చిత్రం: శభాష్ రాముడు (1959) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సదాశివబ్రహ్మం గానం: పిఠాపురం నాగేశ్వరరావు, జమునారాణి నటీనటులు: యన్. టి. రామారావు, దేవిక దర్శకత్వం: సి. యస్. రావు నిర్మాతలు: సుందర్ లాల్ నహతా, టి.అశ్వద్నారాయణ విడుదల తేది: 10.09.1959
Songs List:
హల్లో డార్లింగ్ మాట్లాడవా పాట సాహిత్యం
చిత్రం: శభాష్ రాముడు (1959) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సదాశివబ్రహ్మం గానం: పిఠాపురం నాగేశ్వరరావు, జమునారాణి పల్లవి: హల్లో డార్లింగ్ మాట్లాడవా మురిపిస్తావ్ మెరిపిస్తావ్ దరికొస్తే గొడవ మాటామంతీ మనకెందుకోయ్ సరిసరిలే నిర్వాకం తెలిసింది పోవోయ్ చరణం: 1 మన ప్రేమ మరిచేవా కనికరం లేదా కనికరం మమకారం అనకింక నాతో ఏమే చిలుకా ఇంకా అలుకా మురిపిస్తావ్ మెరిపిస్తావ్ దరికొస్తే గొడవ చరణం: 2 దయగంటే మొరవింటే నీ పాదాల పడతా మనలోన మనకేమి తలవంపే చిలుకా దండాల్ పెడతా సెల్యూట్ కొడతా మురిపిస్తావ్ మెరిపిస్తావ్ దరికొస్తే గొడవా చరణం: 3 పదిమంది ఇది వింటే పరువా మరియాదా పదిలేస్తా ఒట్టేస్తా ఇదిగో నీ మీదా ఐతే సరిలే.... రైట్ పదవే... మనసొకటే మాటొకటే మనజీవాలొకటే (2)
జయమ్ము నిశ్చయమ్మురా పాట సాహిత్యం
చిత్రం: శభాష్ రాముడు (1959) సంగీతం: ఘంటసాల సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల & కోరస్ పల్లవి: అహహా.. ఆహహ.. ఆహహా జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా చరణం: 1 ఏనాటికైన స్వార్ధము నశించి తీరును ఏనాటికైన స్వార్ధము నశించి తీరును ఏరోజుకైన సత్యమే జయించి తీరును... జయించి తీరును కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును... సుఖాలు దక్కును జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా చరణం: 2 విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి విశాల దృష్టి తప్పకుండ బోధించాలి... బోధించాలి పెద్దలను గౌరవించి పూజించాలి... పూజించాలి జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా
జయమ్ము నిశ్చయమ్మురా పాట సాహిత్యం
చిత్రం: శభాష్ రాముడు (1959) సంగీతం: ఘంటసాల సాహిత్యం: కొసరాజు గానం: పి.సుశీల, ఘంటసాల, సరోజిని జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును... సుఖాలు దక్కును ఈ లోకమందు సోమరులై ఉండకూడదు... ఉండకూడదు పవిత్రమైన ఆశయాన మరువకూడదు... మరువకూడదు జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా గృహాన్ని స్వర్గసీమగా చేయుము దేవా... బ్రోవుము దేవా కుటుంబమొక్క త్రాటిపైన నిలుపుము దైవా... నడుపుము దేవా బీదసాదలాదరించు బుద్ది నొసగుమా... శక్తి నొసగుమా
జాబిల్లి వెలుంగులో పాట సాహిత్యం
చిత్రం: శభాష్ రాముడు (1959) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సదాశివబ్రహ్మం గానం: కె.రాణి సాకి: జాబిల్లి వెలుంగులో కాళిందిచెంత గోవిందు ఉంటానని రాడాయె వింత నన్నెడబాయని మన్నన చేయమని మిన్నక ఇంతలోనే ఈ పంచనా రాధ క్షమియించు నాయి త సృతి మించునా నందకిశోరుడే యిలా చేయునా వెన్నెల రేయికదా కన్నుల పండువుగా హాస విలాసమేదో చూపించరా మురళి వాయించరా_ముద్దు చెల్లించరా జాగు సేయకురా- తాళజాలరా
రేయి మించేనోయి రాజా పాట సాహిత్యం
చిత్రం: శభాష్ రాముడు (1959) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సదాశివబ్రహ్మం గానం: పి.సుశీల పల్లవి: రేయి మించేనోయి రాజా హాయిగ నిదురించరా ఆ... హాయిగ నిదురించరా రేయి మించేనోయి రాజా హాయిగ నిదురించరా ఆ... హాయిగ నిదురించరా చరణం: 1 వెల్లివిరిసి వెన్నెళ్లు కాచి వెల్లివిరిసి వెన్నెళ్లు కాచి చల్లన్ని చిరుగాలి మెల్లంగ వీచి స్వప్నాలలోన స్వర్గాలు కంటూ స్వర్గాలలో దేవగానాలు వింటూ హాయిగా నీవింక నిదురించవోయి రేయి మించేనోయి రాజా హాయిగ నిదురించరా ఆ... హాయిగ నిదురించరా చరణం: 2 చీకటి వెంట వెలుగే రాదా కష్టసుఖాలు అంతే కాదా చీకటి వెంట వెలుగే రాదా కష్టసుఖాలు అంతే కాదా చింతా వంతా నీకేలనోయి అంతా జయమౌను శాంతించవోయి హాయిగ నీవింక నిదురించరోయి రేయి మించేనోయి రాజా హాయిగ నిదురించరా ఆ... హాయిగ నిదురించరా... హాయిగ నిదురించరా
కలకల విరిసి జగాలే పాట సాహిత్యం
చిత్రం: శభాష్ రాముడు (1959) సంగీతం: ఘంటసాల సాహిత్యం: శ్రీశ్రీ గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: కలకల విరిసి జగాలే పులకించెనే కలకల విరిసి జగాలే పులకించెనే వలపులు కురిసి సుఖాలే చిలికించెనే... వలపులు కురిసి సుఖాలే చిలికించెనే కలకల విరిసి జగాలే పులకించెనే చరణం: 1 ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. అలరుల తోటా ..అందాల బాట హాయిగ పాడే కోయిల పాట.. కోయిల పాట.. తెలియని కోరికలేవో కలిగించెనే... కలకల విరిసి జగాలే పులకించెనే వలపులు కురిసి సుఖాలే చిలికించెనే... కలకల విరిసి జగాలే పులకించెనే... చరణం: 2 ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. చల్లని గాలి ...మెల్లగ వీచే .. హృదయము దూసి ...మనసే దోచే..మనసే దోచే... మనసులు నిండి ప్రణయాలే చెలరేగెనే కలకల విరిసి జగాలే పులకించెనే వలపులు కురిసి సుఖాలే చిలికించెనే... కలకల విరిసి జగాలే పులకించెనే.... చరణం: 3 ఓ..ఓ...ఓ..ఓ...ఓ..ఓ... చెలి చూపులలో అనురాగాలు.. నిజమేనా అని అనుమానాలు...అనుమానాలు.. సందేహలేలా హృదయాలే మన సాక్షులు... కలకల విరిసి జగాలే పులకించెనే వలపులు కురిసి సుఖాలే చిలికించెనే... కలకల విరిసి జగాలే పులకించెనే....
జయమ్ము నిశ్చయమ్మురా పాట సాహిత్యం
చిత్రం: శభాష్ రాముడు (1959) సంగీతం: ఘంటసాల సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా గాఢాంధకారమలముకున్న భీతిచెందకు సందేహపడక వెల్గు చూపి సాగుముందుకు... సాగుముందుకు నిరాశలోన జీవితాన్ని క్రుంగదీయకు… క్రుంగదీయకు జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా పరాభవమ్ము గల్గునంత పారిపోకుమోయ్ జయమ్ము నిమ్మరించుదాక పోరి గెల్వవోయ్... పోరి గెల్వవోయ్ స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్... నిల్వబెట్టవోయ్ జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా జయమ్ము నిశ్చయమ్మురా... జయమ్ము నిశ్చయమ్మురా జయమ్ము నిశ్చయమ్మురా... జయమ్ము నిశ్చయమ్మురా
ఓ చందమామ ఇటు చూడరా పాట సాహిత్యం
చిత్రం: శభాష్ రాముడు (1959) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సదాశివబ్రహ్మం గానం: కె.రాణి ఓ చందమామ ఇటు చూడరా మాటాడరా ఓ చిన్న దానా నిను వలచినదానరా పున్నమరేయి వెన్నెల హాయి కన్నె కలువ కనుసన్న చేసెరా అందరాని ఆకాశమందునా ఎందుకురా దోబూచులాడెదవు చుక్కలమీద మక్కువ నీకు చక్కలిగింతలు మా కెందుకులే చందమామ రానేల నీవిటు చాలు చాలు పోవోయి తొందరగ అటు చూడరా మాటాడజాల నటుచూడరా కారుమబ్బు నిను కబళించుటకై తెరలు తెరలుగా చనుదెంచెనురా పొంచి రాహు పగబూనివటగా తలంచె నెరింగి తొంగిపో
ఓదేవా మొరవినవా పాట సాహిత్యం
చిత్రం: శభాష్ రాముడు (1959) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సదాశివబ్రహ్మం గానం: పి.లీల ఓదేవా మొరవినవా మీద దయగనవా అలలు పొంగే సాగరాన తీరమేలేదా కారుచీకటి జీవితాన దీపమేలేదా నేర మెరుగని దీన జనులకు దారియేలేదా జానకి సతి జంట బాసీ వనమునందు తిరుగులాడిన నాటిగాధ మరచిపోయితివా చలము మానీ చరణ మొసగి పలుక వాదేవా
ఆశలే అలలాగా ఊగెనే సరదాగా పాట సాహిత్యం
చిత్రం: శభాష్ రాముడు (1959) సంగీతం: ఘంటసాల సాహిత్యం: కొసరాజు రాఘవయ్య చౌదరి గానం: ఘంటసాల ఆశలే అలలాగా ఊగెనే సరదాగా ఓడలాగా జీవితమంతా ఆడేముగా యవ్వనంబను గాలిలో యెదురు వలపుల తేరులో ఆలుమగలూ జతగా మురిపెముగా సుఖింతురుగా మాటే మరచీ పోయేరుగా జీవితమూ కడతీరెలే దేశముతో పనిలేదులే సొగసు వయను మరలా రావిటులా ముసలితనమే మేలా లం పోకడ చూడగ యెంలో వితౌనిలా తుపానులోని పడవవలె ఊపివేయును కష్టములే తనువు ధనమూ స్థిరమా ఇది నిజమా సుఖము శాశ్వతమా బ్రహ్మ వాసిన వ్రాతా తెలియా సామాన్యమా
వన్నెలు కురిసే చిన్నదిరా పాట సాహిత్యం
చిత్రం: శభాష్ రాముడు (1959) సంగీతం: ఘంటసాల సాహిత్యం: కొసరాజు రాఘవయ్య చౌదరి గానం: జమునారాణి వన్నెలు కురిసే చిన్నదిరా యిది నిన్నే వలచెను రా యిక చేయీచేయీ కలిపావంటే హాయేను రా నీరొట్టె నేతిలో పడుతుందిరా నిలువునా కధ రక్తి కడుతుందిరా అందుక నే కోరిక ఉంటే వారేవా కోరిక ఉంటే - వారేవా - ఖుషీ దీర్చుకోరా వడిలో ఉన్నా ముద్దులగుమ్మను వదిలి పెట్టుకోబోకురా జరిగిపోయిన రోజు తిరిగి రాదోయీ రేపు సంగతి నీవు మరచిపోవోయీ - అందుక నే కంటికి నచ్చిన నవ్వుల రాణీ ఒంటిగ చిక్కెనురా కళ్లు మూసుకొని కానకపోతే చెప్పకుండ దౌడేయురా
No comments
Post a Comment