Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Chaavu Kaburu Challaga (2021)






చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జాక్స్ బిజోయ్
నటీనటులు: కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, బద్రం
దర్శకత్వం: కౌశిక్ పెగళ్ళపాటి
నిర్మాత: బన్నీ వాసు
సమర్పణ: అల్లు అరవింద్
విడుదల తేది: 19.03.2021



Songs List:



మై నేమ్ ఈజు రాజూ పాట సాహిత్యం

 
చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జకెస్ బిజాయ్
సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల
గానం: రేవంత్

పల్లవి:
ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా పుట్టావురో
అట్టా అట్టా అట్టా అట్టా అట్టాగే పోతావురో
ఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఫీలైపోతారేందిరో
సత్తే సత్తే సత్తే సత్తే సత్తే ఏమౌతాదిరో

గాల్లో దీపం గుండెల్లో ప్రాణం
ఎప్పుడు తుసంటుందో ఎవడికీ తెలుసును లేరా
ఒంట్లో జీవం కాదె మన సొంతం
ఉన్నన్నాళ్ళు పండగ చేసి పాడెక్కేయిరా
పోయేవాడిని పోనివ్వక నీ ఏడుపు ఎందుకు రా
నీ ఆస్తి గీస్తి ఏమైనా ఆడట్టుకుపోతాడా
కోటల్లోని రారాజైన కాటికి పోవాలా
నువ్వు నేను ఎవడైనా కట్టెల్లో కాలాల

మై నేమ్ ఈజు రాజూ  బస్తి బాలరాజు
చావు కబురు చల్లగా చెబుతా ప్రతి రోజూ
మై నేమ్ ఈజు రాజూ  బస్తి బాలరాజు
చావు కబురు చల్లగా చెబుతా ప్రతి రోజూ

చరణం: 1
చుట్టం చూపుకు వస్తాం పెట్టిందల్లా తింటాం
పెర్మనెంటుగా ఆ ఇంట్లోనే బైఠాఇంచముగా
సినిమా పోస్టరు చూస్తాం ఓ టిక్కెట్ తీసి వెళతాం
అయిపోయాక కుర్చీ ఖాళీ చెయ్యక తప్పదుగా
ఆరడుగుల బాడీ అంతే అద్దెకు ఉంటున్నామంతే
ఈ బాడీ కంపనీ వదిలేయాలి టైమే అయిపోతే
పుట్టేటప్పుడు ఊపేస్తారు నిన్నే ఉయ్యాల
పోయేటప్పుడు నలుగురువచ్చి చక్కా మోయాలా
ఉన్నన్నాళ్ళు ఆ నలుగురిని సంపాదించాలా
ఊరాంతా నిను ఊరేగించి టాటా సెప్పలా

స్వర్గానికి తొలి మెట్టు నా బండేరా ఒట్టు
ఎవ్వడైనా సచ్చాడంటే నాకే ఫోనూ కొట్టు
స్వర్గానికి తొలి మెట్టు నా బండేరా ఒట్టు
ఎవ్వడైనా సచ్చాడంటే నాకే ఫోనూ కొట్టు

చరణం: 2
సన్ను డాటారు అవుతాం సిస్టర్ బ్రదరు అంటాం
అందరితోనూ బంధాలెన్నో కలుపుకుపోతుంటాం
అప్పుల్లో మునిగుంటాం అంబానీ కల కంటాం
చిల్లర కోసం ఎన్నో ఎన్నో వేషాలే వేస్తాం
ఈ లైఫ్ ఒక నాటకమేలే
మన ఆక్టింగులు అయిపోతే
ఈ ఊరు పేరు మేకప్ తీసి చెక్కేయాలంతే
శివుడాగ్నే లేకుండా చీమైనా కుడుతుందా
అంటూ మహాభాగా ఎదంతం సెబుతావంట
అన్ని ఇచ్చిన ఆ సామె సావుని గిఫ్ట్ ఇవ్వంగ
అయ్యయ్యయ్యో ఒద్దంటా వేందయ్యో సిత్రంగా

జజ్జనకా జజ్జనకా తోడుంటా నీ ఎనకా
పువ్వుల్లోన మోసుకెళ్లి పూడ్చేస్తా పద కొడకా
జజ్జనకా జజ్జనకా తోడుంటా నీ ఎనకా
పువ్వుల్లోన మోసుకెళ్లి పూడేస్తా పద కొడకా

మై నేమ్ ఈజు రాజూ  బస్తి బాలరాజు
ఆ చావు కబురు చల్లగా చెబుతా ప్రతి రోజూ




కదిలే కాలాన్నడిగా పాట సాహిత్యం

 
చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జాక్స్ బిజోయ్
సాహిత్యం: కౌశిక్ పెగళ్ళపాటి, సనరే (సత్యన్నారాయణ రెడ్డి)
గానం: గౌతమ్ భరద్వాజ్, షశ తిరుపతి

పడవై కదిలింది మనసే ఆకాశం వైపే
గొడవే పెడుతూ ఉందే నువ్వు కావాలనే
నువ్వొచ్చావనీ వచ్చావని వచ్చావనీ
నా ప్రాణం చెప్పిందే

నిససస నిస సగరిగరిగ
నిససస నిస సగరిగరిగ
మా పగపమగరిగరిసా గరిరిగరి
నిససస నిస సగరిగరిగ
నిససస నిస సగరిగరిగ
సరిగపనిసరి సా గపగరిసనిప

కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని
నా ప్రాణం ఎక్కడో దాచిందా సందడే
నీ తోడే చేరగా తెలిసిందా నేడే
మహారాజై మురిసానే ఆకాశ దేశాన
నీ మాట విన్నాకా....
మెరుపల్లే మెరిసానే ఆ నీలిమేఘాన
తెలిసేలా నీదాకా....

ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షములో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే

కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని

ఆశలే ఆవిరై ఎగిరిపోతుంటే
చెలిమితో చేరువై వెతికి తెచ్చేసానలా
మనసావాచా మనసిచ్చాగా
నీ తలరాతే మార్చేస్తాన చిరునామాగా
కలలో కూడా కలిసుంటాగా
ఏ దూరాలు రాలేవడ్డంగా

నిజంగానే మరో లోకం సమీపిస్తోందా
మళ్ళీ నీలా నన్నే కాలం పరీక్షిస్తుందా
బ్రతుకైనా చితికైనా నీ లోపలి హృదయాన్ని 
నిన్నంటే నేనుంటా
చనిపోయే క్షణమైనా విడిపోని ప్రణయాన్నై
నీడల్లే తోడుంటా

ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షములో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే
కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని



పైన పటారం పాట సాహిత్యం

 
చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జాక్స్ బిజోయ్
సాహిత్యం: సనరే (సత్యన్నారాయణ రెడ్డి)
గానం: మంగ్లీ, రామ్, సాకేత్

పుట్టువేళ తల్లికి నువ్వు పురిటి నొప్పివైతివి
గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా
గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా
బట్ట మరక పడితే నువ్వు కొత్త బట్టలంటివీ
ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా
ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా

ఇట్టాగున్నవయ్యో పీటారన్నయ్యో
నీది ఏదేమైనా శానా గొప్ప సావయ్యో
పుచ్చు తోసి మంచి వంగ ఏరినట్టు
స్వచ్ఛమంటి స్వామి నిన్నే కోరినాడయ్య

పైన పటారం ఈడ లోన లొటారం
ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం
ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం

పైకి బంగారం లోన గూడు పుటారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం

మనుషులు మాయగాళ్ళు
మచ్చలున్న కేటుగాళ్ళు
కానీ ఎవరికాళ్ళు మనసులున్న గ్రేటుగాళ్ళు
నాది నాది అన్న స్వార్ధమున్న చెడ్డవాళ్ళు
నీలా బ్రతకలేని డబ్బులున్న పేదవాళ్ళు

నాకాడ వందుంటే నా ఏంటే తిరిగేటోళ్ళు
నీకాడ వెయ్యుంటే నాపైనే మొరుగుతారు
సందంట పోతాంటే సూసి కూడా పలకనోళ్ళు
నీకాడ సొమ్ముంటే ఇంట చేరి పొగుడుతారు

లోకమెంతో లోతయ్యా పీటరన్నయ్యా
అది తవ్వి చూడడానికే ఈ జీవితమయ్యా
తొవ్వేకొద్దీ వస్తుంటారు
నిండా ముంచి పోతుంటారు
నీతో నాతో ఉండే సగం దొంగోల్లేనయ్యా

వి ఆర్ వెరీ హ్యాపీ బాసు
నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు
అరె వి ఆర్ వెరీ హ్యాపీ బాసు
నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు

హే పైన పటారం ఈడలోన లొటారం
ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం
పైకి బంగారం లోన గూడు పుటారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం

కారు బంగళాలు వేలికున్న ఉంగరాలు
ఏవీ రావంట సచ్చినాక మనవెంట
నీతో ఉన్నవాళ్ళు నిన్ను మోసి కన్నవాళ్ళు
వెళిపోతారంతా వెలిగినాక చితిమంట

మట్టి మీద నువ్ కలిసిన బంధాలన్నీ అబద్ధం
మట్టిలోన పిచ్చి పురుగుల జట్టే చివరి ప్రపంచం
మనిషి తీరు మారదయ్యా పీటరన్నయ్యా
అందుకనే సెబుతున్న ఇనరాదయ్యా
బాధే లేని బెంగే లేని రేపేంటన్న సింతేలేని
సోటేదైనా ఉన్నాదంటే స్మశానమేరా అందుకే

వీ ఆర్ వెరీ హ్యాపీ బాసు
నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు

హే పైన పటారం ఈడ లోన లొటారం
ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం
పైకి బంగారం లోన గూడు పుటారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం



ఫిక్సై పో, ఫిక్సై పో పాట సాహిత్యం

 
చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జాక్స్ బిజోయ్
సాహిత్యం: కౌశిక్ పెగల్లపాటి
గానం: రాహుల్ సిప్లిగంజ్, ఆదిత్య తాడేపల్లి

హేయ్.. ఓర కంటితో అలా చూస్తావే
బుర్ర వేడెక్కిపోయేలా
హేయ్.. దూరదూరంగా నన్ను తోస్తావే
సర్ర సర్రా మండేలా
పోరా పొమ్మన్నా సిగ్గే లేకుండా
వెంటే వస్తానే జడకొప్పులా
బస్తీగాన్నైనా బానే ఉంటాగా సరిగా సూడే పిల్లా
హే అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మాయో
కుర్రాడికో కొంపుందమ్మాయో
అరె అమ్మో అమ్మో అమ్మమ్మో అమ్మో అమ్మో అమ్మాయో
కుడికాలెట్టెయ్యమ్మో

ఫిక్సై పో, ఫిక్సై పో,  ఫిక్సై పో, ఫిక్సై పో
ఈ జన్మే నాకంటూ  ఫిక్సై పో, ఫిక్సై పో
ఈ రాజుకి రాణె ఫిక్సై పో

హేయ్.. ఓర కంటితో అలా చూస్తావే
బుర్ర వేడెక్కిపోయేలా
హేయ్.. దూరదూరంగా నన్ను తోస్తావే
సర్ర సర్రా మండేలా

సావు మేళాలే డోలూ సన్నాయై వినిపిస్తూ ఉన్నాయే
కాటి కన్నీళ్ళే , పెళ్ళి సందడ్లై మురిపిస్తూ ఉన్నాయే
వలపుల నదిలోనా మునిగిన మదిని కనికరమే సూపించి కాపాడవే
పలకవే ఇకనైనా అలకను వదిలి నరకమే సూపితే నేనేమై పోవాలే
వేడెక్కి పోతాందే నా గుండె నీ గాలికి
హే అమ్మో అమ్మో అమ్మో... అమ్మో అమ్మో అమ్మో అమ్మాయో
పాడెక్కి పోతున్నా లేస్తానే నీ సూపుకి
అరె అమ్మో అమ్మో అమ్మమ్మో అమ్మో అమ్మో అమ్మాయో
సెప్పేదింకేముందే..

ఫిక్సై పో, ఫిక్సై పో,  ఫిక్సై పో, ఫిక్సై పో
గంగమ్మ కోడలిగా ఫిక్సై పో,  ఫిక్సై పో
అరె మందుకి సిందై మిక్సై పో

హేయ్.. ఓర కంటితో అలా చూస్తావే
బుర్ర వేడెక్కిపోయేలా
హేయ్.. దూరదూరంగా నన్ను తోస్తావే
సర్ర సర్రా మండేలా

(ఇంకోసారి నా వెంట పడితే కాళ్ళు ఇరగొడత,
నువ్వు ఇరగొడితే పొయ్ రబ్బరు కాళ్ళట్టుకొచ్చి నేను నీ ఎంట పడ్డా)

హే అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మాయో
కుర్రాడికో కొంపుందమ్మాయో
అరె అమ్మో అమ్మో అమ్మమ్మో అమ్మో అమ్మో అమ్మాయో
కుడికాలెట్టెయ్యమ్మో

ఫిక్సై పో, ఫిక్సై పో,  ఫిక్సై పో, ఫిక్సై పో
ఈ జన్మే నాకంటూ  ఫిక్సై పో, ఫిక్సై పో
ఈ రాజుకి రాణె ఫిక్సై పో




హయ్యయ్యయ్యయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జాక్స్ బిజోయ్
సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల
గానం: ఆదిత్య తాడేపల్లి

హయ్యయ్యయ్యయ్యో ఏమయ్యిందయ్యో
ప్రాణానికే సిలిపి సేతబడయ్యిందో
హయ్యో హయ్యయ్యో ఏంటో ఏంమాయో
నీ సేతిలో బుజ్జి బొమ్మైపోయిందో
సిట్టి మిరాకు పురుగు సీతాకోకైనట్టు
రెక్కల బతుకే మొదలైందే
మట్టిలో పుట్టిన సిగురు మర్రి సెట్టైనట్టు
మనసు ఆ మబ్బుల దాకా ఎగిరెళ్ళిందే
సముద్రంలో సిందే సేపా
ఎగిసి నింగిని చూస్తున్నట్టు
గుండెకేమో లోకమంతా కొత్తగుందే
బీడు నేల వాన జల్లే తాకి పచ్చని పొలమైనట్టు
మొదటిసారి సావు కబురే సల్లగుందే

హయ్యయ్యయ్యయ్యో ఏమయ్యిందయ్యో
ప్రాణానికే సిలిపి సేతబడయ్యిందో
హయ్యో హయ్యయ్యో ఏంటో ఏంమాయో
నీ సేతిలో బుజ్జి బొమ్మైపోయిందో

బురదా సెరువల్లే ఉంటాదే మా బతుకే
సిరు కమలాలు పూసాయే ఆ నీటికే
మిణుగు మిణుగురులా సాగే ఈ నా కథకి
పున్నమిలోని వెన్నెల్లు అద్దావులే
నేలపై రాలిన సినుకు నదుల నురగైనట్టు
పాదమే సెలయేరల్లే తీసే పరుగు
వేసవికి ఎండిన మోడు... పూల కొమ్మెనట్టు
పసితనంతో మొదలయ్యే జన్మే ఇపుడు
ఆటు పోటు అలల్లోన తీరం తెలియని పడవై ఉన్న
అంతలోనే ప్రేమదీవై ఎదురయ్యావే
ఈ పొరకోడి గుండెకాయ కదలికే లేనిది అనుకున్న
ఇప్పుడెంటో ఉప్పెనల్లే పొంగుతోందే

హయ్యయ్యయ్యయ్యో ఏమయ్యిందయ్యో
ఆకాశం అంతందం ఎదురయ్యిందయ్యో
హయ్యో హయ్యయ్యో ఏంటో ఏంమాయో
తలరాత ఓ మలుపు తిరిగేసిందయ్యో
తిరిగేసిందయ్యో ఓ ఓ ఓ
అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో



ఎందరో మోసిన పాట సాహిత్యం

 
చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జాక్స్ బిజోయ్
సాహిత్యం: సనరే (సత్యన్నారాయణ రెడ్డి)
గానం: దీపిక . వి

ఎందరో మోసిన సుందర భావము
సుగుణభి రాముని సొంతమయే
సంబర వీధిన ఆతని హృదయము
చలముతో తకధిమి నాట్యమయే
కన్నుల ముందర దేవత రూపము
చూసెడి భాగ్యము దొరికినదే
తప్పని తెలుపుతు దైవము దిగిన
ఆపితే ఆగని వరుస ఇది

ఎందరో మోసిన సుందర భావము
సుగుణభి రాముని సొంతమయే

అధరాల ఎరుపుకి నీరాజనం
జలజాక్షి మోముకి నీరాజనం
అధరాల ఎరుపుకి నీరాజనం
జలజాక్షి మోముకి నీరాజనం

అలివేణి తురుముకి అపురూప సొగసుకి
అలివేణి తురుముకి అపురూప సొగసుకి
హృదయ తరము నుండి నీరాజనం
ప్రేమ నీరాజనం

ఎందరో మోసిన సుందర భావము
సుగుణభి రాముని సొంతమయే

మకుటము లేని ఏలికసాని
మనసుని కదిపిన మోక్ష ప్రదాయని
వదనము చూడగ మాటే రాని
గారడమున్నద నయనములోని
అడగక నే మది సుమధుర రమణిని
చూపిన క్షణమున వదిలా తనువుని
కలిసా వలుపుని

ఎందరో మోసిన సుందర భావము
సుగుణభి రాముని సొంతమయే
సంబర వీధిన ఆతని హృదయము
చలముతో తకధిమి నాట్యమయే
కన్నుల ముందర దేవత రూపము
చూసెడి భాగ్యము దొరికినదే
తప్పని తెలుపుతు దైవము దిగిన
ఆపితే ఆగని వరుస ఇది



ఓరోరి దేవుడో.. పాట సాహిత్యం

 
చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జాక్స్ బిజోయ్
సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల
గానం: అనిరుద్ సుస్వరం

గుండెలోనా సవ్వడుందే
గొంతులోనా ప్రాణముందే
గువ్వలోనా సవ్వడుందే
గొంతులోనా ప్రాణముందే

ఊపిరి మాత్రం ఉన్నపలంగా పోతున్నట్టుందే
ఉక్కిరి బిక్కిరి చేసే భాదే చుట్టుముట్టిందే

ఓరోరి దేవుడో..! ఎన్నెన్ని సిత్తరాలు
సేత్తావు నీరాతలో
నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో...

ఓరోరి దేవుడో..! ఎన్నెన్ని సిత్తరాలు
సేత్తావు నీరాతలో
నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో

రాయిరప్పల్ని తీసుకొచ్చి
గుళ్ళో దేవత సేత్తావు
రక్తమాంసాలు మాకు పోసి
మట్టిపాలుకమ్మంటావు
అమ్మా ఆలి బంధాలిచ్చి
అంతలోనే తెంచి లోకంలోన
ఏదీ లేదంటు నీ వెంట తీసుకుపోతావూ

ఓరోరి దేవుడో..! ఎన్నెన్ని సిత్తరాలు
సేత్తావు నీరాతలో
నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో

ఓరోరి దేవుడో..! ఎన్నెన్ని సిత్తరాలు
సేత్తావు నీరాతలో
నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో....


No comments

Most Recent

Default