చిత్రం: రౌడీ ఫెలో (2014) సంగీతం: సన్నీ MR నటీనటులు: నారా రోహిత్, విశాఖ సింగ్ దర్శకత్వం: కృష్ణ చైతన్య నిర్మాత: టి. ప్రకాశ్ రెడ్డి విడుదల తేది: 21.11.2014
Songs List:
రారారా రౌడీ పాట సాహిత్యం
చిత్రం: రౌడీ ఫెలో (2014) సంగీతం: సన్నీ MR సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: ఆర్జిత్ సింగ్, అదితి సింగ్ శర్మ దాన వీర శూర కర్ణ నువ్వు చక్కని చంటోడా మూర్కులే నీ సాటి రారు నువ్వు వేరు నీ రధం నువ్వే రా నాటి మేటి వీరులంతా ఎంత వీరుడా నీముందరే కలహమే కొన్నాళ్లు నిన్ను చూసి పారిపోయే వాట్ టూ సే రారారా రౌడీ రారారా రౌడీ రారారా రౌడీ రారారా (2) హోం ఈగాలిలో ఇలా ఉగానిలా ఎలా సరే రా మరి అనుకున్నదే చేయారా నీదో మతం నువ్వు మారావేంటి రా రారారా రౌడీ రారారా రౌడీ రారారా రౌడీ రారారా (2) ఏ ఆహం అంటూ లేనివాడు వాడే మగాడ్రా ఈ సిద్ధంతని నమ్మినోడు వాడే మనోడ్రా రారారా రౌడీ రారారా రౌడీ రారారా రౌడీ రారారా (2)
ఏదో నువ్వన్నావేదో ఏదో పాట సాహిత్యం
చిత్రం: రౌడీ ఫెలో (2014) సంగీతం: సన్నీ MR సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: అర్మాన్ మాలిక్, హర్షిత గుడి ఏదో నువ్వన్నావేదో ఏదో నే విన్నా ఏదో ఏదో నువ్ అంటుంటే నే వింటున్నా ఏదో ఏదో నువ్వన్నా వేదో ఏదో నే విన్నా ఏదో ఏదో నువ్వంటుంటే నే వింటున్నా మరి ఏదో ఏదో పెదవే అడిగిందో లేదో పలుకై వినిపించిందేదో ఆ మాటే విన్నాక నేనైనా ఆగాలో లేదో అన్ని అడగాలో లేదో చెప్పాలి అవునో కాదో కౌగిలిలో దూరంగా జరిగే అంత విందో లేదో ఏదో నువ్వన్నావేదో ఏదో నే విన్న ఏదో ఏదో నువ్వంటుంటే నే వింటున్నా ఏదో ఏదో నువ్వన్నా వేదో ఏదో నే విన్నా ఏదో ఏదో నువ్వంటుంటే నే వింటున్నా మరి ఏదో ఏదో ముద్దే ఇవ్వాలో లేదో చెక్కిళ్ళకు బరువో కాదో నా వొళ్ళో నువ్వున్నా నే చూస్తున్న నమ్మాలో లేదో ఇక్కడ ఆపాలో లేదో ఆపై ఇక అర్ధం కాదో కలలకు వయసే పెరిగి ఎదురే తిరిగి నువ్వు కావాలందో ఏదో నువ్వన్నావేదో ఏదో నే విన్నా ఏదో ఏదో నువ్ అంటుంటే నే వింటున్నా ఏదో ఏదో నువ్వన్నా వేదో ఏదో నే విన్నా ఏదో ఏదో నువ్వంటుంటే నే వింటున్నా మరి ఏదో ఏదో
ఆ సీతా దేవి నవ్వులా పాట సాహిత్యం
చిత్రం: రౌడీ ఫెలో (2014) సంగీతం: సన్నీ MR సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: అర్జిత్ సింగ్ ఆ సీతా దేవి నవ్వులా ఉన్నావే ఎంటి మాటలా లక్ష్మణుడే లేని రాముడే నీకు ఈడు జోడు వీడే అందాలా బుట్ట బొమ్మలా అచ్చంగా కంటి పాపలా వెన్నెల్లో ఆడ పిల్లలా నిన్ను తలుచుకుంది ఈడే చెల్లియో చెల్లకో ప్రేమనే అందుకో నూటికో కోటికో వరుడు నేను లే నిన్నటీ జన్మ లో పుణ్యమే అందుకో కాళ్ళనే అద్దుకో వధువు గానె మారిపోవే ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం... ఇవాళ నింగి లోని తారా తళుక్కుమంది ఎదురుగా రా వయస్సు తీరికుండదారా హాయి హాయి హాయి సొగస్సు పంచుతున్న ధారా నీ పలుకులోని పంచదార ఆ పైన ఊరుకోదు లేరా హాయి హాయి హాయి ఉయ్యాల ఊగుతుంటే ఒళ్లో ఏకాంతం అంటూ వేరే లేదులేరా కళ్ళార నిన్ను చూసుకుంటే హాయి హాయి హాయి హాయి ఈ క్షణం స్వయంవరం ఇవ్వాళ సంబరం ఈ క్షణం స్వయంవరం ఇవ్వాళ సంబరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం...
ఎంతవారు గాని పాట సాహిత్యం
చిత్రం: రౌడీ ఫెలో (2014) సంగీతం: సన్నీ MR సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: నకాష్ అజీజ్, నటాషా పింటో (ఈ పాటని యన్.టి.రామారావు గారు నటించిన భలే తమ్ముడు (1969) సినిమాలో నుండి రీమిక్స్ చేశారు) ఎంతవారు గాని వేదాంతులైన గాని వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో ఓఓ... ఎంతవారు గాని వేదాంతులైన గాని వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో ఓఓ... చిన్నది మేనిలో మెరుపున్నది చేపలా తళుకన్నది సైప లేకున్నది చిన్నది మేనిలో మెరుపున్నది చేపలా తళుకన్నది సైప లేకున్నది ఏ వన్నెకాని వలపు నమ్మి వలను చిక్కునో కైపులో కైపులో కైపులో ఓఓ.. ఆడకు వయసుతో చెరలాడకు ఆహా ఆడితే వెనుకాడకు ఊహూ కూడి విడిపోకు ఆడకు వయసుతో చెరలాడకు ఆడితే వెనుకాడకు కూడి విడిపోకు మనసు తెలిసి కలిసి మెలిసి వలపు నింపుకో కైపులో కైపులో కైపులో ఓఓ.. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో ఓఓ... కైపులో కైపులో కైపులో ఓఓ...
రెడ్ అండ్ యెల్లో పాట సాహిత్యం
చిత్రం: రౌడీ ఫెలో (2014) సంగీతం: సన్నీ MR సాహిత్యం: వశిష్ట శర్మ గానం: షాల్మాలి ఖోల్గాడే, సామ్రాట్ కౌషల్ రెడ్ అండ్ యెల్లో
No comments
Post a Comment