చిత్రం: నాంది (2021) సంగీతం: శ్రీచరణ్ పాకల నటీనటులు: అల్లరి నరేష్ , వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియదర్శి , ప్రవీణ్, నవమి దర్శకత్వం: విజయ్ కనకమేడల నిర్మాత: సతీశ్ వేగేశ్న విడుదల తేది: 19.02.2021 గమనిక: డైరెక్టర్ సతీశ్ వేగేశ్న , నిర్మాత సతీశ్ వేగేశ్న వేరువేరు ఇద్దరు ఒకటి కాదు వీళ్లిద్దరి ఫొటో కోసం ఇక్కడ క్లిక్చేయండి
Songs List:
చెలీ... చెలీ... పాట సాహిత్యం
చిత్రం: నాంది (2021) సంగీతం: శ్రీచరణ్ పాకల సాహిత్యం: శ్రీమణి గానం: యన్. సి. కారుణ్య , హరిప్రియ మరన్గంటి చెలీ... చెలీ... చెలీ... చెలీ... ఓ కలలా మొదలై ఓ కథలా కదిలే ఊహించనిదే నా ఊపిరికెదురై సంతోషమిలా వరదై ముంచినదే ఓ కలలా మొదలై ఓ కథలా కదిలే చెలీ... చెలీ... చెలీ... చెలీ... కాబోయేవాడే ప్రేమిస్తే ఆనందం ఆగేనా మనువాడే వాడే మనసిస్తే ఆ బంధం తొణికేనా నీవే పంచు ఈ ప్రేమకి కాలం చాలునా వందే ఏళ్ళు ఈ గుండెకి వేలే కోరనా... నా నువ్వుంటే నా వెంటే చాలంటున్నా ఏ జనమ్మెనా నీ జంటై అడుగే వేసే భాగ్యం నాకే కావాలంటున్న... ఓ కలలా మొదలై ఓ కథలా కదిలే చెలీ... చెలీ... చెలీ... చెలీ...
ఇదే నాంది...పాట సాహిత్యం
చిత్రం: నాంది (2021) సంగీతం: శ్రీచరణ్ పాకల సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: విజయ్ ప్రకాష్ ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా దౌర్జన్యాల జ్వాలా... న్యాయం కోసం ధర్మం కోసం సాగాలమ్మా మీలా.... నిరాశలా నిశీధులే నిరంతరం ఆవరించినా... ప్రభాతమై ప్రకాశమై ప్రశాంతమై సాగుమా... ఇదే నాంది... ఘాతుకాన్ని గోతిలోన పాతడానికీ ఇదే నాంది... నిద్రలేని రుద్రవీణ రౌద్రగీతికీ ఇదే నాంది... గాయపడ్డ న్యాయ సింహ గర్జనానికీ ఇదే నాంది... రాక్షసాన్ని కూల్చడానికి భయపడితే భవిత లేనే లేదు పిడికిలినే వీడరాదు సమరములో సాహసాలే తోడు వెనకడుగే వేయరాదు సవాలుకెదురుపడు సయ్యంటూ తిరగబడు సహించి నిలబడితే మార్పే రాదు దగాలు కుదరవనూ దిగాలు వదలమనూ జగాన్ని మేల్కొలిపే తీర్పే నేడు ఇదే నాంది... కంటి నీరు మంట లాగ మారడానికీ ఇదే నాంది... రక్తమోడ్చి కొత్త బాట వేయడానికీ ఇదే నాంది... గాయపడ్డ న్యాయ సింహ గర్జనానికీ ఇదే నాంది... కోరుకున్న కొత్త చరిత రాయడానికీ
దేవతలంతా ఉలిక్కిపడేలా పాట సాహిత్యం
చిత్రం: నాంది (2021) సంగీతం: శ్రీచరణ్ పాకల సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ గానం: అనురాగ్ కులకర్ణి దేవతలంతా ఉలిక్కిపడేలా దేవుడు కూడా మైమరిచేలా వెన్నెలతోనే దిష్టి తీసేలా ఉన్నవే పిల్లా జాబిలి చెల్లా చూపుల బాణం వేసి కన్నులతో లాగే కొంటె పనే చెయ్యకే బాలా హాయ్ గుండెలలోన కుడికాలు పెట్టేసావే నువ్వెవరే మల్లెలమాల అరె కోవెలలో దీపములే చిన్నబోయెనే నువ్వే కనులతో నవ్విన వేళా గుడి గంటలుగా నా మనసే మోత మోగెనే కథే తారుమారుగా చేసి వెల్లకే దేవతలంతా ఉలిక్కిపడేలా దేవుడు కూడా మైమరిచేలా వెన్నెలతోనే దిష్టి తీసేలా ఉన్నవే పిల్లా జాబిలి చెల్లా సరాసరి అటు ఇటు చూడాలంటూ కళ్ళు నీ కోసమే వెతుకుతు ఉసూరంటుంటే హఠాత్తుగా ఎదురుగ ఇలా వస్తే నువ్వు హడావిడే పడి మది హుషారయ్యిందే రానే రాదు కదా నిద్దర నా వైపు నువ్వే పగటికలై రాతిరొస్తుంటే పోనేపోవు కదా ఊహలు ఆ లోపు నిన్నే నా ఎదలో దాచుకుంటుంటే మళ్ళీ ఏ నిమిషం దూరంగా వెళ్ళిపోనని నువ్వే సంతకమే పెట్టావే పిల్లా ఇలా నా ఎదుటే దగ్గరగా ఉండిపొమ్మని నాపై ఒట్టు పెట్టి బెట్టు చెయ్యనా దేవతలంతా ఉలిక్కిపడేలా దేవుడు కూడా మైమరిచేలా వెన్నెలతోనే దిష్టి తీసేలా ఉన్నవే పిల్లా జాబిలి చెల్లా జాబిలి చెల్లా...
గుండెలోనా మండుతోందా పాట సాహిత్యం
చిత్రం: నాంది (2021) సంగీతం: శ్రీచరణ్ పాకల సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: కరిముల్లా గుండెలోనా మండుతోందా మందు లేని గాయం ముందరంతా ఉన్నదంతా అంతు లేని శూన్యం కరిగెరా కరిగెరా బంధాలన్నీ కలగా కదలదీ హృదయమే బండబారె శిలగా నడిచే... ఎదవు నీవు కదా గృహమే... శిథిలమాయెనుగా మురిసిపోయిన జ్ఞాపకాలే ముసురుకున్నవి నేడిలా చిగురువేసిన రోజులన్నీ చెదలు బూజులే ఆయెగా తిరిగెలే ఇచటనే అమ్మానాన్నలుగా మిగిలెలే ఇపుడిలా పటము బొమ్మలుగా బతుకులే చితుకులై మండాయి ఓ చితిగా వెలుగునే నిలువునా మార్చాయి చీకటిగా ఆఆ...మనసే...పగిలిపోయెనుగా దిగులే... పొగిలి ఏడ్చెనుగా కలలే... రగిలిపోయెనుగా బతుకే...మిగిలే బూడిదగా
No comments
Post a Comment