Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bhale Dongalu (1976)

చిత్రం: భలే దొంగలు (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటినటులు: కృష్ణ , మంజుల, మోహన్ బాబు
దర్శకత్వం: కె. యస్. ఆర్. దాస్
నిర్మాతకు: జి. సాంబశివరావు, పి. బాబ్జీ
విడుదల తేది: 25.10.1976







చిత్రం: భలే దొంగలు (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
అందమైన చిన్నవాడు అలిగినా అందమే
అందమైన చిన్నవాడు అలిగినా అందమే
పిలిచిన కొలదీ బిగుసుకుపోయే బింకాలింక చాలు 

నంగనాచి ఆడపిల్ల బొంకినా చెల్లులే
కాటుక కన్నుల కవ్విస్తావు నాటకమింక చాలు 
నంగనాచి ఆడపిల్ల బొంకినా చెల్లులే  

చరణం: 1
హే.. ప్రేమ వలలోన ప్రియుడు పడగానె
అలుసు చేస్తారు అమ్మాయిలు
ఏదో సరదాకు మాట అంటేను
బెట్టుచేస్తారు అబ్బాయిలు
మారాము గారాము చాలించు
నీ మారాము గారాము చాలించు  

నంగనాచి అహా, ఆడపిల్ల - అహా
బొంకినా చెల్లులే 

చరణం: 2
ఏమికావాలో నీకు ఇస్తాను
మనసు నీ సొమ్ము చేశానులే
నువ్వు కావాలి నవ్వు కావాలి
ఇపుడె నాలోన కలవాలిలే
నా ముద్దు ఈ పొద్దు తీరాలి
నా ముద్దు ఈ పొద్దు తీరాలి

అందమైన - అహా, చిన్నవాడు -అహా
అలిగినా అందమే 
కాటుక కన్నుల కవ్విస్తావు నాటకమింక చాలు

నంగనాచి అహా, ఆడపిల్ల - అహా
బొంకినా చెల్లులే 







చిత్రం: భలే దొంగలు (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
చూశానే ఓలమ్మీ చూశానే
వేశానే కన్ను వేశానే
ఇన్నాళ్ళు నాకోసం దాచిన అందం నీలో

చూశావా ఓరబ్బీ చూశావా
వేశావా కన్ను వేశావా
ఇన్నాళ్ళు నీకోసం దాచిన అందం నాలో
చూశావా ఓరబ్బీ చూశావా
చూశానే ఓలమ్మీ చూశానే

చరణం: 1
కసి గోలిపే నీ చూపుల తీరు - ఆహహా...
ఉసి గోలిపే నీ ఊపుల జోరు - హహా హహా
నీ కొంగైనా తగలక ముందే
నీ కొంగైనా తగలక ముందే
తేనేల వానలు కురిపించే నిను

చూశానే ఓలమ్మీ చూశానే
వేశానే కన్ను వేశానే

చరణం: 2
పెదవులు నీకై తడబడతుంటే - హాయ్ హాయ్
కన్నులు నీకై కలగంటుంటే - అరెరెరెరే
నీ కౌగిలిలో చేరకముందే
నీ కౌగిలిలో చేరకముందే
కరిగి కరిగి నే నీరౌతుంటే

చూశావా ఓరబ్బీ చూశావా
వేశావా కన్ను వేశావా

చరణం: 3
కొంటె కోరికలు కొరికేస్తుంటే - ఆహాహా
జంట కోసమై తరిమేస్తుంటే హా
దూరాలన్నీ తొలిగే సమయం
దూరాలన్నీ తొలిగే సమయం
తొందరలోనే రాబోతుందని

చూశావా ఓరబ్బీ చూశావా
వేశావా కన్ను వేశావా
ఇన్నాళ్ళు నా కోసం దాచిన అందం నీలో
చూశావా - హహ చూశానే
వేశావా -కన్ను వేశానే







No comments

Most Recent

Default