చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, అమృత ఆయ్యర్ దర్శకత్వం: మున్నా ధూళి పూడి నిర్మాత: ఎస్. వి. బాబు విడుదల తేది: 29.01.2021
Songs List:
నీలి నీలి ఆకాశం పాట సాహిత్యం
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: సిద్ శ్రీరామ్, సునీత అమ్మాయిగారు ఎక్కడికెలిపోతున్నరూ కాసేపుండొచ్చు కదా ఆహ కాసేపాగితే అబ్బయిగారేమిత్తారేంటి పల్లవి: నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నెలవంకను ఇద్దామనుకున్నా ఓ ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా చరణం: 1 ఓ వానవిల్లులో ఉండని రంగు నువ్వులే ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే నల్ల మబ్బులా మెరిసే కళ్లు నీవిలే ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా ఏది నీ సాటి రాదిక అంటు ఓడాను పూర్తిగా కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా నీలి నీలి ఆశాశం ఇద్దామనుకున్నా నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా చరణం: 2 ఓహొ అమ్మ చూపులో వొలికే జాలి నువ్వులే ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే వరమొసగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా ఏది నీ సాటి రాదిక అంటూ అలిసాను పూర్తిగా కనుకే మళ్లి మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
ఇదేరా స్నేహం పాట సాహిత్యం
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: అర్మాన్ మాలిక్ ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం కనివిని ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం నింగినీ నేలనీ వానచినుకై కలిపెను స్నేహం తూర్పుకీ పడమరకీ కాంతి తోరణం అయ్యిందీ స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం (2) కనివిని ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం హో.. నీ మధ్యన ఉంటానంటూ బతిమాలింది చిరుగాలి నీ పాదం తాకాలంటూ అలలైంది ఆ కడలి తన మచ్చను నీ స్వచ్చతతో కడగాలంది జాబిల్లి నీ భారం మోసేటందుకే పుట్టానంది ఈ పుడమి ఆశలు ఆకర్షణలు లేనిది నీ ఆడ మగ స్నేహం నీతోనే ఇంకో నువ్వే చేసే స్నేహమే మీ ఇద్దరి స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం (2) ఓ తన చూపులు నువు చూస్తుంటే నీ కళలను తాను కంటోంది తను మాటలు నువ్వుంటుంటే నీ నవ్వులు తను నవ్వింది తను అడుగులు వేస్తూ ఉంటే గమ్యం నువ్వే చేరేవు నీలో నువ్వు చేయని పనులే నీలా తానే చేసేను జన్మలే చాలక మళ్ళీ మళ్ళీ జన్మించే స్నేహం దేవుడే ప్రేక్షకుడై చూసి చూసి మురిసే మీ స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం (2)
మీకో దండం పాట సాహిత్యం
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: ధనుంజయ్, మోహన్ భోగరాజ్ మీకో దండం
అమ్మ నన్ను మళ్ళి పెంచవ పాట సాహిత్యం
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: అనూప్ రూబెన్స్, రిషాన్ రూబెన్స్ అమ్మ అమ్మ నన్ను మళ్ళి పెంచవ అమ్మ అమ్మ మరల లాలించవా పది నెలలు ప్రతీక్షణము కడుపున పెంచావె పది నెలలు ప్రతి నిముషం ఒడిలో పెంచావే భారమెలా పెంచిన ప్రేమనలా పంచుతూ నన్ను పెంచినావని తెలియలేదే అమ్మ అమ్మ అమ్మ నన్ను మళ్ళి పెంచవ అమ్మ అమ్మ మరల లాలించవా లాలి పాడవా మరోసారి లాల పోయావా మరోసారి ఉయలుపవా మరోసారి ఎదిగే వరకు ఎదురవదా ఎదలో పసితనము ఎదిగేసరికి మిగిలినదా గతమై ప్రతి నిజము చేతిలో ప్రతీ ముద్దని చెంపపై ప్రతీ ముద్దుని ప్రతి జ్ఞాపకాన్నిలా తిరిగి తేవే అమ్మ అమ్మ అమ్మ నన్ను మళ్ళి పెంచవ అమ్మ అమ్మ మరల లాలించవా లాలి పాడవా మరోసారి లాల పోయావా మరోసారి ఉయలుపవా మరోసారి
వాచ్ వహ్ వహ్ మేరె బావా పాట సాహిత్యం
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: అనూప్ రూబెన్స్, ప్రదీప్ మాచరాజు గానం: రాహుల్ సిప్లిగంజ్ వాచ్ వహ్ వహ్ మేరె బావా
క్యాట్ బాడీ లోకి పాట సాహిత్యం
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: మధుప్రియ క్యాట్ బాడీ లోకి ఆ ర్యాట్ చేరిందంటే ర్యాట్ బాడీ లోకి ఈ క్యాట్ దూరిందంటే ఏమౌతుందే బాబు ఏమౌతుందే, అరె ఏమౌతుందే సెప్పు ఏమౌతుందే బ్లాక్ అవుతుందే బ్లాక్ అవుతుందే... మైండు బ్లాక్ అవుతుందే బ్లాక్ అవుతుందే... మైండు బ్లాక్ అవుతుందే, లెఫ్ట్ రైటై... రైటే రాంగై బ్లాక్ అవుతుందే బ్లాక్ అవుతుందే సిక్స్ ప్యాక్ తో తులసీ కోటను చుట్టేస్తుంటే సాంబ్రాణి ధూపం సిగరెట్ స్మోకే అవుతుంటే, పువ్వంటి పిల్లకు గడ్డం ముళ్ళే మొలిచేస్తే పదునైన కత్తే మొత్తం మెత్తగా అవుతుంటే తన బాధకు మూలం నువ్వని హ్యాపీగా అనిపిస్తే, ఈ ఫీలింగ్ తనకూ ఉందని నీక్కూడా తెలిసొస్తే ఏం ఏం ఏం ఏం ఏమవుతుందే ఏమవుతుందే బాబు ఏమవుతుందే బ్లాక్ అవుతుందే బ్లాక్ అవుతుందేమైండు బ్లాక్ అవుతుందే, బ్లాక్ అవుతుందే మైండు బ్లాక్ అవుతుందే ఓఓ బాత్రూంలో బోంచేస్తున్నట్టుందే బెడ్రూమ్ లో స్నానం చేస్తున్నట్టుందే, కాఫీలో కారం కలిపి ఇస్తున్నట్టుందే కాక్లెయిల్ లో కాకరకాయ రసమే మిక్సయిందే, ఎల్టీ టైం తనకే తాను ఎనిమిలా కనిపిస్తే తను పీల్చే ఊపిరి వల్ల తన ఎనిమి బతికేస్తే ఏం ఏం ఏం ఏం ఏమవుతుందే... ఏమవుతుందే బాబు ఏమవుతుందే బ్లాక్ అవుతుందే బ్లాక్ అవుతుందే మైండు బ్లాక్ అవుతుందే, బ్లాక్ అవుతుందే మైండు బ్లాక్ అవుతుందే తనలో ఉన్న నీ మైండు బ్లాక్ అవుతుందే అట్టాగే నీలో ఉన్న తన మైండు బ్లాక్ అవుతుందే
No comments
Post a Comment