చిత్రం: వరుడు కావలెను (2021) సంగీతం: విశాల్ చంద్రేఖర్ నటీనటులు: నాగ శౌర్య , రీతు వర్మ, నదియా దర్శకత్వం: లక్ష్మీ సౌజన్య నిర్మాత: సూర్య దేవర నాగవంశీ విడుదల తేది: 29.10.2021
Songs List:
కోల కళ్ళే ఇలా పాట సాహిత్యం
చిత్రం: వరుడు కావలెను (2021) సంగీతం: విశాల్ చంద్రేఖర్ సాహిత్యం: రాంబాబు గోసాల గానం: సిద్ శ్రీరామ్ చూపులే నా గుండె అంచుల్లో కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే పువ్వులా నా ఊహల గుమ్మంలో తోరణమవుతూ నువ్వే నిలుచున్నావే కొంచమైనా ఇష్టమేనా అడుగుతుందే మౌనంగా నా ఊపిరే దూరమున్నా చేరువవుతూ చెప్పుకుందే నాలోని ఈ తొందరే కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా కొంటె నవ్వే ఇలా చంపుతుంటే ఎలా కొత్త రంగుల్లో ప్రాణమే తడిసేంతలా మళ్ళి మళ్ళి రావే పూల జల్లు తేవే నువ్వెల్లే దారులలో చిరుగాలికి పరిమళమే అది నన్నే కమ్మేస్తూ ఉందే నా కంటి రెప్పలలో కునుకులకిక కలవరమే ఇది నన్నే వేధిస్తూ ఉందే నిశినిలా విసురుతూ శశి నువ్వై మెరవగా మనసులో పదనిసే ముసుగే తీసెనా ఇరువురం ఒకరిగా జతపడే తీరుగా మన కదే మలుపులే కోరేనా కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా కొంటె నవ్వే ఇలా చంపుతుంటే ఎలా కొత్త రంగుల్లో ప్రాణమే తడిసేంతలా మళ్ళి మళ్ళి రావే పూల జల్లు తేవే చూపులే నా గుండె అంచుల్లో కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే నాన నానా నానా... హ్మ హ్ హ్మమ్మా నాన నాననా నాన నానా నా నాన నానా నానా... హ్మహ్ హ్ హ్మ నాన నానా నా నాన నానా నా మళ్ళి మళ్ళి రావే
దిగు దిగు దిగు నాగ పాట సాహిత్యం
చిత్రం: వరుడు కావలెను (2021) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: అనంత శ్రీరాం గానం: శ్రేయా ఘోషాల్ దిగు దిగు దిగు నా… హోయ్ హోయ్ దిగు దిగు దిగు నా… హోయ్ హోయ్ దిగు దిగు దిగు దిగు దిగు దిగు హోయ్ హోయ్ హోయ్ హోయ్ దిగు దిగు దిగు నాగ నగో నా దివ్యా సుందర నాగో నాగ దిగు దిగు దిగు నాగ నగో నా దివ్యా సుందర నాగో నాగ, నాగ నాగ నాగేటి సాలకాడ నాకేట్టి పనిరో నాపగడ్డి సేలకాడ నాకేట్టి పనిరో నాగేటి సాలకాడ నాకేట్టి పనిరో నాపగడ్డి సేలకాడ నాకేట్టి పనిరో సంధాల సంతగాడ నాకేట్టి పనిరో సాకిరేవు తగువు కాడ నాకేట్టి పనిరో ఇరగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి తగలబెట్టి ఎలకపెట్టిన నీ ఎవ్వారం చాలురో కొంపాకొచ్చి పోరోయ్… కోడెనాగ కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా కొంపాకొచ్చి పోరోయ్… కోడెనాగ కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా సెంపా గిల్లి పోరోయ్ సెట్టినాగా సంపుతాంది పైటే పడగలాగ దిగు దిగు దిగు నాగ నగో నా దివ్యా సుందర నాగో నాగ దిగు దిగు దిగు నాగ నగో నా దివ్యా సుందర నాగో నాగ హోయ్ హోయ్ హోయ్ హోయ్ ననన్న నాగె నాగ నాగా… ననన్న నాగె నాగ నాగా ననన్న నాగె నాగ నాగా… ననన్న నాగె నాగ నాగా ఊరి మీది గొడవలన్ని… నెత్తి మీదికెత్తుకుంటవ్ గొడుగు తోటి పొయ్యే దాన్ని… గుడిసె దాకా తెచ్చుకుంటవ్ ఊరి మీది గొడవలన్ని… నెత్తి మీదికెత్తుకుంటవ్ గొడుగు తోటి పొయ్యే దాన్ని… గుడిసె దాకా తెచ్చుకుంటవ్ అలకతోనే ఇల్లు అలికితేనే గాని… ఈ దిక్కు సూడవ్ పైసాక్కి పనికిరాని… కానీక్కి కలిసిరాని కన్నె మోజు తీర్చలేని… సున్నాలు సాలురో కొంపాకొచ్చి పోరోయ్… కోడెనాగ కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా గంప దించి రారోయ్ గడ్డునాగా గంపేడాశ నాలో రంపమేగా దిగు దిగు దిగు నాగ నగో నా దివ్యా సుందర నాగో నాగ దిగు దిగు దిగు నాగ నగో నా దివ్యా సుందర నాగో నాగ నాగో నాగ నాగో నాగ
మనసులోనే నిలిచిపోకే… పాట సాహిత్యం
చిత్రం: వరుడు కావలెను (2021) సంగీతం: విశాల్ చంద్రేఖర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: చిన్మయి శ్రీపాద పల్లవి: మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా చరణం: 1 ఎన్నిన్నాళ్ళిలా ఈ దోబూచుల సంశయం అన్ని వైపులా వెనుతరిమే ఈ సంబరం అదును చూసి అడగదేమి… లేనిపోని బిడియమా ఊహలోనే ఊయలూపి… జారిపోకే సమయమా తడబడే తలపుల తపన… ఇదని తెలపకా మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా చరణం: 2 రా ప్రియా శశివదనా… అని ఏ పిలుపు వినబడెనా తనపై ఇది వలనా… ఏదో భ్రమలో ఉన్నానా చిటికే చెవిబడి తృటిలో మతి చెడి నానా యాతన మెలిపెడుతుండగా గరినిసాసా గరినిసాసా నిస నిస నిన పదనిస గరినిసాసా గరినిసాసా మా మా మమగమాప గరినిసాసా గరినిసాసా నిస నిస నిన పదనిస గరినిసాసా గరినిసాసా మా మా మపనిదపమా నా ప్రతి అణువణువు సుమమై విరిసే తొలి ఋతువు ఇకపై నా ప్రతి చూపు… తనకై వేచే నవ వధువు చెలిమే బలపడి రుణమై ముడిపడే రాగాలాపన మొదలవుతుండగా మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా
వడ్డానం చుట్టేసి పాట సాహిత్యం
చిత్రం: వరుడు కావలెను (2021) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: రఘురాం గానం: గీతా మాధురి, ML గాయత్రి, అతిధి భావరాజు , శృతి రంజని, శ్రీకృష్ణ వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు వయ్యారం చిందేసే అందాల బొమ్మలు వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు క్యా కరే క్యా కరే… క్యా కరే పరికిణీలో పడుచును చూస్తే… పందిరంతా జాతరే అయ్యో రామ..! క్యా కరే క్యా కరే (క్యా కరే) కాలి గజ్జల సవ్వడి వింటే సందె వేళన సందడే… మస్తు మస్తుగా దేత్తడే దేత్తడే దేత్తడే దోర సిగ్గులన్ని బుగ్గ మీద ఇల్లా పిల్లి మొగ్గలేస్తూ పాడుతుంటే అల్లా వేల రంగులొచ్చి వాలినట్టు వాకిలి అంతా పండగలా మెరిసిందిలా వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు వయ్యారం చిందేసే అందాల బొమ్మలు వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు క్యా కరే క్యా కరే… క్యా కరే దేత్తడే దేత్తడే సారీలో ఓ సెల్ఫీ కొడదామా లేటు ఎందుకు రామరి ఇంస్టాగ్రామ్ స్టోరీ కోసం క్రేజీ ఎందుకే సుందరి అరె, ఆనందమానందం… ఇవ్వాళ మా సొంతం గారంగా మాట్లాడుదాం అబ, పేరంటం గోరింటం అంటూ మీ వీరంగం ఎట్టాగ భరించడం చూసుకోరా కాస్త నువ్వు కొత్త ట్రెండు ఇంక పెంచుకోరా ఫుల్లు డీజే సౌండు స్టెప్పు మీద స్టెప్పులెన్నో వేసి చెలరేగాలి నిలబడలేమే వాట్ టూ డు? వాట్ టూ డు? వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు వయ్యారం చిందేసే అందాల బొమ్మలు వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు పరికిణీలో పడుచును చూస్తే పందిరంతా జాతరే అయ్యో రామ..! క్యా కరే క్యా కరే (క్యా కరే) కాలి గజ్జల సవ్వడి వింటే సందె వేళన సందడే మస్తు మస్తుగా దేత్తడే, దేత్తడే దేత్తడే తారంగం తారంగం ఆనందాల ఆరంభం పలికిందిలే మేళం డుండుం డుం పి పి డుండుం తారంగం తారంగం పయనాలే ప్రారంభం సరికొత్త సారంగం పి పి పి ట ట డుండుం
వాట్ టు డూ… పాట సాహిత్యం
చిత్రం: వరుడు కావలెను (2021) సంగీతం: విశాల్ చంద్రేఖర్ సాహిత్యం: లక్ష్మీ ప్రియాంక గానం: అమల చేబోలు వాట్ టు డూ… అరె, ఓ పరమేశా రోలర్ కోస్టర్ రైడాయెనే బాసు చేతిలో బొమ్మల లాగ లైఫ్ మొత్తం మాటాయెనే అయ్యబాబోయ్… ఏం చెప్పను బ్రదరు సీరియల్ ల సోది గురు అందాల రాకాసికి పొగరు టాప్ టు బాటమ్ ఫుల్లు గురు అరేరే కథలో కలలో అసలు సిసలు పిల్లనూ తనులే తెలుసుకో అయ్యయ్యో ఒకటో రెండో కాదు కాదే రోజు గొడవే లైఫ్ లో ఓ గాడు… డోంట్ బీ సో హార్డు లైఫ్ ఈస్ సో బ్యాడు వై ఈజ్ షీ సో బ్యాడు… వాట్ టు డూ ఓ గాడు డోంట్ బీ సో హార్డు లైఫ్ ఈస్ సో బ్యాడు వై ఈజ్ షీ సో బ్యాడు… వాట్ టు డూ అంతుపట్టరు ఈ పిల్లెంటో ఎవరికి ఏ పూట అంతు చిక్కని ప్రశ్నై చంపేస్తుంటే, ఓ తంటా అందాల బొమ్మలేరా అంతకు మించి తిక్కలేరా రాకాసి తానురా ఫైరు బ్రాండ్ రా మొండిది తానురా అరేరే కథలో కలలో అసలు సిసలు పిల్లనూ తనులే తెలుసుకో అయ్యయ్యో ఒకటో రెండో కాదు కాదే రోజు గొడవే లైఫ్ లో
చెంగున చెంగున పాట సాహిత్యం
చిత్రం: వరుడు కావలెను (2021) సంగీతం: విశాల్ చంద్రేఖర్ సాహిత్యం: శ్రీమణి గానం: సింధూరి చెంగున చెంగున నల్లని కనుల రంగుల వాన చిరు చిరు నవ్వుల మువ్వలు చిందులు చిందెను పెదవుల పైన ఎర్రని సిగ్గుల మొగ్గలు మగ్గెను బుగ్గలలోన ముసిరిన తెరలు తొలిగి వెలుగు కురిసె వెన్నెలతోన మళ్ళీ పసిపాపై పోతున్నా, ఆ ఆ నా తుళ్ళి తుళ్లింతలతో తెల్లాన వెల్లే ప్రతి అడుగు నీవైపేనా మళ్ళీ ప్రతి మలుపు నిను చూపేనా ప్రాయమంత చేదేననుకున్నా, ఆ ఆ ప్రాణమొచ్చి పువ్వులు పూస్తున్నా, ఆ ఆ నాకు తగ్గ వరుడేడనుకున్నా, ఆ ఆ అంతకంటే ఘనుడిని చూస్తున్నా, ఆ ఆ నా ఇన్ని నాళ్ళ మౌనమంతా పెదవంచు దాటుతుంటే తరికిట తకధిమి నేడిక నాలోనా ఎలాగ ఇప్పుడు మలుపు తిరుగును ప్రయాణమన్నది చెప్పగలమా ఎలాగ ఎవ్వరు పరిచయాలే ఏ తీరుగ మారునో చెప్పగలమా మేఘం నీది కడలి ఆవిరిదే కాదా కురిసే వానై తిరిగి రాదా, ఆ ఆ నాలో మెరిసే మెరుపు మరి నీదే కాదా మళ్ళీ నిన్నే చేరమంటోందా ప్రశ్నలు ఎన్నో నా మనసు కాగితాలు బదులిలా సులువుగా దొరికెను నీలోనా ఎలాగ ఇప్పుడు మలుపు తిరుగును ప్రయాణమన్నది చెప్పగలమా ఎలాగ ఎవ్వరు పరిచయాలే ఏ తీరుగ మారునో చెప్పగలమా
No comments
Post a Comment