Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Illalu Priyuralu (1984)


 

చిత్రం: ఇల్లాలు ప్రియురాలు (1984)
సంగీతం: చక్రవర్తి
నటీనటులు: శోభన్ బాబు, సుహాసిని, ప్రీతి (నూతన పరిచయం)
దర్శకత్వం: ఎ. కోదండ రామిరెడ్డి
నిర్మాత: జి. బాబు
విడుదల తేది: 02.08.1984







చిత్రం: ఇల్లాలు ప్రియురాలు (1984)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

పల్లవి:
ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా ఏమని ఏమని

ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది

చరణం: 1
నా బాధ ఇంక తీరేనా ఆ గాధ నీకు తెలిసేనా
నీ కంటి లేత కన్నీళ్ళు నా చేతులార తుడిచేనా
మమతే మరచి ఇక నాలోన నే దాగనా
మూగవీ ఆశలు గుడ్డివీ ప్రేమలు
జాలిగా చూడకు
అలా చూడకు చూడకు

ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా ఏమని ఏమని
ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది

చరణం: 2
అనుకోని ఘటన ఆనాడు
అందించె నిన్ను ఈనాడు
మా దీపమై నీవు వస్తే ఈ కోవెలే తలుపుమూసే
బ్రతుకే అలిగే ఈ బంధాల తో భారమై
సాగనీ జాతకం ఆడనీ నాటకం జాలిగా చూడకు
అలా చూడకు చూడకు

ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా ఏమని ఏమని





No comments

Most Recent

Default