చిత్రం: ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య (2020) సంగీతం: బిజిబల్ నటీనటులు: సత్యదేవ్ కంచరాన, హరిచందన, నరేశ్, సుహాస్, రూప, కుశాలిని, రవీంద్ర విజయ్ దర్శకత్వం: వెంకటేశ్ మహా నిర్మాత: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయప్రవీణ పరుచూరి విడుదల తేది: 30.07.2020
Songs List:
నింగి చుట్టే మేఘం పాట సాహిత్యం
చిత్రం: ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య (2020) సంగీతం: బిజిబల్ సాహిత్యం: విశ్వా గానం: విజయ్ ఏసుదాస్ నింగి చుట్టే మేఘం ఎరుగదా ఈ లోఖం గుట్టు మునిలామెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో జోడి కట్టు తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి చూసింది ఓసారి సగటుల కనికట్టు నింగి చుట్టే మేఘం యెరుగదా ఈ లోఖం గుట్టు మునిలా మెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో జోడి కట్టు తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి చూసింది ఓసారి సగటుల కనికట్టు తమదేదో తమదంటూ మితిమీర తగదంటూ తమదైన తృణమైన చాలను వరస ఉచితాన సలహాలు పగలేని కలహాలు యెనలేని కదనాలు చోటిది బహుశా ఆరాటం తెలియని జంజాటం తమదిగ చీకు చింత తెలియదుగా సాగింది ఈ తీరు కథ సగటుల చుట్టూ నింగి చుట్టే మేఘం ఎరుగదా ఈ లోఖం గుట్టు మునిలా మెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో జోడి కట్టు సిసలైన సరదాలు పడిలేచే పయణాలు తరిమేసి తిమిరాలు నడిచేలే మనస విసుగేది ధరిరాని విధిరాత కదిలేని శతకోటి సహనాల నడవడి తెలుసా చిత్రంగా కలివిడి సుతారంగా కనపడే ప్రేమ పంతం తమ సిరిగా సాగింది ఈ తీరు సగటుల కనికట్టు నింగి చుట్టే - చుట్టే మేఘం యెరుగద - యెరుగదా ఈ లోఖం గుట్టు మునిలా మెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో జోడి కట్టు తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి చూసింది ఓసారి సగటుల కనికట్టు
ఆనందం పాట సాహిత్యం
చిత్రం: ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య (2020) సంగీతం: బిజిబల్ సాహిత్యం: రెహ్మాన్ గానం: గౌతం భరద్వాజ్, సౌమ్యా రామకృష్ణన్ ఆనందం ఆరాటం ఆనందం అంటే అర్ధం చూపించేటి ఓ అద్భుతం ఆరాటం అంచుల్లోనే నిత్యం సాగే ఈ సంబరం చిగురై పుడమి కడుపున మొదలయ్యేటి మధనమే మధురమై ఉదయం కోసం ఎదురె చూసే నిమిషాలే నిజమైన వేడుక కాదా ఫలితం మరిచి పరుగు తీసే పయనం ఇక ప్రతిపూటోక కానుక అయిపోదా నీరు ఆవిరిగా ఎగిసిందే తపన పెరిగి అది కడలినొదిలినది కారుమబ్బులుగా మెరిసింది అణువు అనువుగా ఒక మధువుగా మారి తానే... వానై... అడుగు అడుగు కలిపి కదిలిపోయే కదలింటి దారే మలుపేదైనా గెలుపే చూసే అడుగుల్లో అసలైన ఆ ఆనందం నదిలో ఎగిసే అలల ఏదోలోపల క్షణమాగాని సంగీతం కాదా ఇంద్ర ధనస్సులో వర్ణములే పుడమి ఒడిలో పడి చిగురు తొడిగినవి శరదృతువులో సరిగమలే తొడిమె తడిమే తొలి పిలుపుగా మారి దాహం తీరే వీరుల సిరులు విరిసి మురిసిపోయే సరికొత్త మాయే ఉబికే మౌనం ఊరికే ప్రాణం తనకోసం దిగివస్తే ఆ ఆకాశం కరిగే దూరం తెరిచే ద్వారం జగమంతట పులకింతలు పూసే వసంతం ఆనందం ఆరాటం ఆనందం అంటే అర్ధం చూపించేటి ఓ అద్భుతం ఆరాటం అంచుల్లోనే నిత్యం సాగే ఈ సంబరం చిగురై పుడమి కడుపున మొదలయ్యేటి ఆ మధనమే మధురమై ఉదయం కోసం ఎదురె చూసే నిమిషాలే నిజమైన వేడుక కాదా ఫలితం మరిచి పరుగు తీసే పయనం ఇక ప్రతిపూటోక కానుక అయిపోదా
రేపవలు పాట సాహిత్యం
చిత్రం: ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య (2020) సంగీతం: బిజిబల్ సాహిత్యం: రెహ్మాన్ గానం: బిజిబల్, రఘుకుల సంగీత, మొకిరాల శ్రీకాంత్ లలాలలల లలలాలాలా లాలల రేపవలు వెకనుల నిన్నే చూస్తున్న లలలలాలల నా తనివి తీరదుగా ఎన్నాలైన రావాలల నీవే లల మరల కురిసే వరములు తేవ ఆ... లోకాన ప్రేమంతా రూపాన వేరైనా చేరేటి తీరాన నీవా ల ల ల ల కాలనాపి నాతో ఉండి పోవా రేపవలు వెకనుల నిన్నే చూస్తున్న నా తనివి తీరదుగా ఎన్నాలైన సమయం పరుగున కదిలే మలుపులు తిరిగే చక చక ఎన్నో మారేలే అయినా తొలకరి చెలిమె తొనకని ణమే చెరగని నవ్వాయి తాకేలే నీ చూపు నా వైపు చూస్తుంటే చూసాను నీలోని కేరింతే ఇంకా అలాగే ఎలాగో ఈ పసితనం ఎదలో తొలి పరవశమే కలిగిన క్షణమే కరగక కాలంతో పాటే ఎదిగే ప్రతి ఒక దినమే గురుతుల వనమే పెరిగెను దురంతో పాటే ఏమైనా మారేనా నా నిన్న నాలానే నేడున్న రేపైనా ఇంతే ప్రపంచం సమస్తం ఈ మనిషికి నా మనసు నీ కొరకు శిల్పంలా ఉన్న నీ తలపులో మునిగి జీవిస్తున్న నిన్న నేడై కలిసి మురిసే క్షణములలోన ఈ దూర భారాలు ఇన్నాళ్ల మౌనాలు తీరేటి దారేదో చూపి ప్రాణంలోనా పాటై నిండిపోవా
నువ్వేమో రెక్కలు చాచి పాట సాహిత్యం
చిత్రం: ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య (2020) సంగీతం: బిజిబల్ సాహిత్యం: రెహ్మాన్ గానం: కాలభైరవ, సితార కృష్ణ కుమార్ నువ్వేమో రెక్కలు చాచి రివ్వున లేచిన పక్షయ్యి పైకి ఎగిరి పోయావే నెనేమో మట్టిలో వేర్లు చుట్టుకుపోయిన చెట్టె ఇక్కడనే ఉన్నానే కోరుకున్న లోకాలు చూడ ఈ కొనను విడిచి పోతే ఎలా కొమ్మలన్నీ శోకాలు తీస్తూ కుంగాయి లోలోపల ఇక నా లోకమొ నీ లోకమో ఒకటెట్టా అవుతాది కసిగా కసిరే ఈ ఎండలే నీ తలపులుగా ఈ కలతలుగా నిసిగా ముసిరే నా గుండెనే పగటి కళలు ముగిసేలా వెలుగే కరిగిపోయింది లే ఉసిరే నలిగి పోయింది లే ఆశలల్లే ఆకులే రాలి మనసే పెళుసై విరిగిపోయేలే మాటలన్నీ గాలి మూటలై పగిలి పోయాయిలే చేతిలో గీతలు రాతలు మారిపోయే చూడు మాయదారినే ఊగే కొమ్మకు సాగే పిట్టకు ఒంటె ఎలికి పేరేంటనా పూసే పులకి వీచే గాలికి స్నేహం ఎన్నాలట నేనేమో ఎల్లలు ధాటి నచ్చిన దారిన ముందుకు సాగేటి ఓ దాహం... నువ్వేమో మచ్చలు లేని మబ్బులు పట్టని అద్దంలా మెరిసే ఓ స్నేహం... తప్పదంటూ నీతోనే ఉండి నీ మనసు ఒప్పించలేను మరి తప్పలేదు తప్పని సరై ఎంచాను ఈ దారిని నిన్ను నీలాగానే చూడడని దూరంగా వెళ్తున్న
No comments
Post a Comment