చిత్రం: పెళ్ళాం చెపితే వినాలి (1992)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: కాస్ట్యూమ్ కృష్ణ , మురళి మోహన్, శ్రీకాంత్, శివాజీ రాజా, హరీష్ కుమార్, మీనా కోవై సరళ
దర్శకత్వం: కోడి రామకృష్ణ
బ్యానర్: శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: దుగ్గిరాల కిషోర్, మురళీ మోహన్
విడుదల తేది: 15.05.1992
చిత్రం: పెళ్ళాం చెబితే వినాలి (1992)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: గణేశ్ పాత్రో
గానం: చిత్ర, శైలజా మారియు బృందం
పెళ్ళాంచెప్తే వినాలి
నీకళ్ళకు గంతలువిడాలి
పెళ్ళాంచెప్తే వినాలి
నీకళ్ళకు గంతలువిడాలి
మగువేమగడి ఆధారం
గుండెలనిండామమకారం
ఇంటికిదీపం కంటికి రూపం
కన్నీరొలికిందా శాపం
పెళ్ళాంచెప్తే వినాలి
నీకళ్ళకు గంతలువిడాలి
మందరకన్నా ముందరకాదా
ఆడితప్పాడు దశరధుడు
ద్రౌపదినొడ్డి తమ్ములతోనే
జూదమాడాడు ధర్మజుడు
మొగుణ్ణి తన్నిన సత్యభామయే
నరకాసురుణ్ణి నరికింది
గరళం నెత్తికి తాకరాదని
గంగ శివుని తలతాకింది
మగువే ఎగువవుతుందిరా
మగాడే దిగిరావాలి ఈవేళరా
పెళ్ళాంచెప్తే వినాలి
నీకళ్ళకు గంతలువిడాలి
మగువేమగడి ఆధారం
గుండెలనిండామమకారం
ఇంటికి దీపం కంటికి రూపం
కన్నీరొలికిందా శాపం
పెళ్ళాంచెప్తే వినాలి
నీకళ్ళకు గంతలువిడాలి
అమ్మకన్నదీ అమ్మలగన్నది
ఆడపిల్లగా పుట్టింది
తాళి కట్టిన మగనిచేతిలో
తాడుకి బొంగరమయ్యింది
మట్టిలో పెట్టుకు మెట్టినింటికీ
మహాలక్ష్మీ కళతెచ్చింది
మూడుముళ్ళతో ఏడడుగులతో
నూరేళ్లూ నిను మలిచింది
మగడా జగడాలేలరా
సగమూ సగమౌదాము మాక్కూడరా
పెళ్ళాం చెప్తే వినాలి
నీకళ్ళకు గంతలు విడాలి
పెళ్ళాం చెప్తే వినాలి
నీకళ్ళకు గంతలు విడాలి
మగువే మగడి ఆధారం
గుండెల నిండా మమకారం
ఇంటికి దీపం కంటికి రూపం
కన్నీరొలికిందా శాపం
No comments
Post a Comment