చిత్రం: రాధాకళ్యాణం (1981) సంగీతం: కె.వి. మహదేవన్ నటీనటులు: రాధిక, చంద్రమోహన్, శరత్ కుమార్ దర్శకత్వం: బాపు నిర్మాత: సారథి స్టూడియోస్ విడుదల తేది: 03.12.1981
Songs List:
పల్గాట్ మాధవన్ పాటంటే (చిటికెయ్యవే చినదానా) పాట సాహిత్యం
చిత్రం: రాధాకళ్యాణం (1981) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: సినారె గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్గాట్ మాధవన్ పాటంటే
చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా పాట సాహిత్యం
చిత్రం: రాధాకళ్యాణం (1981) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: జ్యోతిర్మయి గానం: యస్.పి.బాలు పల్లవి: చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా నుదుటికి తిలకంలా రాధకు మాధవుడు చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా నుదుటికి తిలకంలా రాధకు మాధవుడు చరణం: 1 మానసమున నీ ప్రణయము మారు మ్రోగగా కావ్యగానమాలపించి కవినేనైతి మానసమున నీ ప్రణయము మారు మ్రోగగా కావ్యగానమాలపించి కవినేనైతి మధుమాసము చెలి మోమున విరభూయగనే మధుమాసము చెలి మోమున విరభూయగనే భావ రాగ తాళములను మేళవించితీ ఏటికి కెరటంలా పాటకు చరణంలా సీతకి రాముడిలా రాధకు మాధవుడు చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా నుదుటికి తిలకంలా రాధకు మాధవుడు చరణం: 2 పూల పరిమళాలు గాలి పలుకరించగా నీలి నీలి మేఘమాల పరవసించెను పూల పరిమళాలు గాలి పలుకరించగా నీలి నీలి మేఘమాల పరవసించెను నవనీతపు చెలి హృదయము నను చేరగనే నవనీతపు చెలి హృదయము నను చేరగనే అతిశయమున బ్రతుకు వీణ శృతులు చేసెనూ పగటికి సూర్యునిలా రేయికి జాబిలిలా గౌరికి ఈశునిలా రాధకు మాధవుడు చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా నుదుటికి తిలకంలా రాధకు మాధవుడు
ఏం మొగుడో ఏం మొగుడు పాట సాహిత్యం
చిత్రం: రాధాకళ్యాణం (1981) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: సినారె గానం: పి.సుశీల ఏం మొగుడో ఏం మొగుడో ఎం మొగుడో వద్దంటే ఇనడేమి ముద్దుల మొగుడో తాగ వద్దంటే ఇనడేమి ఓరిదేవుడో ఏం మొగుడో ఎం మొగుడో వద్దంటే ఇనడేమి ముద్దుల మొగుడో తాగ వద్దంటే ఇనడేమి ఓరిదేవుడో రెండు ఝూములదాకా ఎండైనా వానైనా చాకిరేవునీ తెగ ఏలుతాడు రెండు ఝూములదాకా ఎండైనా వానైనా చాకిరేవునీ తెగ ఏలుతాడు పొద్దువంగిందంటే బుద్ధీ మళ్ళిందంటే పొద్దువంగిందంటే బుద్ధీ మళ్ళిందంటే కల్లు పాకలో మునిగి తేలుతాడు ఏం మొగుడో ఎం మొగుడో వద్దంటే ఇనడేమి ముద్దుల మొగుడో తాగ వద్దంటే ఇనడేమి ఓరిదేవుడో మత్తు నెత్తికెక్కి మద్దెరేతిరి వచ్చి బండబూతులేవేవో ఇప్పుతాడు మత్తు నెత్తికెక్కి మద్దెరేతిరి వచ్చి బండబూతులేవేవో ఇప్పుతాడు తెల్లారిపోగానే కల్లారిపోగానే తెల్లారిపోగానే కల్లారిపోగానే తీయన్ని సుద్దులెన్నో సెప్పుతాడు ఏం మొగుడో ఎం మొగుడో వద్దంటే ఇనడేమి ముద్దుల మొగుడో తాగ వద్దంటే ఇనడేమి ఓరిదేవుడో ఎన్నెన్ని తిట్టినా ఎంతెంత కొట్టినా ఏమైనా వీడు తాళికట్టినోడూ ఎన్నెన్ని తిట్టినా ఎంతెంత కొట్టినా ఏమైనా వీడు తాళికట్టినోడూ ఇరుగమ్మలేమన్నా పొరుగమ్మలేమన్నా ఇరుగమ్మలేమన్నా పొరుగమ్మలేమన్నా సచ్చినోడు నాకు నచ్చినోడు ఏం మొగుడో ఎం మొగుడో వద్దంటే ఇనడేమి ముద్దుల మొగుడో తాగ వద్దంటే ఇనడేమి ఓరిదేవుడో
కలనైనా క్షణమైనా పాట సాహిత్యం
చిత్రం: రాధాకళ్యాణం (1981) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: సినారె గానం: యస్.పి.బాలు, పి.సుశీల కలనైనా క్షణమైనా మాయనిదే మన ప్రేమా.. మన ప్రేమా కలకాలం కావ్యంలా నిలిచేదే మన ప్రేమా.. మన ప్రేమా కలనైనా క్షణమైనా నీ కళ్ళల్లో తొంగి చూడనిదే నిదురేది ఆ రేయి నా కళ్ళకు నీ పాట మనసారా పాడనిదే నిలకడ ఏదీ నా మనసుకూ ఊపిరిలో.. ఊపిరిలా.. ఒదిగేదే.. మన ప్రేమా కలనైనా క్షణమైనా..ఆఆఅ..ఆఆఆ.. నా చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని నా పెదవికి ఎంతటి ఆరాటమో నీ పెదవిపై శుభలేఖ రాయాలని కౌగిలిలో.. ఊహూ.. కౌగిలిలా.. ఊఊ... కరిగేదే.. మన ప్రేమా
No comments
Post a Comment