వీరంగం
వలె వలె భజరంగం తలుపుల తారంగం
హొయ్ పట్టి పట్టి చూడు నాడీ పాట పాడేస్తుంది
హొయ్ ముట్టి ముట్టి చూడు వేడి మోత పుట్టిస్తుంది
చరణం: 2
కన్ను కన్ను కలిసే కాముని బొమ్మను గీస్తూవుంటే
కలలే పలికే రంగుల పల్లవులే
పెదవి పెదవి వదిగి పిల్లన గ్రోవిని వాగిస్తుంటే
పగలే ముగిసే కొంగుల అల్లరులు
హోయ్ కుదిరింది ఏకాంతం వదగాలి ఆసాంతం
కలిసొచ్చిన సాయంత్రం కావాలి రసవంతం
దేహాలే కౌగిట్లో దివ్వెలైతే
మోహాలే ముంగిట్లో మువ్వలైతే
బలె బలె భజరంగం గిలి గిలి వీరంగం
వలె వలె భజరంగం తలుపుల తారంగం
హొయ్ పట్టి పట్టి చూడు నాడీ పాట పాడేస్తుంది
హొయ్ ముట్టి ముట్టి చూడు వేడి మోత పుట్టిస్తుంది
ఇద్దరిని ముడి వేసే ఆ ముద్దుకు మొదటి సలాం
బలె బలె భజరంగం గిలి గిలి వీరంగం
వలె వలె భజరంగం తలుపుల తారంగం (2)
No comments
Post a Comment