చిత్రం: నారప్ప (2021) సంగీతం: మణి శర్మ నటీనటులు: వెంకటేష్, ప్రియమణి దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల నిర్మాతలు: డి.సురేష్ బాబు, కలైపులి ఎస్. తాను విడుదల తేది: 2021
Songs List:
చలాకీ చిన్నమ్మి పాట సాహిత్యం
చిత్రం: నారప్ప (2021) సంగీతం: మణి శర్మ సాహిత్యం: అనంత శ్రీరాం గానం: ఆదిత్య అయ్యంగార్, నూతన్ మోహన్ తందానే నా నేననేన నానా తందానే నా నేన నేన నానా తందానే నా నేన నేన నానా తందానే నా నేన నేన నానా చిలిపీ చూపుల చలాకీ చిన్నమ్మి, చలాకీ చిన్నమ్మి ఎలాగే నిన్నిడిచి ఎలాగే ఉండేది చలాకీ చిన్నమ్మి రాగి ముద్దవి నువ్వెర్రాని కారము నేనెలాగే నిన్నిడిచి.... ఎలాగే ఉండేది చలాకీ చిన్నమ్మి రానా నీతోటి ఇలాగే నిను నమ్మి ఇలాగే నిను నమ్మి రాలసీమంటి వయ్యారి వన్నెల్లో వరాలే విరజిమ్మి, వరాలే విరజిమ్మి కిండాలెన్నైనా చేత్తానే నీతో ఉండే నూరేళ్ళు చూడాలే ఎంతో రేగడి నేనైతే నాగలి నీ నవ్వే దున్నితే పండాలె నా పంటా మంచే కట్టాలోయ్ ఈడు పొలంలో, ఓ ఓ కంచె తెంచాలోయ్ కన్నె కలల్లో పంచై చేరాలోయ్ కొక చివర్లో, ఓ ఓ కంచై మోగాలోయ్ రైక కొనల్లో యాలో యాల గంకెలై కాయాల శణాలే ఈయేలా నువ్వు నేన్ తొయ్యాల జతై మోసెయ్యాల కందీ చేలోన జోరీగల్లాగా జోడై ఎగిరేద్దాం రాయే సరదాగా వేమన అవతారం ఎన్నడె బంగారం అన్నది నా ఆత్రం భారంగా చాల్లే చాలబ్బి సంబడమిట్టా, ఆ ఆ లగ్గాల్లేకుండా సందడులెట్టా నీకై దాచానీ పల్లము మిట్టా నువ్వే దాటెయ్ నా సిగ్గుల కట్టా పిల్లా గాలే పిచ్చిగా ఊదాలే పి పి పీ డుండుంలే... పిపి పీ డుండుంలే... పిపి పీ డుండుంలే...
ఓ… నారప్ప పాట సాహిత్యం
చిత్రం: నారప్ప (2021) సంగీతం: మణి శర్మ సాహిత్యం: అనంత్ శ్రీరాం గానం: ధనుంజయ్, వరం ఓ… నారప్ప నువ్వంటే ఇట్టంగుందే నారప్ప నిను చూడంగానే ఇపారిందోయ్ నా రెప్ప ఓ… కన్నమ్మ ఆ కంటి రెప్పై కాసుకుంటా కన్నమ్మ నీ జంటై అంటి పెట్టుకుంటా ఈ జన్మ ఇనేయ్ వా ఇట్టా ఇట్టా నా గుండె ఏమంటుంటదో ఇన్నాలే ఆశల చిట్టా ఆ ఎరుకే ఎం అవుతుండదో భలేగా బాగుందే సిలకా నీ మాయ తలకాయ్ ఆడించే పిలకాయ్ అయిపోయా కలకే నోరూరే ఎలుగె మనపై పడుతుండాదే హోయా ఓ… నారప్ప నువ్వంటే ఇట్టంగుందే నారప్ప నిను చూడంగానే ఇపారిందోయ్ నా రెప్ప ఓ… కన్నమ్మ ఆ కంటి రెప్పై కాసుకుంటా కన్నమ్మ నీ జంటై అంటి పెట్టుకుంటా ఈ జన్మ
నరకరా నరకరా పాట సాహిత్యం
చిత్రం: నారప్ప (2021) సంగీతం: మణి శర్మ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: శ్రీ కృష్ణ , రేవంత్, సాయి చరణ్ భాస్కరుని రా నరకరా నరకరా ఎదురు తిరిగి కసిగా రా నరకరా నరకరా తలలు ఎగిరి పడగా రా చెర చెర చెరగరా మెడని మెడని విడిగా రా తరామరా తురమారా నరము నరము విరగ కత్తి గొంతులో నెత్తురేయ్యారా మట్టి నోటిలో దండ ముద్ద కలిపి వేయరా నీలి నింగిని గాలి రంగుని ఎర్ర ఎర్రగా మార్చి వెయ్యరా ఆయుధానికే ఆయుదానివై ఆయువుల్ని తీసి చేసుకోరా చావు జాతర రా నరకరా నరకరా ఎదురు తిరిగి కసిగా రా నరకరా నరకరా తలలు ఎగిరి పడగా రా చెర చెర చేరగరా మెడని మెడని విడిగా రా తరామరా తురమారా నరము నరము విరగ గుండెలోకి గుణపమై కడుపులోకి కొడవలై దూసుకెళ్లి కోసుకెళ్లి పేగులన్నీ తొలిచివేయి గాయపడ్డ మనసువై మోసపడ్డ మనిషివై లోపలున్న రాక్షసుణ్ణి దాచకింకా పైకి తీయి క్రూర మృగమువై క్రూర క్రూర మృగమువై గొర్ల కోరలతో వాళ్ళ రొమ్ములని వొలిచివేయి కాల యముడువై పూనకాలా యముడువై పాశం విసిరివేయి వెన్ను పూసలన్నీ విరిచివేయి రా నరకరా నరకరా ఎదురు తిరిగి కసిగా రా నరకరా నరకరా తలలు ఎగిరి పడగా రా చెర చెర చేరగరా మెడని మెడని విడిగా రా తరామరా తురమారా నరము నరము విరగ
తల్లి పేగు పాట సాహిత్యం
చిత్రం: నారప్ప (2021) సంగీతం: మణి శర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: సైంధవి తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా కళ్ళు మూసి ఎటో వెళ్లిపోకయ్యా నన్ను కన్నా తండ్రి ఇలా రావయ్యా కడుపులోనే ఉండక ఈ పుడమికెలా వస్తివయ్యా సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా ఇంతలోనే ఏమయ్యావో చెప్పయ్యా రాకాసి చీకటిలో ఏ కీడు తాకిందో ఏకాకివై పోయావా చంద్రయ్యా కళ్లెర్ర జేసి రేయిని చుడయ్యా తెల్లారి సూరిడల్లే రావయ్యా నీ సెమట తడి ఇంకా ఇంకనేలేదయ్యా ఈ తోటనంతా తడిమి సుడయ్యా నీ నవ్వు సడిలేక గూడు సిన్నబోయెనయ్యా ఇంతలోనే ఋణము తీరే నీకయ్యా మట్టిని చిల్చుకొచ్చే విత్తనమై రావయ్యా సావుని కూడా సంపే సత్తువ నీదయ్యా అష్టదిక్కులన్నీ సుట్టుముడుతున్నా ఇట్టేనెట్టి సప్పున ఇంటికి రావయ్యా తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా కళ్ళు మూసి ఎటో వెళ్లిపోకయ్యా నన్ను కన్నా తండ్రి ఇలా రావయ్యా కన్నొదిలి చూపెల్లీ మసకేసి పోయేలే గుండెల్లో మంట నిన్ను చూపేనా... నన్నొదిలి నువ్వెళ్ళి కోడి కట్టి ప్రాణాలే నా ఆశకాయువింకా ఇంకా మిగేలేరా కటిక నిజం నీదని ఏ రుజువెదురవని నమ్మాలంటే కష్టం కదా నాయనా ఆకైనా అల్లాడదే చూడయ్యా... నువు రాకుంటే గాలాడదే కన్నయ్యా తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా.... నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా కడుపులోనే ఉండక ఈ పుడమికెలా వస్తివయ్యా సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా... ఇంతలోనే ఏమయ్యావో సెప్పయ్యా రాకాసి చీకటిలో ఏ కీడు తాకిందో ఏకాకివై పోయావా చంద్రయ్యా... కళ్ళేర్ర జేసి రేయిని చూడయ్యా... తెల్లారి సూరిడల్లే రావయ్యా
ఊరు నట్టనడివాయే పాట సాహిత్యం
చిత్రం: నారప్ప (2021) సంగీతం: మణి శర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: అనురాగ్ కులకర్ణి ఊరు నట్టనడివాయే దారి కంట పడదాయే నీ జాడ చెప్పేదెవరు నాకింకా... నిన్ను చూడగలనో లేదో నేనింకా వేళ చూడు వేటాయే వెలుగు కూడా ఈటాయే ఓపలేని బరువైపోయే బాణాలు... ఆపలేని పరుగైపోయే పాదాలు
No comments
Post a Comment