Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kathanayakuni Katha (1975)


చిత్రం:  కథానాయకుని కథ (1965)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  కొసరాజు
గానం:  ఘంటసాల, పి. సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, వాణిశ్రీ
దర్శకత్వం: డి.యోగానంద్
నిర్మాత: కె.దేవి వర ప్రసాద్
విడుదల తేది: 21.02.1965

పల్లవి:
చెప్పనా ఒక చిన్నమాట
చెవిలో చెప్పనా ఒక మంచి మాట
చెప్పనా ఒక చిన్నమాట
చెవిలో చెప్పనా ఒక మంచి మాట

అనగనగా వున్నది ఒక పల్లెటూరు
ఆ ఊళ్ళో ఉన్నది ఒక అమ్మాయి గారు
అనగనగా వున్నది ఒక పల్లెటూరు
ఆ ఊళ్ళో ఉన్నది ఒక అమ్మాయి గారు

ఒక అబ్బాయంటే ఆమెకు ఎంతోజాలి
ఒక అబ్బాయంటే ఆమెకు ఎంతో జాలి
ఎందుకో ఏమో నువ్వే చెప్పాలి - ఊ 

చెప్పనా ఒక చిన్నమాట
చెవిలో చెప్పనా ఒక మంచి మాట

చరణం: 1
అడవిన ఉసిరక చెట్టు కాయగాసింది
సముద్రమ్ము ఉప్పుతోటి జత కుదిరింది
అడవిన ఉసిరక చెట్టు కాయగాసింది
సముద్రమ్ము ఉప్పుతోటి జత కుదిరింది

కమ్మ కమ్మగా రుచి కలుగకుంటుందా
కమ్మ కమ్మగా రుచి కలుగకుంటుందా
ఎదురుగ చూస్తుంటే నోరూరకుంటుందా ఏమంటావ్ - చెప్పు వింటా

చెప్పనా ఒక చిన్నమాట
చెవిలో చెప్పనా ఒక మంచి మాట

చరణం: 2
అప్పుడప్పుడు ఆ ఇద్దరు కలుసుకున్నారు
ఒకరి కొకరు మనసు లోతు తెలుసు కున్నారు
అప్పుడప్పుడు ఆ ఇద్దరు కలుసుకున్నారు
ఒకరి కొకరు మనసు లోతు తెలుసు కున్నారు

మబ్బు పట్టినప్పుడు వాన కురవ కుంటుందా మబ్బు పట్టినప్పుడు వాన కురవ కుంటుందా
మమత రేగినప్పుడు అది వూరకుంటుందా 
ఆహా అదా సరే    టుందా

ఇలా వుండగా ఒకనాడు ఆ అమ్మాయి
చల్లగా ఆ అబ్బాయి దగ్గరకొచ్చింది
ఊ  వచ్చి, ఇక నే చెప్పనా - చెప్పు

గుండె విప్పి ప్రేమంతా గుమ్మరించింది స్వచ్చమైనదో కాదో చూడమన్నది
గుండె విప్పి ప్రేమంతా గుమ్మరించింది స్వచ్చమైనదో కాదో చూడమన్నది

ఓహొ ఆ తర్వాత ?
చేయి చేయి కలిపింది చెంతకు చెరింది
చేయి చేయి కలిపింది చెంతకు చెరింది
పందిట్లో పెళ్ళేప్పుడని ప్రశ్న వేసింది
పందిట్లో పెళ్ళేప్పుడని ప్రశ్న వేసింది   
 
చెప్పనా ఒక చిన్నమాట
చెవిలో చెప్పనా ఒక మంచి మాట 
చెప్పనా ఒక చిన్నమాట
చెవిలో చెప్పనా ఒక మంచి మాట 








No comments

Most Recent

Default