చిత్రం: ఏకమ్ (2021)
సంగీతం: జోస్ ఫ్రాంక్లిన్
సాహిత్యం: శ్రీ అన్నమాచార్యలు
గానం: శక్తి శ్రీ గోపాలన్
నటినటులు: అబేరామ్ వర్మ, తనికెల్ల భరణి, శ్వేత వర్మ, అదితి మ్యాకల్, కల్పిక గణేశ్
దర్శకుడు: బి వరుణ్ వంశీ
నిర్మాతలు: ఎ. కళ్యాణ్ శాస్త్రి, కె. శ్రీరాం, యమ్. పూజా
విడుదల తేది: 2021
ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను
నీ చిత్తంబికను (2)
మరువను ఆహారంబును
మరవను సంసార సుఖము
మరవను ఇంద్రియ భోగము
మాధవ నీ మాయా (2)
మరచెద సుజ్ఞానంబును
మరచెద తత్త్వ రహశ్యము
మరచెద గురువును దైవము
మాధవ నీ మాయా (2)
ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను
నీ చిత్తంబికను
విడువను పాపము పుణ్యము
విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి ఆశలు విష్ణుడే నీమాయ (2)
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
విడిచెదనాచారంబును విష్ణుడే నీ మాయ (2)
ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను
నీ చిత్తంబికను
తగిలెద బహు లంపటముల
తగిలెద బహు బంధంబుల
తగులను మోక్షపుమార్గము తలపుల ఎంతైనా (2)
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై
నగి నగి నను నీవేలితి నాకా ఈ మాయ (2)
ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను
నీ చిత్తంబికను (2)
చిత్రం: ఏకమ్ (2021)
సంగీతం: జోస్ ఫ్రాంక్లిన్
సాహిత్యం: బి వరుణ్ వంశీ
గాయకుడు: కృష్ణ తేజేస్వి
ఆనంద తీరం ఓ రాగమై
వీడింది మౌనం, ఏ నావకై
వెలుగు పూల దారులు
వెదురు వేణు గాలులు
వలస వాలు చినుకులు పరదాలల్లేనా
తీరాన్ని మరిచిన నావే నువ్వా
చిరుగాలికి చెదిరిన అనురాగాల చిలుకవా
పరదాలను తెంచిన రాగం నువ్వా
దివిదారులు కొలిమినా తారే నువ్వా
కోవెలే మరచెనా కొలువైన నిజముని
మిణుగురే వెతికేనా వెలుగేదని
ప్రశ్నకందని బదులుగా
తనువు గూటికి అథితిగా
అంతమెరుగని వింతగా
కాలాన్నే ప్రవహించగా
తీరాన్ని మరిచిన నావే నువ్వా
చిరుగాలికి చెదిరిన అనురాగాల చిలుకవా
పరదాలను తెంచిన రాగం నువ్వా
కాలాగ్నికి రగిలిన సమిదే నువ్వా
చిత్రం: ఏకమ్ (2021)
సంగీతం: జోస్ ఫ్రాంక్లిన్
సాహిత్యం: బి వరుణ్ వంశీ
గాయకుడు: యాజిన్ నిజార్
కన్నుల భాష కవితల్ని రాసిందెవరో
ఎద సడికిన్ని రాగాలు నేర్పిందెవరో
కన్నుల భాష కవితల్ని రాసిందెవరో
ఎద సడికిన్ని రాగాలు నేర్పిందెవరో
అలని వలిచె ఈ సంద్రం ఎవరో
కలనే గెలిచే నీ ఉదయం ఎవరో
కల తగువే వినగా అలా తెగువే కనగా
వరమిచ్చే వెన్నెల మనసిచ్చే వానలా
ఇల మెరిసే తోడులా నిను నడిపే నీడలా
వరమిచ్చే వెన్నెల మనసిచ్చే వానలా
ఒక మెరుపే తోడులా నిను నడిపే నీడలా
కన్నుల భాష కవితల్ని రాసిందెవరో
వరమిచ్చే వెన్నెల
ఎద సడికిన్ని రాగాలు నేర్పిందెవరో
మనసిచ్చే వాన కురిసింది ఎదలో
కన్నుల భాష కవితల్ని రాసిందెవరో
ఒక మెరుపే తోడులా
ఎద సడికిన్ని రాగాలు నేర్పిందెవరే నీడలా
కన్నుల భాష కవితల్ని రాసిందెవరో
వరమిచ్చే వెన్నెల
ఎద సడికిన్ని రాగాలు నేర్పిందెవరో
మనసిచ్చే వాన కురిసింది ఎదలో
కన్నుల భాష కవితల్ని రాసిందెవరో
ఒక మెరుపే తోడులా
ఎద సడికిన్ని రాగాలు నేర్పిందెవరే నీడలా
No comments
Post a Comment