Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sreekaram (2021)





చిత్రం: శ్రీకారం (2021)
సంగీతం: మిక్కీ జే మేయర్
నటీనటులు: శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్
దర్శకత్వం: బి. కిశోర్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
విడుదల తేది:11.03. 2021



Songs List:



భలేగుంది బాలా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (2020)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: పెంచల్ దాస్
గానం: పెంచల్ దాస్, నూతన మోహన్,
ధనుంజయ్, అనురాగ్ కులకర్ణి

వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా 
దాని ఎధాన  దాని ఎధాన దాని ఎధాన ఉండే
పూల పూల రైక భలేగుంది బాలా

వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే
వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే
కట్టమింద హ కట్టమింద 
భలే కట్టమింద పొయ్యే  అలకల సిలకా భలేగుంది బాలా
దాని ఎధాన దాని ఎధాన
దాని ఎధాన ఉండే  పూల పూల రైక భలేగుందే బాలా

అరెరెరెరే 
నారి నారి వయ్యారి సుందరి నవ్వు మొఖముదాన
నారీ నారీ వయ్యారి సుందరి నవ్వు మొఖముదాన
నీ నవ్వు మొఖం  నీ నవ్వు మొఖం నీ నవ్వు మొఖంమింద
నంగనాచి అలక భలేగుంది బాలా
నీ నవ్వు మొఖంమింద నంగనాచి అలక భలేగుంది బాలా

వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా
దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా

హో ఓ ఓ...  హో ఓ ఓ...
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ... 
అరరే అరరే అరె అరె అరె అరె

తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులక మంచం
తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులక మంచం
అల సందా పోవ్వ నీకు అలక ఏలనే అగుడు సేయ తగునా
అల సందా పోవ్వ నీకు అలక ఏలనే అగుడు సేయ తగునా

వచ్చానంటివో  అరె వచ్చానంటివో ఓ ఓ ఓ
వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే  అలకల సిలకా భలేగుంది బాలా 
దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుంది బాలా

అరెరెరెరే  సురుకు సూపు సొరకత్తులిసరకే సింత ఏల బాలా
సురుకు సూపు సొరకత్తులిసరకే సింత ఏల బాలా
కారమైన ముది కారామైన ముది కారమైన 
నీ మూతి ఇరుపులు భలేగున్నయే బాలా
నీ అలక తీరనూ  ఏమి భరణము ఇవ్వగలను భామ

ఎన్నెలైన ఏమంత నచ్చదూ  ఊ ఊ ఊ
ఎన్నెలైన ఏమంత నచ్చదూ నువ్వు లేని చోటా
ఎన్నేలైన ఏమంత నచ్చదూ  నువ్వు లేని చోటా
నువ్వు పక్కనుంటే  నువ్వు పక్కానుంటే
నువ్వు పక్కనుంటే  ఇంకేమి వద్దులే చెంత చేర రావా
ఇంకనైన పట్టించుకుంటనని మాట ఇవ్వు మావా
తుర్రుమంటు పైకెగిరిపోద్ది నా అలక సిటికలోన



సందల్లే సందల్లే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (2021)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: సనపాటి భరద్వాజ్ పాత్రుడు
గానం: అనురాగ్ కులకర్ణి, మోహన భోగరాజు

సందల్లే సందల్లే  సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా  సంక్రాంతి సందల్లే
సందల్లే సందల్లే  సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా  సంక్రాంతి సందల్లే

మన ఊరితో సమయాన్నిలా 
గడిపేయడం ఒక సరదారా
మనవారితో కలిసుండడం ఒక వరమేరా
నను మరవని చూపులెన్నెన్నో
నను నడిపిన దారులెన్నెన్నో
నను మలచిన ఊరు ఎన్నెన్నో 
గురుతులనిచ్చినదే

సందల్లే సందల్లే  సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా  సంక్రాంతి సందల్లే
సందల్లే సందల్లే  సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే

ముగ్గుమీద కాలు వెయ్యగానే
రయ్యిమంటూ కయ్యిమన్న
ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం

భోగి మంట ముందు నిల్చొనుంది 
చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది
తంబురాలతో చిడత పాడెనంట
గంగిరెద్దులాటలో డోలు సన్నాయంట 

పెద్ద పండగొచ్చెనోయంటూ 
ముస్తాబుఅయ్యింది చూడరా,
ఊరు ఇచ్చటా ఇంటిగడప ఉంది
స్వాగతించడానికి వీధి అరుగు ఉంది 
మాట కలపడానికి రచ్చబండ ఉంది 
తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికీ

మన ఊరితో సమయాన్నిలా
గడిపేయడం ఒక సరదారా
మన వారితో కలిసుండడం
ఒక వరమేరా  ఓఓఓ...

దెబ్బలాటలోన ఓడిపోతే
కోడిపుంజు పొయ్యి మీద
కూరలాగా తాను మాడిపోదా పాపం

నేల మీది నుండి గాలిపటం
నింగిదాకా దారమే తోకగా ఎగురుతుంది
ఎడ్ల బండిపై ఎక్కు చిన్నా పెద్దా
గోలగోల చెయ్యడం ఎంత బాగుందంట
రోజు మారిపోయినాగాని తగ్గేది లేదంటా
అంతటా సంబరాలే 

విందు భోజనాలు చేసి రావడానికి
నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి
అంతమందినొక్కసారి కలవడానికి
చాలవంట మూడు రోజులు

మన ఊరితో సమయాన్నిలా
గడిపేయడం ఒక సరదారా
మన వారితో కలిసుండడం
ఒక వరమేరా ఆ ఆ ఆ...

మన ఊరితో సమయాన్నిలా
గడిపేయడం ఒక సరదారా
మనవారితో కలిసుండడం
ఒక వరమేరా ఓఓఓ...

సందల్లే సందల్లే  సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
సందల్లే సందల్లే  సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా  సంక్రాంతి సందల్లే



హేయ్ అబ్బాయి పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (2020)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: నూతన మోహన్, హైమత్

నో నో వద్దన్నా నిను ఫాలో చేస్తున్నా
ఏదో రోజు ఎస్ అంటావని ఎదురే చూస్తున్నా
హే పో పో పోమ్మన్నా పడిగాపే కాస్తున్నా
గర్ల్ ఫ్రెండయ్యే మూమెంట్ కోసం ప్లానే వేస్తున్నా

సారీ అన్నా క్షమిస్తానా
నే వింటానా వస్తా ఏమైనా
హేయ్ అబ్బాయి
హే హేయ్ అబ్బాయి
ఇంకా ఫోజులు చాలోయి
కాస్తా ఇటేపు చూడోయి

హేయ్ అబ్బాయి
సిగ్గేంటోయ్ అబ్బాయి
నీకే ముద్దోటిచ్చి పోగొట్టెయ్ నా

హే హేయ్ అబ్బాయి
హేయ్ అబ్బాయి హే హేయ్ అబ్బాయి

నేను చూస్తున్నా పరువే తీసేస్తున్నా
పోనీ పాపం అమ్మాయంటు వదిలేస్తూ ఉన్నా
నీదే తప్పున్నా ఇన్నాళ్ళు తగ్గున్నా
పడనే నేను వదిలేయ్ నన్ను ఆపేయ్ అంటున్నా

నువ్వేమన్నా వస్తానన్నా
నే వింటానా బుద్దిగా ఆగమ్మా
హేయ్ అమ్మాయి హే హేయ్ అమ్మాయి
ఆపేసెయ్ గోలంటూ ఇంకా ఎలాగ చెప్పాలి
హేయ్ అమ్మాయి హే హేయ్ అమ్మాయి
ఓ మీదే పడిపోయి ఇట్టా కలరింగిస్తే కట్ చేసెయ్నా

తెగ ప్రేమే ఉన్నానీ పైన చీపయ్యానా
తొలిచూపుల్లోనే మనసు నీదే తెలుసుకున్నా
ఇక అప్పట్నుంచే ఏమైనా నీతో ఉన్నా
ఒక నిన్నే నిన్నే తగిన జోడనే ఊహిస్తున్నా
నేడని రేపని ఎంతకాలమే అయినా
ఏదీ చూడక ఒక్కమాటపై నేనున్నా
అయినా నీకిది అర్థమైననూ కాకున్నా
అసలే నిన్ను వదిలేపోను నీతోపాటే నేనుంటా
హేయ్

హేయ్ అబ్బాయి
హే హేయ్ అబ్బాయి
ఇంకా ఫోజులు చాలోయి కాస్తా ఇటేపు చూడోయి
హేయ్ అబ్బాయి హే హేయ్ అబ్బాయి
సిగ్గేంటోయ్ అబ్బాయి నీకే ముద్దోటిచ్చి పోగొట్టెయ్నా




శ్రీకారం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (2020)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: హైమత్, నూతన్ మోహన్

కనివిని ఎరుగని కదలిక మొదలైంది
అడుగులో అడుగుగా....వెతికిన వెలుగుగా
అలికిడి ఎదురయ్యింది...నిశీధినే జయించగా
శ్రీకారం కొత్త సంకల్పానికి.... 
కళలు చిగురిస్తున్న సంతోషం ఇది
శ్రీకారం కొత్త అధ్యాయానికి....చినుకు పరిమళమల్లే
దీవిస్తున్నదీ పుడమి
వారసులం మనమేగా..... నిన్నటి మొన్నటి పద్ధతికి
వారధులం మనమేగా.... రేపటి మార్పులకీ

రెవల్యూషన్, ఇట్స్ ఆ చేంజ్ రెవల్యూషన్
ఇట్స్ ఆ ఫైర్ రెవల్యూషన్
లెట్ అస్ ఆల్
ఇన్స్ఫెర్
రెవల్యూషన్, ఇట్స్ ఆ వే రెవల్యూషన్
లెట్స్ సే రెవల్యూషన్
వి కెన్ మేక్ ఆ బెటర్ ఫ్యూచర్

మండే ఎండకు ఫ్రెండ్ అవడం... మనకు తెలుసుగా
అలవాటే ఇక.. చెమటతడి పండుగ
ఏసీ గదులకి బాయ్ బాయ్ చెప్పాము అలవోకగా
పయనం కదిలిందిలా... మనసుకు నచ్చిన దారిగా

బురదేం కాదిది....మనకిది ఒక సరదా సంబరం
నేలమ్మ ఒడిలో మనకిక.... ప్రతిదినమొక పాఠం
ప్రకృతి పిలుపిది... ఇన్నాళ్ళుగా వేసిన మలుపిది
కలలకు తలపాగ చుడదాం... బంగారం పండిద్దాం

రెవల్యూషన్, ఇట్స్ ఆ చేంజ్ రెవల్యూషన్
ఇట్స్ ఆ ఫైర్ రెవల్యూషన్
లెట్ అస్ ఆల్ ఇన్స్ఫెర్
రెవల్యూషన్, ఇట్స్ ఆ వే రెవల్యూషన్
లెట్స్ సే రెవల్యూషన్
వికెన్ మేక్ ఆ బెటర్ ఫ్యూచర్

అచ్చంగా మనం... కంప్యూటర్ కాలం యువకులం
మెదడే ఇంధనం... చదువు మన సాధనం
సాధ్యం కానిది లేదంటుంది... ఈ మన యవ్వనం
మనసుపడి ఏ పని చేసినా... సుళువుగా రాణిస్తాం మనం
తరముల నాటిది.... మన తాతలు చేసిన కృషి ఇది
తెలియనిదేం కానేకాదులే... మనకీ వ్యవసాయం, హో హో
జీన్సే తొడిగినా.. మన జీన్స్ లో ఈ కళ ఉన్నదే
పదపద మొదలౌదాం... నేడే నవయువ కర్షకులై

No comments

Most Recent

Default