చిత్రం: గుంటూర్ టాకీస్ (2016)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, రేష్మి గౌతమ్, శ్రద్ధా దాస్, నరేష్
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాత: యమ్. రాజకుమార్
విడుదల తేది: 04.03.2016
చిత్రం: గుంటూర్ టాకీస్ (2016)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: కృష్ణ మదినేని
గానం: అంబిక సాషితల్, అనంత్ శ్రీకర్
నర నరము పూల రధమై రగిలే ఇటు రారా
అణువణువు నీది అనన ఇలా
రసికతలో నీకు ఎవరూ జగమున సాటి రారురా
అని తెలిపే మాట నిలుపు హలా...
ఏదో చెయ్యి నాతోటి కలిసి పరువం నీదెరా
ఎదభారం మోయానాలోన కురిసే అలుపేరాదురా
మొహం నీకు మౌనాలు తెలిపే గారం చూడరా
ఒక మేఘం లోన లోకాలు కదిపే హాయే చూపరా
నీ సొంతం నేనిక ఒడిలో అందం నీది గా
భరిలో అంతం చూడిక తొలిగా పలికా
ఓ గాయం చేయరా జతలో సర్వం దోచరా
మరల తాపం లేపరా వడిగా తడిగా
నీ కోసం నాలోన ప్రాయం దాచా ఏనాడో
ఆ సాగర కెరటం లో పడిపోనా పైన
ఈ గాజుల గోలేదో మళ్ళీ మళ్ళీ మోగాలి
ఆ కాలి మువ్వేమో ఊగి ఊగి అలిసేపోని
తొలి సారి ఒక దాహం తీరెనే తియ్యగా
మలి సారి ఒక భావం రేగెనే హాయిగా హా...
తనువంతా ఒక వైరం కోరెనే మోజుగా హా...
వయసంతా అర విరిసే తడిసే సేదంలో
నీ వేడి కౌగిలి అడిగా ఇష్టం తీరక
నిమిషం విడిచి ఉండక దరికే జరిగా
నీ వెనకే నేనిలా నడిచా నీలో భాగమై
సగమైపోయి నేడిల పనిలో పనిగా పని గా
No comments
Post a Comment