చిత్రం: సీత (2019)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: లక్ష్మీ భూపాల్
గానం: అర్మాన్ మాలిక్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోను సూద్
దర్శకత్వం: తేజ
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
విడుదల తేది: 24.05.2019
కుహూ కుహూ అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మ
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా
ఓ ఓ కుహూ కుహూ అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మ
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా
ఆ నవ్వులో సిరిమల్లెలై
పూయాలిలే నీ పెదవంచులో
ఈ పూలకి ఆరాటమే చేరాలని జడ కుచ్చిళ్ళలో
ఓ ఇంద్ర దనస్సే వర్ణాల వానై
కురిసెను జల జల చిటపట చినుకులుగా
కూ కూ కూ కూ
కుహూ కుహూ అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మ
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా
ఈ చల్లగాలి ఓ మల్లెపూవై
నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం నీ నవ్వుకోసం
ఓ మెరుపు లేఖే రాయాలి (2)
సెలయేరు పైన జలతారు వీణ
పలికెను గల గల సరిగమ పదనిసగ
కూ కూ కూ కూ
కుహూ కుహూ అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మ
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా
నీలాల నింగి చుక్కల్ని తెచ్చి
నక్షత్రమాలే వెయ్యాలి
నీకంటి నీరు వర్షించకుండా
దోసిల్ల గొడుగే పట్టాలి (2)
ఏ కష్టమైనా ఉంటాను తోడై
తడబడు అడుగున జతపడి నేనున్నా
కూ కూ కూ కూ
కుహూ కుహూ అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మ
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా
No comments
Post a Comment