చిత్రం: జాతిరత్నాలు (2021)
సంగీతం: రధన్
నటీనటులు: రాహూల్ రామకృష్ణ, నవీన్ పోలిశెట్టి, ప్రియ దర్శి
దర్శకత్వం: అనుదీప్. కె. వి
నిర్మాత: నాగ్ అశ్విన్
విడుదల తేది: 11.03 2021
చిత్రం: జాతిరత్నాలు (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రామ్ మిరియాల
చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే
ఫట్టుమని పేలిందా
నా గుండె ఖల్లాసేయ్
అట్టా నువ్వు గిర్రా గిర్రా
మెలికల్ తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు సెట్టయ్యావని
సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే
వచ్చేసావే లైన్ లోకి వచ్చేసావే
చిమ్మ చీకటికున్న జిందగీ లోన
ఫ్లడ్ లైటేసావే
హతేరి నచ్చేసావే
మస్తుగా నచ్చేసావే
బ్లాక్ & వైట్ లోకల్ గాన్ని
లోకంలోన రంగులు పుసావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టి నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేసు బుక్కులో
లక్ష లైకులు కొట్టావే
యుద్ధమేమీ జరగలే
సుమోలేవి అస్సలెగరలే
చిటికెలో అలా చిన్న నవ్వుతో
పచ్చజెండా చూపించినావే
మేడం ఎలిజిబెత్తు నీ రేంజైనా
తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా
మాసుగాడి మనసుకే ఓటేసావే
బంగ్లా నుండి బస్తీకి ఫ్లైటేసావే
తీసుమారు చిన్నోడిని
డిజె స్టెప్పులు ఆడిస్తివే
నసీబు బాడ్ ఉన్నోన్ని
నవాబు చేసేస్తివే
అతిలోక సుందరివి నువ్వు
ఆస్ట్రాల్ ఓ టపోరి నేను
గూగుల్ మ్యాపై
నీ గుండెకి చేర్పివే
అరెరే ఇచ్చేసావే
దిల్లు నాకు ఇచ్చేసావే
మిర్చి బజ్జి లాంటి లైఫులో
నువ్వు ఆనియన్ ఏసావే
అరెరే గుచ్చేసావే
లవ్వు టాట్టూ గుచ్చ్చేసావే
మస్తు మస్తు బిర్యానీలో
నింబూ చెక్కై హల్చల్ చేసావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టి నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేసు బుక్కులో
లక్ష లైకులు కొట్టావే
చిత్రం: జాతిరత్నాలు (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహూల్ సిప్లిగంజ్
సూ సూడు హీరోలు
ఒట్టి బుడ్డర ఖానులు
వాల్యూలేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు
శాటిలైటుకైనా చిక్కరు వీళ్లీ గల్లీ రాకెట్లు
డైలీ బిళ్ళగేట్స్ కి మొక్కే వీళ్ళై చిల్లుల పాకెట్లు
సుద్దాపూసలు సొంటే మాటలు తిండికి తిమ్మ
రాజులు
పంటే లేవరు లేస్తే ఆగరు పనికి పోతరాజుల
సూ సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు
జాన్ జిగర్
వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తే కోతులు
వీళ్ళుగాని జపం చేస్తే దూకి చస్తాయి కొంగలు
ఊరిమీద పడ్డారంటే ఉరేసుకుంటై వాచీలు
వీళ్ళ కండ్లు పడ్డయంటే మిగిలేదింకా గోచీలు
పాకిస్థానుకైనా పోతరు ఫ్రీ వైఫై చూపిస్తే
బంగ్లాదేశ్ కైనా వస్తరు బాటిల్ నే ఇప్పిస్తే
జింగిలి రంగా బొంగరం సింగిల్ తాడు బొంగరం
వీళ్ళని గెలికినోడ్ని బతుకు చూస్తే భయంకరం
వీళ్ళని బాగుచేద్దాం అన్నోడి డిమక్ కరాబ్
సూ సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు
వీళ్ళు రాసిన సప్లిమెంట్లతో అచ్చెయ్యొచ్చు పుస్తకం
వీళ్ళ కథలు జెప్పుకొని గడిపేయొచ్చు ఓ శకం
గిల్లి మరీ లొల్లి పెట్టే సంటి పిల్లలు అచ్చము
పిల్లి వీళ్ళ జోలికి రాదు ఎయ్యరు గనక బిచ్చము
ఇజ్జత్కి సవాలంటే ఇంటి గడప తొక్కరు
బుద్ధి గడ్డి తిన్నారంటే దొడ్డి దారి ఇడవరు
భోళా హరిలో రంగ ఆ మొఖం
పంగనామాలు వాలకం
మూడే పాత్రలతో రోజు వీధి నాటకం
శంభో లింగ ఈ త్రికం గప్పాలు అరాచకం
బాబో ఎవనికి మూడుతుందో ఎట్టా ఉందో జాతకం
సూ సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు
చిత్రం: జాతిరత్నాలు (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: యోగి శేఖర్
చంచల్ గూడ జైలులో చిలకలయ్యి చిక్కారు
పలకమీదికెక్కిందయ్యో నెంబరు
సుక్కలందుకోని రెక్కలు విప్పి
తుర్రుమంటూ ఎగిరారు
వీళ్ళ గాచారమే గుంజి తంతే బొక్కలో పడ్డారు
ఏ నిమిషానికి ఏమి జరుగునో
పాటకు అర్థమే తెలిసొచ్చేనే
వెన్న తిన్న నోటితో మన్ను బుక్కిస్తిరే
ఏమి గానున్నదో ఏందో రాత
రంగు రంగుల పాల పొంగులా
మస్తు మస్తు కలలు కంటే
సిట్టి గుండెకే చెప్పకుండనే ఆశ పుట్టెనే
నీళ్ళలో సల్లగా బతికేటి చేపనే
ఒడ్డుకే ఏపీరే యమ తోమ బడితిరే
ఇంటినున్న పుల్ల తీసి అటు పెట్టనోనికి
నెత్తి మీద బండ పెట్టి ఉరికిస్తుండ్రే
అరె మారాజు తీరే ఉన్నోన్ని ఏ రందీ లేనోన్ని
బతుకాగం చెసిండ్రే ఓ బొందల తోసిండ్రే
అరె బేటా..! మీరు ఏది పట్టినా
అది సర్వనాశనం, ఇది దైవశాసనం
ఇంట్ల ఉన్నన్ని నాళ్ళు విలువ తెలువలేదురో
కర్మ కాలిపోయినంక కథే మారెరో
ఖైదీ బట్టలు, రౌడీ గ్యాంగులు నాలుగు గోడలే నీ దోస్తులాయెరో
అవ్వ పాయెరో, బువ్వ పాయెరో పోరి తోటి లవ్వే పాయే
ముద్దుగున్న మీ లైఫు అందమే పలిగి పాయెరో
No comments
Post a Comment