చిత్రం: మను చరిత్ర (2021) సంగీతం: గోపి సుందర్ నటీనటులు: శివ కందుకూరి , మేఘ ఆకాష్ దర్శకత్వం: భరత్ పెదగాని నిర్మాత: నరల శ్రీనివాస రెడ్డి విడుదల తేది: 2021
Songs List:
ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల పాట సాహిత్యం
చిత్రం: మను చరిత్ర (2021) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: చంద్రబోస్ గానం: ధనుంజయ్ ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల ఏ సోట ఉంటాదిరో ఏ గల్లీలుంటాదిరో ఆ ఇల్లు ఏ సందులుంటాదిరో ఎవ్వరినడగాలిరో అడ్రస్సు ఏ దారి నడవాలిరో ఇల్లెపుడు దొరికేనురో మా వాడి దిల్లెపుడు మురిసేనురో హే, ఓరుగళ్ళు మొత్తం జల్లెడ పట్టేద్దాం హే, ఖాజిపేట మొత్తం కలియ చుట్టేద్దాం హన్మకొండ అణువణువు అన్వేషించేద్దాం అందగత్తె ఆచూకీని ఆరా తీసేద్దాం అరె జెన్నీ నా ప్రాణం చిన్నీ నా లోకం జెన్నీ లక్ష్యంగా జర్నీ చేసేద్దాం ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల ఏ సోట ఉంటాదిరో ఏ గల్లీలుంటాదిరో ఆ ఇల్లు ఏ సందులుంటాదిరో హే, ఓరుగళ్ళు మొత్తం జల్లెడ పట్టేద్దాం హే, ఖాజిపేట మొత్తం కలియ చుట్టేద్దాం మనసే దోచిన పోరిది మండీ బజారేనా, ఓ ఓఓహో ఆఆ ఆహ ఏ ఏఏ ఎహె బతుకే మార్చిన పిల్లది బట్టల బజారేనా ఆఆ ఆ ఓ ఓఓ ఏ ఏఏ ఎహె బ్రహ్మ గారి ముద్దుల గుమ్మది బ్రాహ్మణ వాడేనా, ఆహా తిక్క నాకు పెంచిన చుక్కది నక్కలగుట్టేనా వేయిస్తంభాల గుల్లోన కొలువైన మా దేవుడా అరె గుడిలాంటి ఆ పిల్ల ఇల్లేదో చూపించరా, అహా అహా అహా ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల ఏ సోట ఉంటాదిరో ఏ గల్లీలుంటాదిరో ఆ ఇల్లు ఏ సందులుంటాదిరో హే, ఓరుగళ్ళు మొత్తం జల్లెడ పట్టేద్దాం హే, ఖాజిపేట మొత్తం కలియ చుట్టేద్దాం ప్రేమ దేవి నివసించేది పోచమ్మైదానేనా ఓ ఓఓహో ఆఆ ఆహ ఏ ఏఏ హె రాణి గారు నడియాడేది రాగన్న ధర్వాజేనా ఆఆ ఆహ ఓ ఓఓహో ఏ ఏఏ హె వెలుగులెన్నో చిలికిన చిలకది ములుగు రోడ్డేనా, ఆహా వడ్డీ లాగ పెరిగిన వలపుది వడ్డేపల్లేనా, ఆహ భద్రకాళమ్మ భద్రంగా ఆ చోటు చూపించమ్మా మాకు పుట్టేటి పాపాయికి నీ పేరు పెడతామమ్మా, ఆఆ ఆ ఆ ఆ ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల ఏ సోట ఉంటాదిరో ఏ గల్లీలుంటాదిరో ఆ ఇల్లు ఏ సందులుంటాదిరో హే, ఓరుగళ్ళు మొత్తం జల్లెడ పట్టేద్దాం హే, ఖాజిపేట మొత్తం కలియ చుట్టేద్దాం హన్మకొండ అణువణువు అన్వేషించేద్దాం అందగత్తె ఆచూకీని ఆరా తీసేద్దాం అరె జెన్నీ నా ప్రాణం చిన్నీ నా లోకం జెన్నీ లక్ష్యంగా జర్నీ చేసేద్దాం ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల ఏ సోట ఉంటాదిరో ఏ గల్లీలుంటాదిరో ఆ ఇల్లు ఏ సందులుంటాదిరో, ఆహ ఎవ్వరినడగాలిరో అడ్రస్సు ఏ దారి నడవాలిరో, ఆహా ఇల్లెపుడు దొరికేనురో మా వాడి దిల్లెపుడు మురిసేనురో, ఏ
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
No comments
Post a Comment