Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Love Story (2021)





చిత్రం: లవ్ స్టోరి (2021)
సంగీతం: Ch. పవణ్
నటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవి
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
నిర్మాతలు: నారాయణ దాస్ నారంగ్. పి. రామ్మోహన రావు
విడుదల తేది: 2021



Songs List:





ఏయ్ పిల్లా పరుగున పోదామా పాట సాహిత్యం

చిత్రం: లవ్ స్టోరి (2021)
సంగీతం: Ch. పవణ్
సాహిత్యం: చైతన్య పింగళి
గానం: హరి చరణ్




ఏయ్ పిల్లా పరుగున పోదామా
ఏ వైపో జంటగ ఉందామా
రా రా.. కంచె దుంకి, చక చక ఉరుకుతు
ఆ.. రంగుల విల్లుని తీసి..
ఈ వైపు వంతెన వేసి.. రావా..

ఎన్నో తలపులు, ఏవో కలతలు
బతుకే పొరవుతున్నా..
గాల్లో పతంగిమల్లె.. ఎగిరే కలలే నావి..
ఆశనిరాశల ఉయ్యాలాటలు,
పొద్దుమాపుల మధ్యే..
నాకంటూ ఉందింతే.. ఉందంతా ఇక నీకే...

నీతో ఇలా.. ఏ బెరుకు లేకుండా
నివ్వే ఇగ.. నా బతుకు అంటున్నా...

నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచానే
తలగడగా..
నీ తలను వాల్చి కళ్ళు తెరిచి నా ఈ దునియా
మిలమిల చూడే....

వచ్చే మలుపులు, రస్తా వెలుగులు..
జారే చినుకుల జల్లే..
పడుగూ పేకా మల్లె.. నిన్ను నన్ను అల్లే..
పొద్దే తెలియక, గల్లీ పొడుగున...
ఆడే పిల్లల హోరే..
నాకంటూ ఉందింతే.. ఉందంతా ఇక నీకే..

ఏయ్ పిల్లా పరుగున పోదామా...
ఏవైపో జంటగ ఉందామా...

పారే నదైనా కలలు ఉన్నాయే
చేరే దరే ఓ వెదుకుతున్నాయే...
నా గుండె ఓలి చేసి, ఆచి తూచి అందించా
జాతరలా..
ఆ క్షణము చాతి పైన సోలి చూశా లోకం
మెరుపుల జాడే...

నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి..
నేలన కనిపిస్తుందే...
మారే నీడలు గీసే.. తేలే బొమ్మలు చూడే..
పట్నం చేరిన పాలపుంతలు.. పల్లెల సంతలు
బారే..
నాకంటూ ఉందింతే.. ఉందంతా ఇక నీకే...




నీ చిత్రం చూసి పాట సాహిత్యం

చిత్రం: లవ్ స్టోరి (2021)
సంగీతం: Ch. పవణ్
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్
గానం: అనురాగ్ కులకర్ణి




నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో...
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో...

నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో...
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో...

నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు
నీ గుండె మీదనే వేసుకుందు
నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో

ఈ దారిలోని గందరగోళాలే
మంగళ వాయిద్యాలుగా
చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో
మన పెళ్ళి మంత్రాలుగా
అటు వైపు నీవు నీ వైపు నే
వేసేటి అడుగులే ఏడు అడుగులని
ఏడు జన్మలకి ఏకమై పోదామా

ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ
రాసింది మనకు ప్రేమా
నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి
వెళ్లి పొమ్మంటోంది ప్రేమా

ఆఆ ఆ ఆఆ... ఆ ఆఆ ఆఆ రరా ఆఆ ఆఆ

ఈ కాలం కన్న ఒక క్షణం ముందే
నే గెలిచి వస్తానని
నీలి మేఘాలన్ని పల్లకీగా మలిచి
నిను ఊరేగిస్తానని
ఆకాశమంత మన ప్రేమలోన
ఏ చీకటైన క్షణకాలమంటు
నీ నుదుట తిలకమై నిలిచిపోవాలనీ

ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ
రాసింది మనకు ప్రేమా



సారంగ దరియా పాట సాహిత్యం

చిత్రం: లవ్ స్టోరి (2021)
సంగీతం: Ch. పవణ్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: మంగ్లీ, సిందూరి విశాల్, సుస్మితా నరసింహన్




దాని కుడి భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా

కాళ్ళకు ఎండీ గజ్జెల్
లేకున్నా నడిస్తే ఘల్ ఘల్
కొప్పులో మల్లె దండల్
లేకున్నా చెక్కిలి గిల్ గిల్

నవ్వుల లేవుర ముత్యాల్
అది నవ్వితే వస్తాయ్ మురిపాల్
నోట్లో సున్నం కాసుల్
లేకున్నా తమల పాకుల్

మునిపంటితో మునిపంటితో
మునిపంటితో నొక్కితే పెదవుల్
ఎర్రగా అయితదిర మన దిల్

చురియా చురియా చురియా
అది సుర్మా పెట్టిన చురియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా

దాని కుడి భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా

రంగే లేని నా అంగి 
జడ తాకితే అయితది నల్లంగి
మాటలు ఘాటు లవంగి
మర్ల పడితే అది శివంగి

తీగలు లేని సారంగి
వాయించ బోతే అది ఫిరంగి
గుడియా గుడియా గుడియా
అది చిక్కీ చిక్కని చిడియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా

దాని చెంపల్ ఎన్నెల్ కురియ
దాని చెవులకు దుద్దులు మెరియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా

దాని నడుం ముడతలే మెరియా
పడిపోతది మొగోళ్ళు దునియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా

దాని కుడి భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరేసారంగ దరియా




ఏవో ఏవో కలలే పాట సాహిత్యం

చిత్రం: లవ్ స్టోరి (2021)
సంగీతం: Ch. పవణ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: జొనిత గాంధీ, నకుల్ అభయంకర్




ఏవో ఏవో కలలే ఎన్నో ఎన్నో తెరలే
అన్ని దాటి మనసే హే ఎగిరింది
నన్నే నేనే గెలిచే క్షణాలివే కనుకే
పాదాలకే అదుపే హేహే, లేదంది

రమ్ పమ్ తర రమ్ పమ్
తర రమ్ పమ్... ఎదలో 
రమ్ పమ్ తర రమ్ పమ్
తర రమ్ పమ్... కథలో

ఏంటో.. కొత్త కొత్త రెక్కలొచ్చినట్టు
ఏంటో.. గగనంలో తిరిగా
ఏంటో.. కొత్త కొత్త ఊపిరందినట్టు
ఏంటో.. తమకంలో మునిగా
ఇన్నాళ్ళకి వచ్చింది విడుదల
గుండె సడి పాడింది కిలకిల
పూలాతడి మెరిసింది మిలమిల
కంటితడి నవ్వింది గలగల

ఊహించలేదసలే ఊగిందిలే మనసే
పరాకులో ఇపుడే హే హే పడుతోందే
అరే అరే అరెరే ఇలా ఎలా జరిగే
సంతోషమే చినుకై దూకిందే

రమ్ పమ్ తర రమ్ పమ్
తర రమ్ పమ్... ఎదలో 
రమ్ పమ్ తర రమ్ పమ్
తర రమ్ పమ్... కథలో

ఏంటో.. కల్లల్లోన ప్రేమ ఉత్తరాలు
ఏంటో.. అసలెప్పుడు కనలే
ఏంటో... గుండెచాటు ఇన్ని సిత్తరాలు
ఏంటో.. ఎదురెప్పుడు అవలే
నీతో ఇలా ఒక్కొక్క ఋతువుని దాచెయ్యన
ఒక్కొక్క వరమని
నీతో ఇలా ఒక్కొక్క వరముని పోగెయ్యనా
ఒక్కొక్క గురుతుని

ఇటువైపో అటువైపో ఎటువైపో
మనకే తెలియని వైపు
కాసేపు విహరిద్దాం చల్ రే... హో హో

ఏంటో మౌనమంత మూత విప్పినట్టు
ఏంటో సరిగమలే పాడే
ఏంటో వానవిల్లు గజ్జ కట్టినట్టు
ఏంటో కథకళినే ఆడే
గాల్లోకిలా విసరాలి గొడుగులు
మన స్వేచ్ఛకి వెయ్యొద్దు తొడుగులు
సరిహద్దులే దాటాలి అడుగులు
మన జోరుకి అదరాలి పిడుగులు

ఏంటో హల్లిబిల్లి హాయి మంతనాలు
ఏంటో మన మధ్యన జరిగే
ఏంటో చిన్న చిన్న చిలిపి తందనాలు
ఏంటో వెయ్యింతలు పెరిగే
ఏంటో ఆశలన్నీ పూసగుచ్చడాలు
ఏంటో ముందెప్పుడు లేదే
ఏంటో ధ్యాస కూడా దారి తప్పడాలు
ఏంటో గమ్మత్తుగా ఉండే



No comments

Most Recent

Default