చిత్రం: మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ (2021) సంగీతం: గోపి సుందర్ నటీనటులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్ నిర్మాతలు: బన్నీ వాసు, వాసు వర్మ విడుదల తేది: 19.06.2021
Songs List:
మనసా... మనసా... పాట సాహిత్యం
చిత్రం: మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ (2021) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: సిద్ శ్రీరామ్ మనసా... మనసా... మనసా మనసా మనసారా బ్రతిమాలా తన వలలో పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్ వినకుండా తనవైపు వెలతావ మనసా నా మాట అలుసా నేనెవరో తెలుసా నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నేడిపిస్తావే మనసా మనసా మనసా మనసారా బ్రతిమాలా తన వలలో పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్ వినకుండా తనవైపు వెలతావ మనసా ఏముంది తనలోన గమ్మత్తు అంటే అది దాటి మత్తేదో ఉందంటు అంటూ తనకన్నా అందాలు ఉన్నాయి అంటే అందానికే తాను ఆకాశమంటూ నువ్వే నా మాట.. హే... నువ్వే నా మాట వినకుంటే మనసా తానే నీ మాట వింటుందా ఆశ నా మాట అలుసా నేనెవరో తెలుసా నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నేడిపిస్తావే మనసా మనసా మనసా మనసారా బ్రతిమాలా తన వలలో పడబోకే మనసా.. పిలిచా అరిచా అయినా నువ్ వినకుండా తనవైపు వెలతావ మనసా.. తెలివంతనా సొంతమనుకుంటు తిరిగా తనముందు నుంచుంటే నా పేరు మరిచా ఆమాటలేవింటు మతిపోయి నిలిచా బదులెక్కడుందంటు ప్రతి చోట వెతికా తనతో ఉండే... హే.... తనతో ఉండే ఒక్కొక్క నిమిషం మరలా మరలా పుడతావా మనసా నా మాట అలుసా నేనవరో తెలుసా నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నేడిపిస్తావే మనసా.. మనసా మనసా మనసారా బ్రతిమాలా తన వలలో పడబోకే మనసా.. పిలిచా అరిచా అయినా నువ్ వినకుండా తనవైపు వెలతావ మనసా..
అరె గుచ్చే గులాబి లాగా పాట సాహిత్యం
చిత్రం: మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ (2021) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: శ్రీమణి, అనంత్ శ్రీరామ్ గానం: అర్మాన్ మాలిక్ అరె గుచ్చే గులాబి లాగా నా గుండెలోతునే తాకినదే వెలుగిచ్చే మతాబులాగా నా రెండు కళ్ళలో నిండినదే, హే... యే ఎవరే నువ్వే ఏం చేసినావే ఇటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే ఎదురై వచ్చి ఆపేసి నువ్వే ఎదరేముందో దాచేసినావే రెప్పల దుప్పటి లోపల గుప్పెడు ఊహలు నింపావే కుదురే కదిపేస్తావులే నిదురే నిలిపేస్తావులే కదిలే వీలే లేని వలలు వేస్తావులే ఎపుడూ వెళ్ళే దారినే అపుడే మార్చేస్తావులే నా తీరం మరిచి నేను నడిచానులే అరె గుచ్చే గులాబి లాగా వెలుగిచ్చే మతాబులాగా కళతెచ్చే కళ్ళాపిలాగా నచ్చావులే భలేగా అరె గుచ్చే గులాబి లాగా వెలుగిచ్చే మతాబులాగా కళతెచ్చే కళ్ళాపిలాగా నచ్చావులే భలేగా ఎవరే నువ్వే ఏం చేసినావే ఇటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే ఊపిరి పని ఊపిరి చేసే ఊహలు పని ఊహలు చేసే నా ఆలోచనలోకొచ్చి నువ్వేం చేస్తున్నావే నేనేం మాటాడాలన్నా నన్నడిగి కదిలే పెదవే నా అనుమతి లేకుండానే నీ పలుకే పలికిందే ఏమిటే ఈ వైఖరి ఊరికే ఉంచవుగా మరి అయ్యా నేనే ఓ మాదిరి అరె గుచ్చే గులాబి లాగా వెలుగిచ్చే మతాబులాగా కళతెచ్చే కళ్ళాపిలాగా నచ్చావులే భలేగా అరె గుచ్చే గులాబి లాగా వెలుగిచ్చే మతాబులాగా కళతెచ్చే కళ్ళాపిలాగా నచ్చావులే భలేగా ఎవరే నువ్వే ఏం చేసినావే ఇటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే నీకోసం వెతుకుతూ ఉంటే నేమాయం అవుతున్నానే నను నాతో మళ్ళీ మళ్ళీ కొత్తగ వెతికిస్తావే బదులిమ్మని ప్రశ్నిస్తావే నను పరుగులు పెట్టిస్తావే నేనిచ్చిన బదులుని మళ్ళీ... ప్రశ్నగ మారుస్తావే హే పిల్లో..! నీతో కష్టమే బళ్ళో గుళ్ళో చెప్పని పాఠమే... నన్నడుగుతు ఉంటే ఏం న్యాయమే
జిందగీ పాట సాహిత్యం
చిత్రం: మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ (2021) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: నఫీషా హనియా జిందగీ
లెహరాయి లెహరాయీ పాట సాహిత్యం
చిత్రం: మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ (2021) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: శ్రీమణి గానం: సిద్ శ్రీరామ్ లెహరాయి లెహరాయీ లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంతమల్లె చేరుకుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ, ఓ ఓ లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయీ, ఆఆ రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే ఒంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే ఒంపుతుంటే మరి నిన్నా మొన్నా ఒంటిగ ఉన్నా ఈడే నేడే లెహరాయి లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయీ, ఓ ఓఓ వేళాపాలలలే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మనలోకం మైకం ఏకం అవుతూ ఏకాంతాలే లెహరాయి లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంతమల్లె చేరుకుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ, ఓ ఓ
చిట్టి అడుగా పాట సాహిత్యం
చిత్రం: మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ (2021) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: Zia UI Haq & Chorus ఓ సోనియే ఓ సోనియే… ఓ సోనియే అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారి ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా సరిలే ఇపుడైనా తెలిసిందిగా తొలిసారి ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక ఇన్నాళ్లు నిన్నెత్తుకొని ఊరేగించిన ఈ లోకం తన బరువు తానే సరిగా మోయలేని ఓ మాలోకం ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక శిలలాంటి నిన్ను ఇలా శిల్పంగా మలిచింది ఆ నవ్వులో చురకలే నీ సొంత కలలాగా నీ కంట నిలిచింది ఆ దివ్వెలో మెరుపులే అచ్చంగా తనలా ఉందా అద్దం చూపే నీ రూపం నీ సొంత చిరునామాలా కనిపిస్తోందా ఈ మలుపు ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక ఎన్నెన్ని జన్మాలైనా తెగిపోని బంధం ఏదో ఎదురైంది నీ దారిలో, ఓ ఓ మాటలకందని భావం మనసెలా గుర్తిస్తుందో తెలిసింది ఆ చెలిమితో ఇంకెవరి కల్లో చూసే కలవే నువ్వు ఇన్నాళ్లు ఎంత బాగుందో చూడు నీ తొలి వేకువ ఈనాడు ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారి ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా సరిలే ఇపుడైనా తెలిసిందిగా తొలిసారి ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక ఇన్నాళ్లు నిన్నెత్తుకొని ఊరేగించిన ఈ లోకం తన బరువు తానే సరిగా మోయలేని ఓ మాలోకం ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక (2) ఓ సోనియే, హే హే ఏ ఏ
No comments
Post a Comment