Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ichata Vaahanamulu Niluparaadu (2021)




చిత్రం: ఇచ్చట వాహనములు నిలుపరాదు (2021)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
నటీనటులు: సుశాంత్, మీనాక్షి చౌదరి, వెంకట్
దర్శకత్వం: ఎస్. దర్శన్
నిర్మాతలు: రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల
విడుదల తేది:  27.08.2021



Songs List:



హే మనసెందుకిలా పాట సాహిత్యం

 
చిత్రం: ఇచ్చట వాహనములు నిలుపరాదు (2021)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సాహిత్యం: శ్రీజో
గానం: అర్మాన్ మాలిక్

హే మనసెందుకిలా
నిలచిన చోటిక నిలవదుగా
ఈ కనులకు బహుశా
ఏమైందో తెలుసా

ఆ పెదవులు చేసే
మాయకు మాటలు చాలవిక
నా నడకలు నిన్నే
చేరక మానవుగా

అర క్షణముండదు తిన్నగ ప్రాణం
అలజడి పడి నిను విడదే 
అది విని గుండెలనాపినా దూరం
మెల మెల్లగ కరిగినదే

దగ్గరైన కొద్ది దొరక్క జారకు
నీలి కళ్ళతోటి కొరక్క మానకు
ఆశ తీరకుంటే ఏకాంత మెందుకు
నిజము కదా

ఊపిరాడకంటే ఈ కౌగిలింతకు
ఎంత కోరికంటే ఓ గుండే చాలదు
ప్రేమ పొంగుతూనే పెదాలు దాచకు
జతపడవా

ఎంతగానో నన్ను నేను ఆపుకున్నా
చెంత చేరమంటు సైగ చేస్తావే
ఆట లాడుతూనే ఒకటై కలిసే
మనసులివే

హా చంప గిల్లుతుంటే నీ చూపు చల్లగా
గుండే ఎందుకుంది కేరింత కొత్తగా
ఊరుకోమనంటే ఆగేది కాదుగా మది సరదా

చెప్పలేక నీతో మనస్సు దాచగా
రెక్కలొచ్చి నట్టు వయస్సు గోలగా
ఒక్క మాటతోనే తీసింది సూటిగా ప్రతి పరదా

ఎందుకని ఉండనీవు నన్ను ఊరికే
మాటలాడి మయలోకి తోస్తావే
ఎంత ముద్దుగుంది దగ్గరవుతుంటే మన జగమే





పద్మవ్యూహం పాట సాహిత్యం

 
చిత్రం: ఇచ్చట వాహనములు నిలుపరాదు (2021)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సాహిత్యం: అరుణ్ వేమూరి
గానం: కాలభైరవ

పద్మవ్యూహం లోనికి చొరబడి బయటికి మరలే దారే లేదా
గద్దల తాకిడి తట్టుకు నిలబడి నిర్దోషిత్వం ఋజువే కాదా
పొద్దుట యుద్ధం పొడనే ఎరుగని లోకం తెలియని గూడే విడువని
వాడే వీడే అభిమన్యుడు కాగా...
కాలం పడగెత్తగా క్రౌర్యం కాటేయగా
దౌష్ట్యం దండెత్తగా
విది ఎత్తిన కత్తికి దప్పి తీరునా
రౌద్రం శివమెత్తగా రుద్రం చిందెయ్యగా
రుధిరం చిందించగా
ఇది విజయమో స్వర్గమో తేలిపోవునా

అమ్మా అన్న పిలుపే కవచం
కమ్మేసినా వైరి ప్రపంచం
ఆ తల్లిపై ఎంతటి భారం
నా వల్లనే ఇంతటి ఘోరం
నేరాలేవి చేయని వారినీ
తీరం చేర్చు పూచీ నాదనీ

నడిచే పిడుగై అడుగే పడని ముడులే వీడని
నడిరాతిరి రవివై పొద్దే పొడవగా
బాధే దిగమింగుకో యోద్ధ విల్లందుకో
శస్త్రం సంధించుకో బడబాగ్నులు చిందుతూ గొయిని చీల్చుకో
సాహో చెలరేగిపో వ్యూహం ఛేదించుకో
లక్ష్యం సాధించుకో
సుడిగాలై రేగుతు గమ్యమందుకో




నీ వల్లే నీ వల్లే పాట సాహిత్యం

 
చిత్రం: ఇచ్చట వాహనములు నిలుపరాదు (2021)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సాహిత్యం: శ్రీనివాస మౌళి
గానం: సంజిత్ హెగ్డే

తన పెదవులు నను పిలిచే
పిలుపు వినగానే మనసెగిసే
తన ఊపిరి నను తగిలే
ప్రతి క్షణము ఏదో పరవశమే
నింగి జాబిలి నన్ను కోరగా
ఇన్నాళ్లు ఉన్న దురమే మారిపోయింది
కొత్త ఊపిరి పోందినట్టుగా
ఉందిక మనసే యాయి యాయి యే

చనువుగా పడిన ముడి ఎంతో బాగుందో
అనకువ మరిచి మది నన్నే దాటిందే
మనమిలా పుట్టిందే ప్రేమ కోసం అంటుందే
అంత నీ వల్లే నీ వల్లే నీవు నీవే నీవే నీవే
సమయం మరిచేలా నువ్వు చేసిన మాయిదిలే
కలలా ఒక నిజమే నను చేరిన క్షణమిదిలే

వరమిలా ఎదురుపడి నాపై వాలిందే
కెరటమే ఎగిసిపడి నింగే దాటిందే
ఉన్నట్టుండి నా లోకం మొత్తం నీలా మారిందే
అంత నీ వల్లే నీ వల్లే నీవె నీవే నీవే నీవే
ఎపుడో అపుడెపుడో ఒదిగున్నది నా మనసే
నీతో ఎగిరాక నా పిలుపుని అది వినదే




బస్తీ పోరగాళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: ఇచ్చట వాహనములు నిలుపరాదు (2021)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సాహిత్యం: రోల్ రిడా
గానం: మోహన్ భోగరాజు, రోల్ రిడా

ఎమ్ రో!
గల్లీ లో బండి పెట్టినవ్
ఇక్కడా No parking
ఇచ్చట వాహనములు
నిలపరాదు బే!

గలీజ్ లెక్కలేస్తే గల్లీలోన మోగుతాది
గిల్లి గిచ్చుకున్నాగాని చేస్తాము నంగా
పిచ్చి వేషాలు వేస్తే పుచ్చే నీది పగుల్తాది
పచ్చిగానే చెప్తున్న పెట్టుకోకు పంగా

బద్మాష్ ఎంటర్ గాని బాధలు పడకుండా
బేషుగ్గా ఉంటాము మేము ఎందుకు బాబు బెంగ
రెచ్చిపో కాక దూకిపో కాక
చేస్తాం మకతిక చూసుకో నిజంగా

వాడే నా దోస్తు కదా… వీడే నా దోస్తు కదా
మాకే మేము బాస్ కదా… కదా కదా కదా కదా
నాలోన జోష్ కదా మిలేంగే అడ్డ కాడ
పెట్టిస్తాం ఏడికాడ దడ దడ దడ దడ

ఏ, గల్లీ సూత్తే మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త ఇరకటంగా ఉంటాదిరో
కానీ, దిల్లు మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే కలిసికట్టుగుంటామురో

ఏ, గల్లీ సూత్తే మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త ఇరకటంగా ఉంటాదిరో
కానీ, దిల్లు మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే కలిసికట్టుగుంటామురో

ఇరుకు ఇరుకుగా మాతో పడితే మడతేగా
పూరా మిల్కె జుల్కే ఉట్కే ఝట్కే దునియా బడ్కేగా
ఉంటాం కలిసి మెలిసిగా లడికియ మాపై ఫిదాగా

బస్తీ పోరగాళ్ళు ఉంటార్ చూడు హట్ట కట్టగా
కనివిని ఎరుగని ప్రేమని చూపెను
బయపడి తడబడి చూపులు దాచెను
చుడిబుడి ఆటలు కల్బలి చేసెను
మనకున్న వెలుగుని పలికెదమా

దోస్తుగ ఉంటే దగ్గర తీస్తాం
దార్కార్ చేస్తే బైరీలు వేస్తాం
కష్టాల్ వస్తే కలిసి ఉంటాం
కయ్యంకొస్తే కొట్టి వడేస్తాం

అట్టికిట్టి గోల పెట్టి మడత పెట్టరా
చిట్టిపొట్టి గుట్టకేసి లొల్లిపెట్టరా
చుట్టూరంత చెట్టికతో అట్టాగే ఇట్టాగే
చెవులు పగిలేటట్టు గల్లా ఎత్తి నువ్వు కొట్టరా

ఏ, గల్లి సూత్తే మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త ఇరకటంగా ఉంటాదిరో
కానీ, దిల్లు మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే కలిసికట్టుగుంటామురో

ఏ, గల్లి సూత్తే మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త ఇరకటంగా ఉంటాదిరో
కానీ, దిల్లు మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే కలిసికట్టుగుంటామురో

బస్తీకేలి వచ్చినోళ్ళు ఏసుకోండి హాయ్
మస్తు చేసుకుంట పోతే ఇస్తాది హాయ్
మా పోరి జోలికొస్తే నీకు పగుల్తాది భాయ్
సక్కగుంటే చెప్త నీకు వన్ గ్లాస్ చాయ్

గల్లీ చివర అడ్డా కాడా చేస్తాము హాయ్
గోడ మీద చిల్లుకొట్టి ఐతాము హై
గోలగోల పెట్టుకుంటు ఉంటాము భాయ్
ఇక్కడున్న కాళీ మౌత్ దాల్ భాయ్

మీద బటన్ విప్పరా… స్లీవ్స్ మడత పెట్టరా
ఛాతి కొంచెంలేపి జర గల్లీ పొగరు సూపరా
ఊగరా తూగరా తాగరా వాగరా
రెచ్చి పెద్ద చేసుకుంటు జిలే దోస్త్ రా

ఏ, గల్లి సూత్తే మాది సాన సిన్నాదిరో
ఇల్లు కాస్త ఇరకటంగా ఉంటాదిరో
కానీ, దిల్లు మస్తు సాఫుగుంటాదిరో
కష్టమొత్తే కలిసికట్టుగుంటామురో 



బండి తియ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఇచ్చట వాహనములు నిలుపరాదు (2021)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సాహిత్యం: సురేష్ గంగుల
గానం: రాహుల్ సిప్లిగంజ్

పొద్దున లేసి తానం చేసి గత్తర లేపే అత్తరు పూసి
అమీర్ పేట చౌరస్తాలో అమ్మాయి కోసం వెయిటింగ్
అక్కడ వెట్టు ఇక్కడ వెట్టు పక్కననెట్టు ముందుకు దొబ్బు
అంటూ ట్రాఫిక్ పోలీసోల్లు ఇచ్చే ఫైనల్ వార్నింగ్

తియ్ తియ్ తియ్ తియ్ తియ్ తియ్ బండి
తియ్ బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్
తియ్ బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్
బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్ తియ్
బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్ తియ్

డండండ డనకనకర డండండ డనకనకర డండండ డనకనకర
చిచ్చా చిచ్చా చిచ్చా చిచ్చా
డండండ డనకనకర డండండ డనకనకర డండండ డనకనకర
చిచ్చా చిచ్చా చిచ్చా చిచ్చా

తియ్ బండి తియ్ తియ్
నికాల్ గాడి నికాల్ గాడి నికాల్ గాడి నికాల్ నికాల్
ఆటో వాడు రిక్షా వాడు చలాన్ కట్టేయ్ నికాల్ నికాల్
అరె, బొంబై గానీ బెంగుళూరు గానీ చెన్నై కానీ
కొచ్చిన్ కానీ ఢిల్లీ గాని ఢాకా గానీ నికాల్ నికాల్ నికాల్ నికాల్

సినిమా హీరో క్రికెట్ స్టార్ సెలబ్రిటీ అయితే చాలు
సలాం కొట్టి సైడే ఇచ్చి పార్కింగ్ జేయిస్తారే
ఆటో వాడో రిక్షా వాడో ఆపాడంటే
హలో అంటూ సీటీ కొట్టి సెక్యూరిటీ రోడ్డే ఎక్కిస్తాడే

తియ్ తియ్ తియ్ తియ్ తియ్ తియ్ బండి
తియ్ బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్
తియ్ బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్
బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్ తియ్
బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్ తియ్

డండండ డనకనకర డండండ డనకనకర డండండ డనకనకర
చిచ్చా చిచ్చా చిచ్చా చిచ్చా
డండండ డనకనకర డండండ డనకనకర డండండ డనకనకర
చిచ్చా చిచ్చా చిచ్చా చిచ్చా
తియ్ బండి

No comments

Most Recent

Default