Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ippudu Kaka Inkeppudu (2021)



చిత్రం: ఇప్పుడు కాక ఇంకెపుడు (2021)
సంగీతం: సాహిత్య సాగర్
నటీనటులు: హస్వంత్ వంగ, నమ్రతా దారేకర్, కటలిన్ గౌడ
దర్శకత్వం: వై. యుగంధర్
నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి (గోపి)
విడుదల తేది: 2021







చిత్రం: ఇప్పుడు కాక ఇంకెపుడు (2021)
సంగీతం: సాహిత్య సాగర్
సాహిత్యం: సాహిత్య సాగర్
గానం: నాధప్రియ లోకేష్ , హైమత్, శ్రీజ, కళ్యాణి ఇమంది, ఐశ్వర్య బిజనవేములాస్, శ్రీ కావ్య చందన, అపర్ణ, అరుణ్ కౌండిన్య, నరేష్

స్టీల్ ప్లాంట్ దిగువ నుండి మల్కాపురము మలుపు దాటి షీలా నగరు సందు దాటి ఎన్ ఏ డీ చర్చ్ దాటి కంచెరపాలెం బ్రిడ్జి దాటి జ్ఞానాపురము టేషను దాకా

భోగాపురము రోడ్డు నుండి అవంతి కాలేజీ జంక్షన్ దాటి తగరపువలస బ్రిడ్జి దాటి మధురవాడ మలుపు దాటి హనుమతువాక మద్దెలపాలెం తెలుగు తల్లి వంతెన దాటి

దాటి దాటి అలసిపోనావ్ గానీ ఎక్కడికొచ్చాం సెప్పు మాయ్యా

కూ చుకు చుకు, కూ చుకు చుకు
బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూ చుకు చుకు
కూ చుకు చుకు, కూ చుకు చుకు
బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూ చుకు చుకు

సరే సరే ఎక్కిద్దుర్లే కానీ ఎవర్నేక్కించాలి, ఎందుకెక్కించాలి

సింధియా కుర్రాడు వీడు బుద్ధిమంతుడు
నాన్నారి మాటలు అస్సలు జవ దాటడు
ఆహా..! రిషికొండ అమ్మాయి పద్దతిగల పాపాయి
తన తల్లి గీసిన గీతను దాటాలనుకోదు

ఆరిలోవ ముడసల్లోవా వదిలేసి ఎలిపో బావ
హైటెక్ సిటీకి తోవ చూపిస్తాం దా
ఆసిల్ మెట్ట, మారాని పేట చుట్టాలకు చెప్పెయ్ టాటా
ప్యాకేజీ భలేగా ఉంటే నొప్పా సొలుపా

ఉద్యోగం వచ్చింది వారెవా వారెవా
ఈ విషయం ఊరంతా విడ్డూరం చేద్దాం దా
లగేజ్ సర్దేయ్ లజ్జనక
నువ్వు లగెత్తుకెళ్ళిపో లచ్చెనకా

తర్జన భర్జన దేనికి గబుక్కు గబుక్కు గబుక్కు
గబుక్కు గబుక్కు గబుక్కు గబుక్కు గబుక్కునా

ఏం మీ నాన్న పంపుతాడా..?
అంటే... పంపిచరనుకో, కనకే

కనకమాలక్ష్మమ్మకి, సింహాద్రి అప్పన్నకి
సంపత్తు వినాయకుడికి , రాస్ హిల్స్ యేసయ్యకి
అనకాపల్లి నూకాలమ్మకి, హజరత్ బాబా దర్గాకి

ఓర్ మాయ్యా మొక్కులకి లొంగే రకమా మీ బాబు
ఎలగేస్, మారుపేరు మీద టికెట్ తీద్దాం గోదారి ఎక్కిచ్చేద్దాం, కరిసే, పచ్చ జెండా ఊపండి మరి

కూ చుకు చుకు, కూ చుకు చుకు
బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూచుకు చుకు
కూ చుకు చుకు, కూ చుకు చుకు
బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూచుకు చుకు

దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం దాటి
అనపర్తి, రాజమండ్రి, కొవ్వూరు, ఏలూరు, నూజివీడు, విజయవాడ
కంగారైపోకు విజయవాడ జంక్షన్ మరి

గుంటూరు, సత్తెనపల్లి,పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, నల్గొండ, రామన్నపేట... 
నల్గొండ, రామన్నపేట, సికింద్రాబాద్ వచ్చావురా బేటా...

అయ్ బాబోయ్ నేనెళ్ళాల్సింది హైదరాబాద్ కదా
జంట నగరాలు అంటారు చిన్నప్పుడు సదువుకోలేదా

కూ చుకు చుకు, కూ చుకు చుకు
బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూ చుకు చుకు
కూ చుకు చుకు, కూ చుకు చుకు
బండి ఎక్కిద్దాం రండి
కూ చుకు చుకు, కూ చుకు చుకు







చిత్రం: ఇప్పుడు కాక ఇంకెపుడు (2021)
సంగీతం: సాహిత్య సాగర్
సాహిత్యం: సురేశ్ బనిశెట్టి
గానం: విజయ్ యేసుదాస్, శ్రీ కావ్య చందన

తరికిట తత్తోమ్ తగిలిందే తుళ్ళింతా
ధిమికిట దిత్తోమ్ మొదలైందే గిలిగింతా
కసిరిందే వయసంతా...
కసిరిందే వయసంతా విసిరిందే నీ చెంత

పిచ్చిపిచ్చిగా రెచ్చిపోయే కోరిక
నచ్చచెప్పినా మచ్చుకైనా వినదిక
వెచ్చవెచ్చగా అల్లుకున్న కూడిక
ఇచ్చిపుచ్చుకున్న అందమైన వేడుక

తరికిట తత్తోమ్ తగిలిందే తుళ్ళింతా
ధిమికిట దిత్తోమ్ మొదలైందే గిలిగింతా

పెదవే వణికే తనువే తొణికే
సరికొత్తగ చుంబన మంత్రం కోరెను గనుకే
మనసే ఉరికే మనసై వెనకే
సుతిమెత్తని తుంటరి గాయం అడిగెను గనుకే

నడు ఒంపులు వీణలా కవ్విస్తుంటే
తెలవారులు తాపమే మీటేస్తోందే
మెడవంపున పంటితో కాటేస్తుంటే
తల్లడిల్లిన మైకమే నచ్చేస్తుందే
కసికసి కనులే రసికపు మణులే
వయసడిగిన దండయాత్రలో
అసలు సిసలు మొదటి అడుగు ఇవ్వాలే

పిచ్చిపిచ్చిగా రెచ్చిపోయే కోరిక
నచ్చచెప్పినా మచ్చుకైనా వినదిక
వెచ్చవెచ్చగా అల్లుకున్న కూడిక
ఇచ్చిపుచ్చుకున్న అందమైన వేడుక

హద్దులు జరిగే నిద్దర చెరిగే
శృతిమించిన ఆనందంలో సొత్తులు కరిగే
ఆశలు పెరిగే మాటలు తరిగే
పడగెత్తిన పరువాలన్నీ రుచినే మరిగే

అల్లరల్లరి ఊహలే ఉసిగొలిపెనులే
మళ్ళి మళ్ళీ ఈ జాతరే వయసడిగెనులే
అల్లిబిల్లి సరదాలలో మది మునిగెనులే
గిల్లిగిల్లి సరసాలలో కధ ముదిరెనులే

ముడిపడు యెదలే సరిగమ పదలే
బిగి కౌగిలి ఉక్కపోతలో చెమట చుక్కలెన్నో
లెక్కపెట్టాలే

తరికిట తత్తోమ్, ధిమికిట దిత్తోమ్

పిచ్చిపిచ్చిగా రెచ్చిపోయే కోరిక
నచ్చచెప్పినా మచ్చుకైనా వినదిక
వెచ్చవెచ్చగా అల్లుకున్న కూడిక
ఇచ్చిపుచ్చుకున్న అందమైన వేడుక

No comments

Most Recent

Default