చిత్రం: తోలుబొమ్మలాట (2019)
సంగీతం: సురేశ్ బొబ్బిలి
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, విశ్వంత్, హర్షిత చౌదరి
దర్శకత్వం: విశ్వనాథ్ మాగంటి
నిర్మాత: మాగంటి దుర్గా ప్రసాద్
విడుదల తేది: 22.11.2019
చిత్రం: తోలుబొమ్మలాట (2019)
సంగీతం: సురేశ్ బొబ్బిలి
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: విజయ్ ఏసుదాస్
ఓ గొప్పదిరా మనిషి పుట్టుక
తప్పదురా తిరిగి వెళ్ళక
ఈ మద్యలో జీవితమంతా
సాగును ఓ కథగా
ఈ నేల మీద జీవ యాత్రలో
దారంతటా ఎన్ని పాత్రలో
నీ కథయే గత చరిత్రయై
కంచికి చేరునుగా
అయినవాళ్లే వెళ్లిపోతే
అంతులేనీ గుండె కోతే
మార్చలేమూ బ్రహ్మ రాతే
కడసారిగ మోగును భగవధ్గీతే
నీ రుణబంధం తీర్చేందుకూ
కడతేర్చేందుకూ దరి జేర్చేందుకూ
వేడుక లాగా చేసే కాండా
నీవే జీవై బతికిన చోటా
అంతా ఒకటే అవ్వాలిలే
ఘన నివ్వాళులే ఇక ఇవ్వాలిలే
జీవితమింతే నవ్వూ ఏడ్పు
సాగే తోలు బొమ్మలాట
దండాలు పెట్టినా దండల్ని వేసినా
నీ బొమ్మ మా ఎదలో ఉందనిలే
పిండాలు పెట్టినా పొత్తర్లు వేసినా
నీ ఆకలే జ్ఞాపకముందనిలే
జార విడిచే నువ్వుల నీళ్ళూ
నీకు చివరీ వీడుకోళ్ళూ
చెరిగిపోవూ ఆనవాళ్ళూ
నీ తీయని స్మృతులతొ తడిసెను కళ్ళూ
నువ్.. మా గుండెళ్ళో ఉన్నావనీ
బతికున్నావనీ బతికుంటావనీ
కాలాన్ని నమ్మి చేసే కాండా
నీవే జీవై నడిచిన చోటా
అంతా ఒకటే అవ్వాలిలే
ఘన నివ్వాళులే ఇక ఇవ్వాలిలే
జీవితమింతే నవ్వూ ఏడ్పు
సాగే తోలు బొమ్మలాట
దానాలు చేసినా దర్మాలు చేసినా
నీలోని ప్రేమ గుణమును తెలుపుటకే
అన్నాలు పెట్టినా వస్త్రాలు పంచినా
నీ ఆత్మకు శాంతిని కూర్చుటకే
నిన్ను చూసీ నవ్వినోళ్ళూ
నిన్ను తప్పే పట్టినొళ్ళూ
విప్పుతారు నేడు నోళ్ళూ
నీకున్నాయంటూ చారెడు కళ్ళు
ప్రేమే మాకూ పంచాలనీ
నడిపించాలనీ దీవించాలానీ
ఆ పుణ్యలోకం చేర్చే కాండా
నీవే జీవై బతికిన చోటా
అంతా ఒకటే అవ్వాలిలే
ఘన నివ్వాళులే ఇక ఇవ్వాలిలే
జీవితమింతే నవ్వూ ఏడ్పు
సాగే తోలు బొమ్మలాట
No comments
Post a Comment