చిత్రం: అర్ధ శతాబ్దం (2021) సంగీతం: నౌఫల్ రాజా A.I.S నటీనటులు: కార్తిక్ రత్నం, నవీన్ చంద్ర, సూహాష్, సాయి కుమార్, కృష్ణ ప్రియ, ఆమని దర్శకత్వం: రవీంద్ర పుల్లే నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ విడుదల తేది: 11.06.2021 (AHA)
Songs List:
రాయే ఎన్నెలమ్మ పాట సాహిత్యం
చిత్రం: అర్ధ శతాబ్దం (2021) సంగీతం: నౌఫల్ రాజా A.I.S సాహిత్యం: రెహమాన్ గానం: శక్తి లోగనాధం రాయే ఎన్నెలమ్మ
ఏ కన్నులు చూడనీ చిత్రమే పాట సాహిత్యం
చిత్రం: అర్ధ శతాబ్దం (2021) సంగీతం: నౌఫల్ రాజా A.I.S సాహిత్యం: రెహమాన్ గానం: సిద్ శ్రీరామ్ పల్లవి: ఏ కన్నులు చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఏ కన్నులు చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులు చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే చరణం: 1 ఎంత దాచుకున్నా పొంగిపోతువున్నా కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనా దారికాస్తువున్నా నిన్ను చూస్తువున్నా నువ్వు చూడగానే దాగిపోతువున్నా నినుతలచి ప్రతినిమిషం పరవశమై పరుగులనే తీసే నా మనసు ఓ వెల్లువలా తన లోలోనా... అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులు చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే చరణం: 2 రంగులద్దుకున్న సందెపొద్దులాగా నువ్వునవ్వుతుంటే దివ్వెలెందుకంటా రెప్పలేయకుండా రెండుకళ్ల నిండా నిండుపున్నమల్లే నిన్ను నింపుకుంటా ఎవరికిదీ తెలియదులే మనసుకిదీ మధురములే నాలో నే మురిసి ఓవేకువలా వెలుగైవున్నా..! అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులు చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఎర్రని సూరీడే పాట సాహిత్యం
చిత్రం: అర్ధ శతాబ్దం (2021) సంగీతం: నౌఫల్ రాజా A.I.S సాహిత్యం: లక్ష్మీ ప్రియాంక గానం: మోహన భోగరాజు అరె..! ఎర్రని సూరీడే పొద్దంతా సిందేసి నిదరోయాడే హే..! మా సక్కాని చంద్రుడే రేయంతా ఆడంగా లేస్తున్నాడే ఒంటి మీద జారుతున్న సెమట సుక్కలే సుతారంగా మెరిసిపోయే నింగి సుక్కలై డొక్కా లోకి జారుకుంటే గంజి మెతుకులే రెక్కలొచ్చినట్టు పొంగిపోవా బతుకులే ఎర్రని సూరీడే పొద్దంతా సిందేసి నిదరోయాడే మా సక్కాని చంద్రుడే రేయంతా ఆడంగా లేస్తున్నాడే ఒంటి మీద జారుతున్న సెమట సుక్కలే సుతారంగా మెరిసిపోయే నింగి సుక్కలై డొక్కా లోకి జారుకుంటే గంజి మెతుకులే రెక్కలొచ్చినట్టు పొంగిపోవా బతుకులే
కాలం అడిగే పాట సాహిత్యం
చిత్రం: అర్ధ శతాబ్దం (2021) సంగీతం: నౌఫల్ రాజా A.I.S సాహిత్యం: రెహమాన్ గానం: అనురాగ్ కులకర్ణి కాలం అడిగే మనిషంటే ఎవరు
నీ ప్రేమనే పాట సాహిత్యం
చిత్రం: అర్ధ శతాబ్దం (2021) సంగీతం: నౌఫల్ రాజా A.I.S సాహిత్యం: రెహమాన్ గానం: ఆంటోని దాసన్ రప్పప్పప్పా రప్పప్ప రప్పప్పా రప్పప్పప్పా రప్పప్పా రప్పప్ప రప్పప్పప్పా (2) నీ ప్రేమనే తేలిపే ఆ పువ్వు ఎపుడు పూసెనో ఈ లోకమే మరిచి కనులు ఎదురు చూసెనో నిదుర రాదులే కుదురు లేదులే వేరేది ఏదీ గురుతు రాదులే పగలు రేయిలా సతమతమై ఇలా ఎన్ని పడిగాపులు కాస్తున్నావో రప్పప్పప్పా రప్పప్ప రప్పప్పా రప్పప్పప్పా రప్పప్పా రప్పప్ప రప్పప్పప్పా (2) ఈ మాయలో మునిగి మనసు ఎపుడు తేలెనో ఈ దారిలో కదిలే అడుగు ఏ ధరి చేరేనో ఈ పువ్వు ఎప్పుడొ పూచేది
మెరిసెలే మెరిసెలే పాట సాహిత్యం
చిత్రం: అర్ధ శతాబ్దం (2021) సంగీతం: నవ్ ఫాల్ రాజా AIS సాహిత్యం: రెహమాన్ గానం: శంకర్ మహదేవన్ పల్లవి: మాంగళ్యం తంతునానే మవజీవన హేతునా అరె మెరిసెలే మెరిసెలే మిలమిలమిల మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా జత కలిసెలే కలిసెలే ఇరుమనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా ఆనింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలి వలపే వధువై నిలిచే... వరుడే వరమై రాగ ఈ జగమే అతిథై మురిసే... మనసే మనువై పోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా ఒక కల లాగ కరిగెను దూరం ఇక జత చేరి మురిసెను ప్రాణం ఒక శిలలాగా నిలిచెను కాలం ఒడిగుడిలోనే తరిగేను బాణం ఇది కదా ఈ హృదయములో ఒదిగిన ప్రేమ బంధం ఒక స్వరమై తడిమినది తనువును రాగ బంధం గుండె నిండా సందడేమి తెచ్చి ఉండిపోయినవే పండగల్లె వచ్చి పున్నమల్లే వెండి వెన్నెలల్లే నన్ను అల్లుకోవే రెండు కళ్ళతోటి జరిగి జరిగి కరిగే తొలకరి పరువపు జడిగా ఎదపై పలికే తడి తకతకతక తక తకధిమిత ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా గెలిచినవే నిను నా ప్రేమ నిలిపినదెలోలోనా విడువనులే ఇక ఏ జన్మ జతపడుతూ రానా ఒక నీడనై నడిపించనా ఒక ప్రాణమై బ్రతికేయనా ప్రణయములే ఎదురైనా చెదరని దీపయణం సరిగమలు చదవనివో కథ మాన ప్రేమ కావ్యం నువ్వు నేను పాడుకున్న పాట రంగురంగులున్న జ్ఞాపకాల తోట నువ్వు నేను ఏకమైనా చోట మబ్బులంటూ లేని చందమామ కోట నువ్వు నా సగమై జగమై ఉదయపు తోలి కిరణముగా వెలుగై తగిలే తోలి చిలిపిలి తళుకులు తరగలురా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా ఆనింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలి వలపే వధువై నిలిచే... వరుడే వరమై రాగ ఈ జగమే అతిథైమురిసే... మనుసే మనువై పోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా
No comments
Post a Comment