Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Virata Parvam (2022)




చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
నటీనటులు: రాణా దగ్గుబాటి, సాయి పల్లవి, నవీన్ చంద్ర, ప్రియమణి, నివేథా పేతురాజ్, నందితా దాస్
దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాతలు: డి. సురేశ్ బాబు,  సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ చుండి
విడుదల తేది: 2022



Songs List:



కోలు కోలో కోలోయమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: చంద్రబోస్
గానం: దివ్య మాలిక, సురేష్ బొబ్బిలి

కోలు కోలో కోలోయమ్మ
కొమ్మా చివరన పూలు పూసే, కోలో
పువ్వులాంటి సిన్నదేమో
మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మ

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే 
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

హే పిల్లగాడి మాటలన్ని
గాజులల్లే మార్చుకుంట
కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా

కుర్రగాడి చూపులన్ని
కొప్పులోన ముడుచుకుంట
అల్లరంత నల్లపూసలంటా

వాడి గూర్చి ఆలోచనే
వాడిపోని ఆరాధనే
తాళి లాగ మెళ్ళో వాలదా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

పాదమేమో వాడిదంట
పయనమేమో నాది అంట
వాడి పెదవి తోటి నవ్వుతుంటా

అక్షరాలు వాడివంట
అర్థమంత నేను అంట
వాడి గొంతు తోటి పలుకుతుంటా

ప్రాణమంతా వాడేనంటా
ప్రాయమంతా వాడేనంటా
వాడి ప్రేమై నేనే బ్రతకనా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే




వీర తెలంగాణ పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచంద్ర 

వీర తెలంగాణ




నగాదారిలో పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: ద్యావారి నరేందర్ రెడ్డి, సేనాపతి భరద్వాజ్ పాత్రుడు 
గానం: వరం 

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో

కాలం ప్రేమ కథకి
తన చెయ్యందించి
నేడు తానే దగ్గరుండి
నడిపిస్తా ఉంది చూడు
నీ తోడే పొంది జన్మే నాది
ధన్యమాయెరో, ఓ

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో

ఇంతదాకా పుట్టలేదుగా
ప్రేమ కన్నా గొప్ప విప్లవం
పోల్చి చూస్తే అర్దమవ్వదా
సత్యం అన్నది

కోరుకున్న బతుకు బాటలో
నన్ను చూసి నిందలేసినా
బంధనాలు తెంచివేసినా
నిన్నే చేరగా

ఆడవే ఆడిందిలే నీవే వశమై
కలతే తీరిందిలే కలయే నిజమై
హృదయం మురిసిందిలే చెలిమే వరమై
నడకే సాగిందిలే బాటే ఎరుపై

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో




చలో చలో పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: జిలుకర శ్రీనివాస్ 
గానం: సురేష్ బొబ్బిలి

మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం, మారదులే
రౌద్రపు శత్రువు దాడిని
ఎదురించే పోరాటం మనదే

చలో చలో చలో చలో
చలో చలో చలో చల్ పరిగెత్తు
అడుగే పిడుగై రాలేలాగా
గుండెల దమ్ముని చూపించు

చలో చలో చలో చలో
ఏ, చలో చలో చలో
శ్రీకాకుళంలో రాలిన పువ్వులను
గుండెకు అద్ది నినదిద్దాం

సిరిగల భూములు చర విడిపించి
నిరుపేదలకు పంచేద్దాం
చలో చలో చలో
చలో చలో చలో

దొరోడి తలుపుకు తాళంలా
ఘడీల ముంగట కుక్కల్లా
ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు
మన బతుకులు మారేదెన్నాళ్ళు

ఆడబిడ్డ రక్షణకై పోరాటం
దళితుడి ఆత్మగౌరవంకై పోరాటం
పేదోడి ఆకలి ముద్దకై పోరాటం
రైతు నాగలి సాలుకై పోరాటం
హ, ఎన్నాళ్ళు… ఇంకెన్నాళ్లు

చలో చలో చలో చలో
ఏ, చలో చలో చలో
చలో చలో చలో చలో
చలో చలో చలో

కనబడలేదా తుక్కిట జాబిలి
వినబడలేదా వేదనాగ్ని రవళి

అమరుల రక్తం
పాతులు గట్టే పాటలు గట్టే
ఎర్రని మల్లెలు నింగిన వెలిగే
వసంత మేఘం మరింత గర్జనై
ఆఖరి సమరం అన్నార్తుల విజయం

ఇదిగో ఇదిగో అరుణ పతాకం
అజేయ గీతం టెన్ టు ఫైవ్
అదిగో అదిగో అదిగో
అదిగో ఎర్రని కిరణం

అదిగో ఉద్యమ నెల బాలుడు
అదిగో ఉద్యమ నెల బాలుడు
అదిగో ఉద్యమ నెల బాలుడు

No comments

Most Recent

Default