చిత్రం: వెల్కమ్ ఒబామా (2013)
సంగీతం: సింగీతం శ్రీనివాస్ రావు
నటీనటులు: ఊర్మిళ కనిత్కర్, రేచల్, ఎస్తబాన్
దర్శకత్వం: సింగీతం శ్రీనివాస్ రావు
నిర్మాత: భారతీ కృష్ణ
విడుదల తేది: 20.09.2013
చిత్రం: వెల్కమ్ ఒబామా (2013)
సంగీతం: సింగీతం శ్రీనివాస్ రావు
సాహిత్యం: సింగీతం శ్రీనివాస్ రావు
గానం: కార్తీక్
ఓ గాడ్ ఓ గాడ్ భలే ఆట ఆడినావు రా
ఓ గాడ్ ఓ గాడ్ బడా మజా చేసినావురా (2)
ఊరిలోని ఉప్పు కాయ అడవిలోని చెట్టు కాయ
చేరదీసి ఊరగాయ చేసినావురా ఓ గాడ్
ఓబామ ఒబామ (4)
ఓ గాడ్ ఓ గాడ్ భలే ఆట ఆడినావురా
ఓ గాడ్ ఓ గాడ్ బడా మజా చేసినావురా
గాలిలోన దీపం పెట్టి గాడ్ అంటే కేసు డౌటురా
నన్ను నేను నమ్మకుంటే
గ్యారంటీగా నేను అవుటురా
బ్రతుకంతా మాయదారి బంతులాటరా
మాట మార్చి బాట మార్చె గంతులాటరా
ఎవరి మీద ఎవరు గోల్ వెయ్యాలో
నీకు నీవె మ్యాచ్ ఫిక్స్ చేసినావురా ఓ గాడ్
ఓబామ ఒబామ (4)
ఓ గాడ్ ఓ గాడ్ భలే ఆట ఆడినావు రా
ఓ గాడ్ ఓ గాడ్ బడా మజా చేసినావురా
నెక్టు ఏమిటో అంతు చిక్కని
సినిమా లాంటి బ్రతుకు మాదిరా
అన్నీ తెలిసినా బయట పెట్టని
డైరెక్టరు తంతు నీదిరా
సూపర్ మార్కెట్ లోకంలో బేరాల్లేవురా
నువ్వెంత చెపితే అంతే ఇక తిరుగు లేదురా
అద్దంలో పువ్వు చూపి ముల్లు తీసి వెనక గుచ్చి
నవ్వు రాని జోకు నీదిరా ఓ గాడ్
ఓబామ ఒబామ (4)
ఓ గాడ్ ఓ గాడ్ భలే ఆట ఆడినావు రా
ఓ గాడ్ ఓ గాడ్ బడా మజా చేసినావురా
ఓబామ ఒబామ (4)
చిత్రం: వెల్కమ్ ఒబామా (2013)
సంగీతం: సింగీతం శ్రీనివాస్ రావు
సాహిత్యం: సింగీతం శ్రీనివాస్ రావు
గానం: చిన్మయి
ఆకాశాన్నంటే ఇళ్లున్న ఊరు
ఆటలో పాటలో నిండిన ఊరు
ఆకాశాన్నంటే ఇళ్లున్న ఊరు
ఆటలో పాటలో నిండిన ఊరు
భలేగా ఉంటుంది నాన్న
నీకు భలేగా ఉంటుంది నాన్న
భలేగా ఉంటుంది నాన్న
నీకు భలేగా ఉంటుంది నాన్న
ఆకాశన్నంటే ఇళ్లున్న ఊరు
హో... ఆటలో పాటల్తో నిండిన ఊరు
భలేగా ఉంటుంది నాన్న
నీకు భలేగా ఉంటుంది నాన్న
భలేగా ఉంటుంది నాన్న
నీకు భలేగా ఉంటుంది నాన్న
అంతులేని దీపాలు వింత వింత షాపులు
ఎటువైపు చూసినా రంగు రంగు బొమ్మలు
స్విచ్చి వేస్తే నీతో ఆడి ముద్దిచ్చి నవ్విస్తాయి
ఎప్పుడైనా ఎక్కడున్నా
నాకొక జాబైనా రాస్తావా...
అద్దాల మేడలో రాజులా నీవు
దర్జాగా కూర్చుంటే అందరు వచ్చి
సెల్యుట్ కొడ్తారు నాన్న
నీకు సలాం చేస్తారు నాన్న
ఆకాశన్నంటే ఇళ్లున్న ఊరు
ఆటలో పాటల్తో నిండిన ఊరు
భలేగా ఉంటుంది నాన్న
భలేగా ఉంటుంది నాన్న
నీకు భలేగా ఉంటుంది నాన్న
చాకులేట్ల కొండలు ఐసుక్రీము గుట్టలు
పళ్ల జ్యూసు వాగులు బిస్కట్ల మేడలు
నీ కోసమే వున్నాయట నీ కింక హ్యాపీలే
ఏనాడూ... ఏ క్షణమూ
ఈ అమ్మను తలపకురా
విమానంలో నువ్వు వెళ్తూ వుంటె
కిందుండి మేములా చూస్తూ వుంటే
టాటా చెప్తావు నాన్న
మాకు బైబై చెప్తావు నాన్న
ఆకాశాన్నంటే ఇళ్లున్న ఊరు
ఆటలో పాటల్తో నిండిన ఊరు
భలేగా ఉంటుంది నాన్న
నీకు భలేగా ఉంటుంది నాన్న
భలేగా ఉంటుంది నాన్న
నీకు భలేగా ఉంటుంది నాన్న (2)
చిత్రం: వెల్కమ్ ఒబామా (2013)
సంగీతం: సింగీతం శ్రీనివాస్ రావు
సాహిత్యం: సింగీతం శ్రీనివాస్ రావు
గానం: నిఖిల సింగీతం, రెచల్, సింగీతం శ్రీనివాస్ రావు
పుట్టింది పాల కడలిలో
మెట్టింది పసిడి పల్లెలో
పుట్టింది పాల కడలిలో
మెట్టింది పసిడి పల్లెలో
చిన్నారి చంద్రయ్య
వెన్నెల్లో పల్లకిలో
వస్తాడు కొన్నాళ్లలో
పుట్టింది పాల కడలిలో
మెట్టింది పసిడి పల్లెలో
చిన్నారి చంద్రయ్య
వెన్నెల్లో పల్లకిలో
వస్తాడు కొన్నాళ్లలో
వాడూ... గోదారి గట్టు మీద ఆటలాడే వాడు
వాడూ... బంగారు కార్లల్లో తిరిగేటి వాడు
వాడూ... మొక్కజొన్న తోటలో...పాట పాడేవాడు
వాడూ... వెండి మబ్బుపైనే ఎగిరేటి వాడూ
వాడూ... పాలు తేనియకన్న తీయనైన వాడూ
వాడూ... కోకులోని ఐసుకన్న చల్లనైన వాడు
నన్నే నవ్విస్తూ నన్నే కవ్విస్తూ
నన్నే మరిపిస్తూ నన్నే మురిపిస్తూ
వస్తాడు కొన్నాళ్లలో...
పుట్టింది పాల కడలిలో
మెట్టింది పసిడి పల్లెలో
చిన్నారి చంద్రయ్య
వెన్నెల్లో పల్లకిలో
వస్తాడు కొన్నాళ్లలో...
వాడూ... సిరులతో మా ఇంట అడుగిడే వాడు
వాడూ... మా ఇంటి సిరులకు కింగ్ అయినవాడు
వాడూ... రతనాల దానిమ్మ పండంటి వాడు
వాడూ... ముత్యాల పల్లకిలో ఊరేగె వాడు
వాడూ... దూరాన ఉన్నా మా ఎదనుండే వాడు
వాడూ... మాముందే గ్రో అవుతూ వెలుగొందేవాడు
అందర్ని లాలిస్తూ ఊరినే పాలిస్తూ
మమతని పంచిస్తు మనసుని వెలిగిస్తూ
వస్తాడు కొన్నాళ్లలో...
పుట్టింది పాల కడలిలో
మెట్టింది పసిడి పల్లెలో
చిన్నారి చంద్రయ్య
వెన్నెల్లో పల్లకిలో
వస్తాడు కొన్నాళ్లలో... (2)
చిత్రం: వెల్కమ్ ఒబామా (2013)
సంగీతం: సింగీతం శ్రీనివాస్ రావు
సాహిత్యం: సింగీతం శ్రీనివాస్ రావు
గానం: చిన్మయి
బుజి బుజి అడుగులతో కిలకిల నవ్వులతో
బుజిబుజి అడుగులతో కిల కిల నవ్వులతో
రావయ్యా రావయ్యా క్రిష్ణా క్రిష్ణా
బుజి బుజి అడుగులతో కిలకిల నవ్వులతో
బుజి బుజి అడుగులతో కిల కిల నవ్వులతో
రావయ్యా రావయ్యా క్రిష్ణా క్రిష్ణా
రావయ్యా రావయ్యా క్రిష్ణా క్రిష్ణా
బుజి బుజి అడుగులతో కిలకిల నవ్వులతో
బుజి బుజి అడుగులతో కిల కిల నవ్వులతో
రావయ్యా రావయ్యా క్రిష్ణా క్రిష్ణా
రావయ్యా రావయ్యా క్రిష్ణా క్రిష్ణా
వెదురులన్ని వేణువులాయె
వేణువులై రాగాలల్లె
రాగాలకు వూరే వూగె లే
ఎండల్లో వెన్నెల కాచె
ఎడారిలో పైరులు లేచె
పైరుగాలి పాటై వీచెలే
చందనాల కొండనీవు
చెంగలువ దండనీవు
ముద్దు ముద్దు ముత్యాల రాశి నీవూ
పసుపు పంచ పొందుగ కట్టి
నెమలి రెక్క నీటుగ తొడిగి
నీవొస్తే జగమే పొంగెరా
ఆ...ఆ...అ..అ...అ..అ
మల్లెల సొగసులతో మంగళ గానముతో
మల్లెల సొగసులతో మంగళగానముతో
రావయ్యా రావయ్యా క్రిష్ణా క్రిష్ణా
బుజి బుజి అడుగులతో కిలకిల నవ్వులతో
బుజి బుజి అడుగులతో కిల కిల నవ్వులతో
రావయ్యా రావయ్యా క్రిష్ణా క్రిష్ణా
రావయ్యా రావయ్యా క్రిష్ణా క్రిష్ణా
రేపల్లె వెలిగిందమ్మ బంగారు వెన్నెలై
గోపయ్యా చూపే సోకగా...
మా పల్లె విరిసిందమ్మ పండగంటి వెన్నెలై
మా బాబు ఊరే చూడగా...
పాలరాతి బొమ్మ వోలె మధురలోన వెలసిన నీవు
మా ఇంట జ్యోతిగా నిలిచి వెలిగినావా
ముక్కోటి దేవులంతా పుణ్యమేమి చేసిరో
కనురెప్పలు మూయక నిన్నే అలా చూతురే
గజ్జల గలగలతో పలుకుల జిలిబిలితో
గజ్జల గలగలతో పలుకుల జిలిబిలితో
రావయ్యా రావయ్యా క్రిష్ణా క్రిష్ణా
బుజి బుజి అడుగులతో కిల కిల నవ్వులతో
బుజి బుజి అడుగులతో కిల కిల నవ్వులతో
రావయ్యా రావయ్యా క్రిష్ణా క్రిష్ణా
రావయ్యా రావయ్యా క్రిష్ణా క్రిష్ణా
చిత్రం: వెల్కమ్ ఒబామా (2013)
సంగీతం: సింగీతం శ్రీనివాస్ రావు
సాహిత్యం: సింగీతం శ్రీనివాస్ రావు
గానం: ప్రవస్తి
ఐ...ఐ..ఐ... యామ్ ఎ హీరో
నా... నా ముందర అందరు జీరో
బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్
మించిన సూపర్ డూపర్ టాపర్ హీరో
ఐ...ఐ..ఐ... యామ్ ఎ హీరో
నా... నా ముందర అందరు జీరో
బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్
మించిన సూపర్ డూపర్ టాపర్ హీరో
దడ...దడ... దడ... మని
అందరి గుండెలు కొట్టుకునేలా
జుట్టును పట్టి గట్టిగా నెట్టి
చుట్టీ చుట్టీ నెత్తిన కొట్టి
ఎట్టెట్టా అనీ గోలెడుతుంటే
కాలర్ పట్టి ఈడ్చి కాల్చి
చీచీచీ పోపో అని చిందరవందర
చేస్తు తోస్తూ డిష్యుం డిష్యుం
ఫైటింగ్ చేసి అదరద రద రద రధర్ కొట్టు
పవర్ అంటే అందరికీ షివర్
ఫోజంటే అందరికి ఫియర్
నా గన్ దెబ్బకి వందమంది రౌడీలు
ఫట్ ఫట్ ఫట్ ఫటా పట్
ఐ...ఐ..ఐ... యామ్ ఎ హీరో
నా... నా ముందర అందరు జీరో
బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్
మించిన సూపర్ డూపర్ టాపర్ హీరో
చిక్కిన వాళిక బుక్కై పోయిన చిక్కుల్లో
బుక్ బుక్ అని చూస్తూ
ఉక్కిరి బిక్కిరి అవుతూ
మాకిక లక్కే లేదని ఏడిస్తే
టక్కున నేనొక లుక్కిచ్చి
నా లెక్కే వేరని చెప్పిస్తూ
వాడి రెక్కను వంచి ఎక్కి రక్కి
రెక్కలు కోసి బొక్కలు పెట్టి డొక్కలు చీల్చి
ముక్కును ముక్కలుగా కట్ చేసి
నాదెబ్బంటే నువ్వబ్బ అని పంచ్ లు దంచేస్తూ
డైలాగ్ లో నేనొక బుల్లెట్
స్టైల్లో నేనొక రాకెట్
నే కిక్కిస్తే వేయిమంది అవుట్
అవుట్... అవుట్....అవుట్...
ఐ...ఐ..ఐ... యామ్ ఎ హీరో
నా... నా ముందర అందరు జీరో
బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్
మించిన సూపర్ డూపర్ టాపర్ హీరో
No comments
Post a Comment