చిత్రం: మహారాజు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల
నటీనటులు: శోభన్ బాబు, సుహాసిని, స్వప్న
దర్శకత్వం: విజయ బాపినీడు
నిర్మాత: ఎం. నరసింహారావు
విడుదల తేది: 20.06.1985
కైలాస శిఖరాన కొలువైన స్వామీ
నీ కంట పొంగేనా గంగమ్మ తల్లీ
మనసున్న మంచోల్లే మారాజులూ
మమతంటూ లేనోళ్ళే నిరుపేదలూ
ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం
ఎవరేమీ అనుకుంటే నీకేమి లే
రాజువయ్యా మహారాజువయ్యా
రాజువయ్యా మహారాజువయ్యా
కన్నీటా తడిసినా కాలాలు మారవు
మనసారా నవ్వుకో పసిపాపల్లే
ప్రేమకన్నా నిధులు లేవు
నీ కన్న ఎవరయ్యా మారాజులూ
నిన్నెవరూ ఏమన్నా నీ దాసూలూ
జరిగినవి జరిగేవి కలలే అనుకో
జరిగినవి జరిగేవి కలలే అనుకో
రాజువయ్యా మహారాజువయ్యా
రాజువయ్యా మహారాజువయ్యా
త్యాగాల జీవితం తనవారికంకితం
మిగిలింది నీ నేనునా నువ్వేలే
దేవుడు వంటి భర్త ఉంటే
నాకన్నా ఎవరయ్యా మారాణులు
మనకున్న బంధాలే మాగాణులు
ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు
ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు
రాజువయ్యా మహారాజువయ్యా
రాజువయ్యా మహారాజువయ్యా
కైలాస శిఖరాన కొలువైన స్వామీ
నీ కంట పొంగేనా గంగమ్మ తల్లీ
మనసున్న మంచోల్లే మారాజులూ
మమతంటూ లేనోళ్ళే నిరుపేదలూ
ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం
ఎవరేమీ అనుకుంటే నీకేమిలే
రాజువయ్యా మహారాజువయ్యా
రాజువయ్యా మహారాజువయ్యా
చిత్రం: మహారాజు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్. పి. బాలు
చెలివో చెలిమివో
సతివో రతివో సమ్మతివో
ఓహో రమణీ
సహధర్మచారినీ సహవాసినీ
నీ నయనాంఛల చంఛల వీక్షణలో
నీ నయగారన యాగర జల సంతోృక్షణలో
నీ నిత్యనూత్న ధరహాస శిరశ్చంద్రికలో
నీ కంకణగల గలలలో
నీ పదనూపుర జనం జలలలో
కన్నాను ఎన్నెన్ని రూపాలనో
ఉన్నాను ఎన్నెన్ని నాధాళ్ళనో
నాధాలనో మేడాలనో
ఓహో రమణీ
సహధర్మచారినీ సహవాసినీ
నీ హృదయం శ్రమ తీర్చే ఆశ్రమమై
నీ వదనం ప్రతి ఉదయం నా సూర్యోదయమై
నా ఇహపరాలు కలబోయు కలావాహినివై
చవిచూసిన సుధా మాధురిలో
ఏ కవి కానని ప్రణయ సాధనలో
చూచాను ఎన్నెన్ని స్వర్గాలనో
దోచాను ఎన్నెన్ని భోగాలనో
భోగాలనో భాగ్యాలనో
ఓహో రమణీ
సహధర్మచారినీ సహవాసినీ
No comments
Post a Comment