చిత్రం: ఆనందం అంబరమైతే (2020)
సంగీతం: శ్రీకృష్ణ
సాహిత్యం: నూజిల శ్రీనివాస్
గానం: గీతామాధురి, పార్థసారధి
నటీనటులు: రామకృష్ణ, అవంతిక
దర్శకత్వం: సబ్బు ఈరంకి
నిర్మాతలు: బుద్దాల సత్యన్నారాయణ, హైమావతి
విడుదల తేది: 07.07.2020
మేము గోదారోళ్ళమండి
ఆయ్ మేము గోదారోళ్ళమండి
మా మడుసులు మిన్నండి
మా మనసులు వెన్నండి
మడుసులు మిన్నండి
మా మనసులు వెన్నండి
ఉప్పులు కారం మాటేమోగాని
ఉప్పు కారం మాట ఏమోగాని
వెటకారం మాకెంతో రుచి అండి
మేము గోదారోళ్ళమండి
ఆయ్ మేము గోదారోళ్ళమండి
పెద్దలంటే మర్యాదండి
మాకు పేద గొప్ప బేధం లేదండి
పెద్దలంటే మర్యాదండి
మాకు పేద గొప్ప బేధం లేదండి
కులము గోత్రం మాట ఎటున్న
మాకు ఊరంతా సుట్టాలేనండి
కులము గోత్రం మాట ఎటున్న
మాకు ఊరంతా సుట్టాలేనండి
మేజువాణి మేళం మాకు మోజండీ - హహహ
మేజువాణి మేళం మాకు మోజండీ
కోడి పందేలంటే చానా ఇష్టమండి
మేము గోదారోళ్ళమండి
ఆయ్ మేము గోదారోళ్ళమండి
దేవులందరికి నెలవండి
గొప్ప వేదపండితుల కొలువండి
దేవులందరికి నెలవండి
గొప్ప వేదపండితుల కొలువండి
పండగలు పబ్బాలంటే
అబ్బా చెప్పలేని సందడేనండి
పండగలు పబ్బాలంటే
అబ్బా చెప్పలేని సందడేనండి
అభిమానం మా ఇంటి పేరండి
అభిమానం మా ఇంటి పేరండి
ఆతిథ్యము మా ఆరో ప్రాణం అండి
మేము గోదారోళ్ళమండి
ఆయ్ మేము గోదారోళ్ళమండి
పూతరేకు రుచి మాదండి
మడత గొట్టం కాజాలు మావండి
పూతరేకు రుచి మాదండి
మడత గొట్టం కాజాలు మావండి
ఖైరతాబాద్ గణపయ్య మెచ్చే
లడ్డు కూడా మాదేనండి
ఖైరతాబాద్ గణపయ్య మెచ్చే
లడ్డు కూడా మాదేనండి
హయ్య తిండి పెట్టి మమ్ము సంపేతారంటూ బాబోయ్
బాబోయ్ తిండి పెట్టి మమ్ము సంపేతారంటూ తిన్నోళ్లు సరదాగా అంటుంటారండి
మేము గోదారోళ్ళమండి
ఆయ్ మేము గోదారోళ్ళమండి
అన్నదాతలం మేమండి
సాఫ్ట్వేర్ వీరులం మేమండి
అన్నదాతలం మేమండి
సాఫ్ట్వేర్ వీరులం మేమండి
అంబాజీపేట నుంచి అమెరికా దేశం దాక
మేమెనండి
అంబాజీపేట నుంచి అమెరికా దేశం దాక
మేమెనండి
ఫేస్ బుక్ అయినా పేస్ టు ఫేస్ అయినా
ఫేస్ బుక్ అయినా పేస్ టు ఫేస్ అయినా
మాతో మాటలంటే మంచిగుంటదండి
మేము గోదారోళ్ళమండి
ఆయ్ మేము గోదారోళ్ళమండి
సినిమాలంటే మహా పిచ్చండి బాబు
సంప్రదాయాలకు రిచ్ అండి
సినిమాలంటే పిచ్చండి బాబు
సంప్రదాయాలకు రిచ్ అండి
బాషలోనే కొంత యాసున్నా
మాట తేనెలూరుతుంటాదండి
బాషలోనే కొంత యాసున్నా
మాట తేనెలూరుతుంటాదండి
గోదారమ్మ నీళ్ళచలవతో
గోదారమ్మ నీళ్ళచలవతో
ఎదిగిన కొద్ది ఒదిగి ఉంటామండీ
మేము గోదారోళ్ళమండి
ఆయ్ మేము గోదారోళ్ళమండి
మా మడుసులు మిన్నండి
మా మనసులు వెన్నండి
మా మడుసులు మిన్నండి
మా మనసులు వెన్నండి
చిత్రం: ఆనందం అంబరమైతే (2021)
సంగీతం: శ్రీకృష్ణ
సాహిత్యం: నూజిల శ్రీనివాస్
గానం: యస్. పి. బాలు
ఏడాకెళ్లావంటూ ఏడుస్తున్నాదయ్యో
నీ పల్లె తల్లీ నీ కోసం
ఏనాడొస్తావంటూ ఎదురుచూస్తుందయ్యో
నీ కన్న తల్లి నీ కోసం
నీ కన్న తల్లి నీ కోసం
మా పల్లె పిలగాడా దేశమొదలినోడా
ఒకసారి ఇను నా మాట
పట్టరా నీ పల్లె బాట పట్టరా నీ పల్లె బాట
బాధ నిండిన తల్లి గుండె బరువు కాగా
సూడలేని కన్ను చెమ్మగిల్లినాది
ఆశ రేపిన సిన్కు ఆవిరై పోగా
చిగురు పట్టిన మాను మోడుగా మారింది
ఊతమిచ్చిన ఊరు ఊసు మరిచిపోగా
ఏడిసి ఏడిసి బీడుగా మారింది
మా పల్లె పిలగాడా మమ్ము ఇడిసినోడా
ఒకసారి విను నా మాట
పట్టరా నీ పల్లె బాట పట్టరా నీ పల్లె బాట
ఏడాకెళ్లావంటూ ఏడుస్తున్నాదయ్యో
నీ పల్లె తల్లీ నీ కోసం
యేటి కోసారైనా ఊరు రారేమయ్యా
కాటికి పోయెటి కన్నోళ్ల కనరయ్య
అభిమానమడ్డోచ్చి అమ్మ నాన్నలు మీకు
అసలు ఇసయాలేవి చెప్పుకున్నారయ్యా
భాగ్యనగరంలోన బంగారముండొచ్చు
అమెరికా దేశంలో డాలర్లు పండొచ్చు
అంతకు మించిన ప్రేమాభిమానాలు
పల్లె తల్లి నీకు పంచె బహుమానాలు
పంచె బహుమానాలు
మా పల్లె ఆడ పడుచా మమ్ము ఈడ్చిన దాన
ఓసారి విను నా మాట తల్లి
పట్టవా నీ పల్లె బాట
ఏడాకెళ్లావంటూ ఏడుస్తున్నాదయ్యో
నీ పల్లె తల్లీ నీ కోసం
పల్లె దేశానికి పట్టుకొమ్మా అన్నా
పెద్దల మాటలు నీటి మూటలేనా
ఎగిరిన పిల్లలు ఎనుకకోస్తారంటూ
ఎదురు చుసిన కళ్ళే కాయలు కాసేనా
నిచ్చనల్లే పల్లె నెక్కి ఎదిగినోడా
చచ్చిపోతన్నను చూడంగ రావేరా
మా పల్లె పిల్లగాడా మమ్ము మరిసినోడా
ఒకసారి ఇను నామాట అయ్యా
పట్టరా నీ పల్లె బాట
No comments
Post a Comment