Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aggi Dora (1967)


చిత్రం: అగ్గిదొర (1967)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
నటీనటులు: కాంతారావు, భారతి, జయశ్రీ
కథ, స్క్రీన్ ప్లే, నిర్వహణ: బి.విఠలాచార్య 
రచన: జి. కృష్ణ మూర్తి
నిర్మాత, దర్శకుడు: బి.వి. శ్రీనివాస్
సమర్పణ: శ్రీ విఠల్ కంబైన్స్
విడుదల తేది: 19.10.1967







చిత్రం: అగ్గిదొర (1967)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: జి. కృష్ణమూర్తి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
ఓ.. తిరుమలేశా చాలు చాలీ సోధన
భరియించలేనయ్యా మొరవిన వేమి
ఓ తిరుమలేశా

పిలిచిన పలికేవు స్వామీ
పిలిచిన పలికేవు స్వామీ
శిలగా నిలచేవేమీ

పిలిచిన పలికేవు స్వామీ
శిలగా నిలచేవేమీ
పిలిచిన పలికేవు స్వామీ

చరణం: 1
కాంతిని చూపే కన్నులలోనే కన్నీరే నింపేవా
ఆ... కాంతిని చూసే కన్నులలోనే కన్నీరే నింపేవా
ఏడువ జేసి వేడుక చూసివేడుక చూసేవేమీ
ఏడువ జేసి వేడుక చూసి వేడుక చూసేవేమీ

పిలిచిన పలికేవు స్వామీ శిలగా నిలచేవేమీ
పిలిచిన పలికేవు స్వామీ శిలగా నిలచేవేమీ
పిలిచిన పలికేవు స్వామీ

చరణం: 2
మనిషిని జేసి మనసును కోసి
మలినమునే నింపేవా
ఆ... మనిషిని జేసి మనసును కోసి
మలినమునే నింపేవా

పువ్వులలోన వాసన తోనే
పురుగుల నింపేవేమీ
పువ్వులలోన వాసన తోనే
పురుగులనింపేవేమీ

పిలిచిన పలికేవు స్వామీ
శిలగా నిలచేవేమీ
పిలిచిన పలికేవు స్వామీ







చిత్రం: అగ్గిదొర (1967)
సంగీతం: విజయా కృష్ణమూర్తీ
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
ఎందున్నావో ఓ చెలి అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి

చరణం: 1
నిలువ లేను నిముషమైన నీవు లేనిదే
తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే
నిలువ లేను నిముషమైన నీవు లేనిదే
తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే

ఇన్నినాళ్ళ వెతలు సైచి నీకై నీకై ఉన్నాను
ఇన్నినాళ్ళ వెతలు సైచి నీకై నీకై ఉన్నాను

ఎందున్నావో ఓ చెలి అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి

చరణం: 2
కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా
కురులలోన తురిమి తురిమి పరవశింతునా
కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా
కురులలోన తురిమి తురిమి పరవశింతునా

నీడవోలే యుగయుగాలు నీతో నీతో ఉంటాను
నీడవోలే యుగయుగాలు నీతో నీతో ఉంటాను

ఎందున్నావో సుందరా నా ముందు నిలువవేళరా
ఎందున్నావో సుందరా
ఇందున్నానే ఓ చెలి అందుకో నా కౌగిలి
ఇందున్నానే ఓ చెలి

No comments

Most Recent

Default