Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Premayanamaha (2003)

చిత్రం: ప్రేమాయనమః (2003)
సంగీతం: రమేష్ ఎర్రా
సాహిత్యం: చంద్రబోస్ (All)
నటీనటులు: సాందీప్, కౌష
రచన: మోహన వంశీ
మాటలు: విజయ భాస్కర్
కథ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం: శివరాం అప్టే
కో- డైరెక్టర్: నవీన్ గాంధీ
నిర్మాతలు: హరనాథ్ పొలిచెర్ల, అమర్నాథ్ గౌడ, విద్యా శంకర్, తుమకూరు దయానంద్
విడుదల తేది: 12.11.2003







చిత్రం: ప్రేమాయనమః (2003)
సంగీతం: రమేష్ ఎర్రా
సాహిత్యం: చంద్రబోస్
గానం: సాందీప్, సునీత

అమెరికా అమెరికా అమెరికా 
అందమైన అమ్మాయిలాంటి అమెరికా

అమెరికా అమెరికా అమెరికా 
అందమైన అమ్మాయిలాంటి అమెరికా (2)

అంతులేని ఆనంద మిదుగో అమరికా
ఎంత చూసినా తనివి తీరని గాలిక
ఎంత చదివినా అర్ధం కాని తికమక
ఆంధ్రా యువకుడికందిస్తోంది ఆహ్వానపత్రిక

అమెరికా అమెరికా అమెరికా 
అందమైన అమ్మాయిలాంటి అమెరికా (2)

తన మథనం లోన వాషింగ్టన్ వైట్ హౌస్
తన హృదయం లోన యూనివర్సల్ స్టూడియోస్
జడ కట్టుల్లోన న్యూ జెర్సీ గార్డెన్స్
ఎద పొంగుల్లోన బాజ్జింగ్ మౌంటైన్స్

నయానరా లోన న్యూయార్క్ టైమ్స్
నయగరంలోన నయాగరా ఫాల్స్
నయానరా లోన న్యూయార్క్ టైమ్స్
నయగరంలోన నయాగరా ఫాల్స్

తనమాటల్లో వింటున్నాను ఫీట్స్ బర్గ్
వెంకటేశం సుప్రభాతగీతిక

అమెరికా అమెరికా అమెరికా 
అందమైన అమ్మాయిలాంటి అమెరికా (2)

తనలోని అవేశం పెంటగాన్ మిస్సైల్స్
తనలోని సంతోషం వరల్డ్ డిష్ని కార్టూన్స్
తన బాడీ వేడేమో ట్వంటీసిక్స్ సెల్సియస్
తన గుండెల లోతెంతో చెప్పలేదు కొలంబస్

ఇక్కడికి అక్కడికి పదిగంటల డిఫరెన్స్
ఇద్దరికి దిగియాలి పది జన్మల లవ్ బాండ్స్ (2)

పడమర సిగలో విరబూయాలి
తూరుపింట మొగ్గ తొడిగిన
తెలుగు ప్రేమ మాలికా

అమెరికా అమెరికా అమెరికా 
అందమైన అమ్మాయిలాంటి అమెరికా 

అంతులేని ఆనంద మిదుగో అమరికా
ఎంత చూసినా తనివి తీరని గాలిక
ఎంత చదివినా అర్ధం కాని తికమక
ఆంధ్రా యువకుడికందిస్తోంది ఆహ్వానపత్రిక

అమెరికా అమెరికా అమెరికా 
అందమైన అమ్మాయిలాంటి అమెరికా (2)







చిత్రం: ప్రేమాయనమః (2003)
సంగీతం: రమేష్ ఎర్రా
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహారన్, సునీత

గదిలో మదిలో శృంగార క్షీర మథనం
ఒడిలో గుడిలో సంగర్య గ్రంథ పఠనం
చలిలో చెలితో విరహాల కామ దహనం
జతలో రతితో సుఖ శిఖరాల ఆరోహణం

గదిలో మదిలో శృంగార క్షీర మథనం
గుడిలో ఒడిలో సంగర్య గ్రంథ పఠనం

పెదవి పాదమై నీ తనువంత పరుగెత్తనీ
తనువు నేత్రమై నవ అనుభూతి దర్శించనీ
వయసు మేఘమై అష్ట యోగాలు దర్శించనీ
సొగసు శంఖమై కష్ట ఫలితాన్ని దాచేయనీ

మగవక సెగ మఘువదొక సెగ ఒకటగు సంయోగం
కృషి ఒక సగం కాంక్ష ఒక సగం కలయిక వైభోగం
రెండు ప్రాణాల ఆలింగనం

గదిలో మదిలో శృంగార క్షీర మథనం
గుడిలో ఒడిలో సంగర్య గ్రంథ పఠనం

అంగ భంగమే గొప్ప విన్యాసమే చూడనీ
అందుకోసమే పస్తు సన్యాసమే చేయని

హే విరహ భాషలో దివ్య సందేశమే రాయని
భిన్న రీతిలో ఈడు ఏకత్వమే పొందని
జతపడు వ్రతం ఇంత సతమతం
చివరికి రసవంతం
యుగములు క్షణం నాకు అవగతం
ప్రతి రుచి మన సొంతం
కొన్ని జన్మాల సమ్మేళనం

గదిలో మదిలో శృంగార క్షీర మథనం
ఒడిలో గుడిలో సంగర్య గ్రంథ పఠనం


No comments

Most Recent

Default