చిత్రం: SR కళ్యాణ మంటపం (2021) సంగీతం: చైతన్ భరద్వాజ్ నటీనటులు: కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయి కుమార్ దర్శకత్వం: జి. శ్రీధర్ నిర్మాత: ప్రమోద్ రాజు విడుదల తేది: 2021
Songs List:
చూశాలే కళ్ళారా... పాట సాహిత్యం
చిత్రం: SR కళ్యాణ మంటపం (2021) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: సిద్ శ్రీరామ్ ఈ నేల తడబడే వరాల ఉరవడే ప్రియంగా మొదటిసారి పిలిచే ప్రేయసే అదేదో అలజడే క్షణంలో కనబడే గతాలు వదిలి పారిపోయే చీకటే తీరాన్నే వెతికి కదిలే అలలా కనులే అలిసెనా ఎదురై ఇపుడే దొరికెనా ఎపుడూ వెనకే తిరిగే ఎదకే తెలిసేలా చెలియే పిలిచేనా చూశాలే కళ్ళారా... వెలుతురువానే నా హృదయంలోనే నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే నీ తొలకరి చూపే నా అలజడినాపే నా ప్రతిదిక నీకే ఇక పోను పోను దారే మారేనా నా శత్రు వీ నడుమే చంపదా తరిమే నా చేతులే తడిమే గుండెల్లో భూకంపాలేనా నా రాతే నీవే మార్చేశావే నా జోడి నీవేలే చూశాలే కళ్ళారా... వెలుతురువానే నా హృదయంలోనే నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే నీ జత కుదిరాకే నా కదలిక మారే నా వధువిక నీవే ఆ నక్షత్రాల ధారే నా పైనా హే తాళాలు తీశాయి కాలాలే కౌగిళ్ళలో చేరాలిలే తాళేమో వేచుంది చూడే నీ మెళ్ళో చోటడిగే హే ఇబ్బంది అంటోంది గాలే దూరేందుకే మా మధ్యనే అల్లేసుకున్నాయి ప్రాణాలే ఇష్టంగా ఈనాడే తీరాన్నే వెతికి కదిలే అలలా కనులే అలిసేనా ఎదురై ఇపుడే దొరికేనా ఎపుడూ వెనకే తిరిగే ఎదకే తెలిసేలా చెలియా పిలిచేనా చూశాలే కళ్ళారా... వెలుతురువానే నా హృదయంలోనే నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే నీ జత కుదిరాకే నా కదలిక మారే నా వధువిక నీవే ఆ నక్షత్రాల దారి నా పైనా
హే చుక్కలు చున్నీకే పాట సాహిత్యం
చిత్రం: SR కళ్యాణ మంటపం (2021) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: భాస్కర భట్ల గానం: అనురాగ్ కులకర్ణి హే చుక్కలు చున్నీకే నా గుండెని కట్టావే ఆ నీలాకాశంలో అరె గిరా గిరా తిప్పేసావే మువ్వల పట్టికే నా ప్రాణం చుట్టావే నువెళ్ళే దారంతా అరే ఘల్లు ఘల్లు మోగించావే వెచ్చ వెచ్చని ఊపిరి తోటి ఉక్కిరి బిక్కిరి చేసావే ఉండిపో ఉండిపో ఉండిపో నాతోనే హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా హే కొత్త కొత్త చిత్రాలన్నీ ఇప్పుడే చూస్తున్నాను గుట్టుగా దాచుకో లేను డప్పే కొట్టి చెప్పలేను పట్టలేని ఆనందాన్ని ఒక్కడినే మొయ్యలేను కొద్దిగా సాయం వస్తే పంచుకుందాం నువ్వు నేను కాసేపు నువ్వు కన్నార్పకు నిన్నులో నన్ను చుస్తూనే ఉంటా కాసేపు నువ్వు మాట్లాడకు కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా ఓ ఎడారిలా ఉండే నాలో సింధు నదై పొంగావె ఉండిపో ఉండిపో ఎప్పుడు నాతోనే హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా
సిగ్గెందుుకురా మామ పాట సాహిత్యం
చిత్రం: SR కళ్యాణ మంటపం (2021) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: భాస్కర భట్ల గానం: హరిచరన్ తిట్టిన బాగుంటాదే కొట్టిన బాగుంటాదే గర్ల్ ఫ్రెండ్ ఏంచేసినా గారాబంగా ఉంటాదే ఛి అన్న నచ్చేస్తాదే తూ అన్న నచ్చేస్తాదే పాపతో పంచాయితీ గమ్మత్తుగా ఉంటాదే నిజమేరా మామ గుండెలో హాయ్ హాయ్ జాతర్లే అంతేరా మామ జిందగీలో రంగు గాలిపటాలే విన్నావా మామ తుళ్ళి తుళ్ళి ఆడే ప్రాణాలే దిల్ మే ధక్ ధక్ సుప్పనాతి సూపులకు సిగ్గెందుుకురా మామ వొద్దే వద్దు మడిసి జేబులో పెట్టు వాళ్ళు ఎమన్నా కానీ శబాష్ అని సీటీ కొట్టు హే నచ్చక నచ్చక పిల్లే నచ్చుతాదే పని పాట మానేసి ఎన్నో ఏళ్ళు తిరిగితే దొరికిన ప్రసాదం కళ్ళకు అద్దుకోవాలి కానీ లేని పోనీ వంకే పెట్టి వదిలేసుకుంటామా అయినా ఆ.. బుర్రోనోడు ఆ.. బుద్దున్నోడు ఆ.. దుమ్మెత్తి పోస్తే దులిపేసుకుంటాడు వంద కాదు వెయ్యి చెప్పు ఒప్పుకోదు పూల కొప్పు దండయాత్ర వాళ్ల హక్కు లోగిపోడం ఒకటే దిక్కు సిగ్గెందుుకురా మామ వొద్దే వద్దు మడిసి జేబులో పెట్టు వాళ్ళు ఎమన్నా కానీ శబాష్ అని సీటీ కొట్టు ఆ.. నవ్వితే ముత్యాలే ఏరుకొని పోతామని చిర్రుబుర్రులాడుతూ దాచేస్తారు నవ్వుని ఓకే చెప్పేస్తే అలుసే అవుతామని చచ్చిన చెప్పరు వీళ్ళు చాలా ముదుర్లే అయినా ఆ లెక్కల్నే ఆ స్కెచుల్నే ఆ.. కనిపెట్టాలంటే కాదె మావల్ల ఆడపిల్ల అందం చందం అయ్యబాబోయ్ అయస్కాంతం మనమేమో ఇనపముక్క అతుక్కుపోదాం అది లెక్కా సిగ్గెందుుకురా మామ వొద్దే వద్దు మడిసి జేబులో పెట్టు వాళ్ళు ఎమన్నా కానీ శబాష్ అని సీటీ కొట్టు
మెరిసే మెరిసే పాట సాహిత్యం
చిత్రం: SR కళ్యాణ మంటపం (2021) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: భాస్కర భట్ల గానం: చైతన్ భరద్వాజ్ మెరిసే మెరిసే
గుండెసడిలాగా పాట సాహిత్యం
చిత్రం: SR కళ్యాణ మంటపం (2021) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: భాస్కర భట్ల గానం: హరిచరన్, చైతన్ భరద్వాజ్ గుండెసడిలాగా నీలో నన్నే దాచావా కంటి వెలుగు నాన్నే అనుకున్నావా మహారాజల్లె మళ్లి చూడాలనుకుంటు సామ్రాజ్యన్ని నిర్మిస్తున్నావా నన్నింత ప్రాణంగా కొలిచిన నిన్ను దూరంగా తోస్తు నిందించానా అరెరే ఇప్పుడే ఇప్పుడే తెలిసినదే మనసే పోలమరిందే కనుకే కనుకే కనుపాపే నిన్నే నిన్నే చూడాలందే ఏదిగి ఏదిగి ఎగిరి పోయావని పోరపాటుగా అనుకున్నానే వెనకే వెనకే తిరుగుతున్నావని అలస్యంగా గుర్తించానే నీలంటి కొడుకు ఉన్నంత వరకూ ఏ ఇంటి పరువు చేజారి పోదే నువ్వు చేసే పనులు నువ్వు కన్న కలలు నాకోసమే అంటే కనులకి తడి తగిలేను కదా ఇప్పుడే ఇప్పుడే తెలిసినదే మనసే పోలమరిందే కనుకే కనుకే కనుపాపే నిన్నే నిన్నే చూడాలందే తలను నిమిరె మోదటి స్నేహం నువ్వే నిన్నే ఎలా మారచిపోతా భుజము తడిమే మోదటి ధైర్యం నువ్వే నిన్నే ఎలా విడిచిపోతా నీ గోరు ముద్ద నీ చేతి స్పర్శ నాకన్నీ గుర్తే ఓ పిచ్చి నాన్నా నువ్వే నా లోకం నువ్వే నా సర్వం నువ్విచ్చిన ప్రాణం అడుగడుగున గుడి కడతది ఇప్పుడే ఇప్పుడే తెలిసినాదే మనసే పోలమరిందే కనుకే కనుకే కనుపాపే నిన్నే నిన్నే చూడాలందే
No comments
Post a Comment