Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Tuntari (2016)

చిత్రం: తుంటరి (2016)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: నారారోహిత్, లలిత హెగ్డే
దర్శకత్వం: కుమార్ నాగేంద్ర
నిర్మాతలు: అశోక్ బాబ, నాగార్జున్
విడుదల తేది: 11.03.2016







చిత్రం: తుంటరి (2016)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: బాలాజీ
గానం: టిప్పు, గీతా మాధురి

కోనసీమ కూన నీకాడుందే చానా
జారిపడ్డానమ్మో నీ అందంలోన
రాయలసీమల్నైన రయ్ రయ్యందిలోన
నిలువెల్లా ముంచి పారేసావు ప్రేమల్లోన
నీ సోకే శివకాసి అది గుండెల్లో చురకేసి
నా దిల్లూ ఒళ్ళు ఘల్లనిపించావ్ లవ్లో దించేసి
నీతో వెంటే ఉంటా సెంటీమీటరు గ్యాప్ లేకుండా
నీకే ఇస్తానంటా అందాలన్నీ దాచుకోకుండా
ఆజా లేడి తాజా బోణి బాజాలే లేడి
నీతో ఆటే ఆడి ఓడి జోడీ అవుతానమ్మాడి
ಆ ಆ ಆ
If you want me right now come on Raja
ఆజారే ఆజా అడిగింది ఆకే లేజా

ఆ ఆ ఆ ఆజా తూ హీ హై రాణి మై హూ రాజా
Take everything from me ఆజా...

లక్ ఏదో ఉన్నాదంట నీ షేపులో
ఇది చక్కని చుక్కేలేరా ఆ పక్కన జాబిలి కారా
చిక్కావా ముందే చూస్తే ఆ చూపులో
ఆ బుగ్గన సొట్టొకటుంది ఓ ముద్దట కావాలంది
యవ్వారమే సున్ నేను సవ్వారి ఎక్కిస్తాను
నా చిటుకు పటుకు చిన్నెల పాపా సెగలే పుట్టిస్తా

నీలో వాటం పాడే వేడే చూసి గోడే దూకొస్తా
నీతో ఖానా పీనా సోనా అన్నీ అంటూ వెనకొస్తా
ఆజా లేడి.. తాజా జోడీ బాజాలే మోగి
నీతో ఆటే ఆడి ఓడి జోడీ అవుతా అమ్మాడి

పిచ్చేదో నచ్చిందంటా నీ ప్రేమలో
నీ ముచ్చట తీరుస్తాడు
నిను నెత్తిన మోసేస్తాడు
కిక్ ఏదో ఎక్కిస్తుంది ఆ దూకుడు
ఆ పిల్లడిదే ఆ స్పీడు
పదిమందికి ఒక్కడు వీడు

గిల్లేసిపోతున్నాడు అల్లాడిపోదా ఈడు
నా కులుకు తళుకు మచ్చుక చూస్తే
ఇంకా చెడతాడు
నీతో లవ్వు నవ్వు కంచం మంచం 
ఒన్ బై టు చేస్తా
నీకో రాణి మహలే రాజాలాగా రేపే కట్టిస్తా
నువ్వే వేడిని చూసి గాలం వేసి బంధీనే చేస్తా
నీపై భారం వేసి నీ ఈల్లె నా ఇల్లా సొగసిస్తా







చిత్రం: తుంటరి (2016)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: బాలాజీ
గానం: సాయి చరణ్, దీప్తి పార్థసారథి

ఓ మేరే జానా ఓ మేరే జానా
మై హూ తేరా దీవానా మై హూ తేరా దీవానా

అడగలేదని అడగవేంటని
అడుగుతోందిలా నాలో ప్రేమ
ఎదుట చూసినా ఎదురు చూసినా
పెరుగుతోందిలా నీపై ప్రేమ

మొదటి కల మనసుది అనుకున్నా
చూసినది కనులైనా
తెలుసుకొని తెలియని మాటలు
ప్రేమలోనే పేర్చుకుంటున్నా...

ఓ మేరే జానా ఓ మేరే జానా
మై హూ తేరా దీవానా మై హూ తేరా దీవానా

కన్నుళ్ళో కూర్చుంటావు
కలలన్నీ నీవే అంటావు
కళ్ళు కలలు నీకే ఇస్తు ఎటు పొమ్మంటావు
గుండెల్లో దాగుంటావు ఆ చప్పుడు నీవే అంటావు
ఓ నిమిషంలో డబ్బై సార్లు కాల్చుకుతింటావు
ఏ చోటున్నా ఎగిరోస్తా ఏమన్నా పడి చస్తా
నా మనసంటే నిన్నే చూపిస్తా
నీ మాటల్లో వినిపిస్తా చూపుల్లో కనిపిస్తా
ప్రేమకే నీ పేరు పెడతా...

ఓ మేరే జానా ఓ మేరే జానా
మై హూ తేరా దీవానా మై హూ తేరా దీవానా

చిరునవ్వే తెప్పిస్తావు చిరుగాలై ఊపిరి పోస్తావు
దూరంగున్నా మారం చేసి గుర్తొస్తుంటావు
చినుకంతే ప్రేమించావు ఓ సంద్రంలా నను ముంచావు
ఏదో అడిగేలోగా అన్నీ నువ్వే ఇస్తావు
ఇంకో మనసే నాకున్నా ప్రాణాలే ఆరున్నా
నీలా నే ప్రేమించగలనా
నీ తోడుండే సమయాన కాదంటా ఏదైనా
కాలమే ఇక లేదు అననా

ఓ మేరే జానా ఓ మేరే జానా
మై హూ తేరా దీవానా మై హూ తేరా దీవానా







చిత్రం: తుంటరి (2016)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: యాజీన్ నజీర్

ఓ మేరీ డైమండ్ గర్ల్ నువ్వేనా బార్బీ డాల్
సోలోగా నీ సొగసే నా కార్నివాల్
ఓ మేరీ డైమండ్ గర్ల్ మెరిసేటి జిల్ జిగేల్
నీ కోసం వేసే విజిలే నా గజల్

డైమండ్ గర్ల్ డైమండ్ గర్ల్
యు ఆర్ మై డైమండ్ గర్ల్
ఇన్నాళ్ళైనా ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా
డైమండ్ గర్ల్ డైమండ్ గర్ల్
యు ఆర్ మై డైమండ్ గర్ల్
మరుమల్లైనా హరివిల్లైనా నీకన్నానా ఓ..

చీరల్లో ఏ జరీ కట్టావే నువ్ సిరీ
నిను పట్టిందే పట్టు మరి
వెన్నెల్లో గోదారి నీ నడుమో పూదారి
నిను తాకేవాడెవడో హరి
నీ కోసమే నేనిలా నేనే ఇంతలా
నా ప్రాణం పోయేలానే ఉంది ప్రేమలా
ఓవల మెరిసావే అలా
నే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా ఇంతలా...

ఓ మేరీ డైమండ్ గర్ల్ నువ్వేనా బార్బీ డాల్
సోలోగా నీ సొగసే నా కార్నివాల్
ఓ మేరీ డైమండ్ గర్ల్ మెరిసేటి జిల్ జిగేల్
నీ కోసం వేసే విజిలే నా గజల్

మనసంతా నువ్వేనా తనువంతా తందానా
నీకోసం వేచున్నా ప్రియా
నిండా నే మునిగానా అట్టాగని తేలానా
అంతందంగా ఉందే ప్రేమ 
చిరుగాలి జోలలా తాకిందే అలా
నీ మైకంలోనే నేనున్నాను ఇంతలా
రాయిలా రాసిందే అలా
నిన్నైతే నే చూస్తున్నాను రెండు కన్నులా

ఓ మేరీ డైమండ్ గర్ల్ నువ్వేనా బార్బీ డాల్
సోలోగా నీ సొగసే నా కార్నివాల్
ఓ మేరీ డైమండ్ గర్ల్ మెరిసేటి జిల్ జిగేల్
నీ కోసం వేసే విజిలే నా గజల్

డైమండ్ గర్ల్ డైమండ్ గర్ల్
యు ఆర్ మై డైమండ్ గర్ల్
ఇన్నాళ్ళైనా ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా
డైమండ్ గర్ల్ డైమండ్ గర్ల్
యు ఆర్ మై డైమండ్ గర్ల్
మరుమల్లైనా హరివిల్లైనా నీకన్నానా ఓ..







చిత్రం: తుంటరి (2016)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: బురూరి సుబ్బయ్య శర్మ
గానం: MLR కార్తికేయన్, దివ్య కార్తిక్

డింగు డాంగు డార్లింగే ఫేసులోన స్మైలింగే 
గుండెలోన పైరింగే చంపేస్తాందే
సూపరు చిన్నోడా నా కన్నే చెదిరిందిరా
బంపరు బుల్లోడా నీ మీదే మనసైందిరా
చెంతకు రారా చక్కని రాజా
చెక్కిలి పైన చుక్కవి కారా
సిల్కు చీర తెస్తానే రబ్బరు గాజులేస్తానే
అదరగొట్టే గల్పు సెంటే గిప్టుగానే ఇస్తానే

డింగు డాంగు డార్లింగే ఫేసులోన స్మైలింగే 
గుండెలోన పైరింగే చంపేస్తాందే (2)

కాకినాడ కాజాలెన్నో స్వీటుగానే వడ్డించి
కైకలూరి బాజాలన్నీ మోతగానే మోగించి
పల్లకిని తెచ్చి ఊరిలోన తిప్పి
సందడే సందడి చేసి మనువు ఆడతావా

రాయే రాయే రంగుల చిలకా
సందేహాలే పడనే పడక
డోలు బాజా వాయిస్తా పల్లకిలో తిప్పేస్తా
ధూం అని ధాం అని ఏడు అడుగులేయిస్తా

డింగు డాంగు డార్లింగే ఫేసులోన స్మైలింగే 
గుండెలోన పైరింగే చంపేస్తాందే (2)

అందగాడ నాకే నువ్వు తోడూ నీడై ఉంటావా
సందెకాడ చందమామై నాతో నువ్వే వస్తావా
ఆ నుదుటున కాలికి మెట్టె మెడలో
తాళిబొట్టె నాతో నువ్వుంటావా
కంటికి రెప్పై ఉంటానమ్మో
ప్రాణాలన్నీ నువ్వేనమ్మో
నుదుట బొట్టు నేనౌతా తాళిబొట్టు నే కడతా
వాడిపోని సికన పువ్వై జంటగ నీతో ఉంటానే

డింగు డాంగు డార్లింగే ఫేసులోన స్మైలింగే 
గుండెలోన పైరింగే చంపేస్తాందే (2)







చిత్రం: తుంటరి (2016)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: సింహా

రాజుకే రాజని నన్నే అంటారే
మన ఆటకి పాటకి ఫ్యాన్సే ఉంటారే
రాజుకే రాజని నన్నే అంటారే
మన ఆటకి పాటకి ఫ్యాన్సే ఉంటారే

ఆడికి వీడికి దూరంగుంటాలే
ప్రతి వాడలో వీడికి అంతా చుట్టాలే
నారా ఇంటి పేరు కారం వంటి తీరు
నాలా ఉండే జోరు రాదా కట్టె గురు
మనతో జతై కట్టి మనసు నీకే ఉంటే

రాజుకే రాజని నన్నే అంటారే
మన ఆటకి పాటకి ఫ్యాన్సే ఉంటారే
ఆడికి వీడికి దూరంగుంటాలే
ప్రతి వాడలో వీడికి అంతా చుట్టాలే

పలకను తాకలేదే బలపం దులపలేదే
బతుకు బడిదిరా నీకే తిరుగులేదురా
చదువే అబ్బలేదే కొలువే నాకులేదే
కుదువ లేదురా నీకే లైపు గురువురా
యా మసిలే చురుకు సరుకు
ఉడుకు దుడుకు వేషాలో
అసలే మనకు పడదు
ఇరగ దరువు మోసాలో
మస్తీ తోడా తోడా దోస్తీ ఆడా ఈడా
దిల్కీ సుగరు రొయ్య పగిలిపోద్ది గోలీ సోడా

రాజుకే రాజని, మన ఆటకి పాటకి
రాజుకే రాజని నన్నే అంటారే
మన ఆటకి పాటకి ఫ్యాన్సే ఉంటారే

రమ్మును ముట్టలేదే దమ్మును అంటలేదే
రమ్ములున్న విరా నువ్వే దుమ్ము దుమారా
జేబులో నోటులేదే డాబుకి చోటులేదే
దిల్లు ఉన్నదిరా గల్లీ గొల్లుమన్నదిరా
అయ్ అదిరే కులుకులొలుకు
తళుకు బెలుకు అందాలో
చెదిరే ఉలుకు పలుకు
చూస్తే చిలక చెందాలో

ఓ ఏదో ఉంది తేడా పెరిగే జుట్టే తేడా
ప్రాణం వచ్చే జోడిని బెగి పంపర దేవుడా

రాజుకే రాజని, మన ఆటకి పాటకి
రాజుకే రాజని నన్నే అంటారే
మన ఆటకి పాటకి ఫ్యాన్సే ఉంటారే
నారా ఇంటి పేరు కారం వంటి తీరు
నాలా ఉండే జోరు రాదా కట్టె గురు
మనతో జతై కట్టి మనసు నీకే ఉంటే

రాజుకే రాజని నన్నే అంటారే
మన ఆటకి పాటకి ఫ్యాన్సే ఉంటారే
ఆడికి వీడికి దూరంగుంటాలే
ప్రతి వాడలో వీడికి అంతా చుట్టాలే



No comments

Most Recent

Default