Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Yamaleela (1994)


చిత్రం: యమలీల (1994)
సంగీతం: ఎస్.వీ.కృష్ణారెడ్డి
నటీనటులు: ఆలీ, ఇంద్రజ, కైకాల సత్యనారాయణ
దర్శకత్వం: ఎస్.వీ. కృష్ణారెడ్డి
నిర్మాత: అచ్చిరెడ్డి
విడుదల తేది: 28.04.1994







చిత్రం: యమలీల (1994)
సంగీతం: ఎస్.వీ.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గాత్రం: చిత్ర , యస్. పి. బాలు

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే 
తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే 
మా ధనధాన్యాలు

ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు

జాబిల్లి జాబిల్లి జాబిల్లి 
మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లీ

చరణం: 1
నాలో మురిపెమంతా పాలబువ్వై పంచనీ
లోలో ఆశలన్ని నిజమయేలా పెంచనీ
మదిలో మచ్చలేని చందమామే నువ్వనీ
ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ
కలకాలము కనుపాపల్లే కాసుకోనీ
నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే
తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే
మా ధనధాన్యాలు

లాల లలలా లలలా లాలా
లాల లలలా లలలా 
లాలల లాలల లాలల లాలల 
లాలల లాలల లాలల లాలల 

చరణం: 2
వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా
నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా
నాలో అణువు అణువు ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా
తోడుండగా నను దీవించే కన్న ప్రేమ
కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే
తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే
మా ధనధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు







చిత్రం: యమలీల (1994)
సంగీతం: ఎస్.వీ.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గాత్రం: చిత్ర , యస్. పి. బాలు

ఆ... నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్
ఆ... నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
ఆ... నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్
నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
మనసు లాగేత్తంది లాగేత్తంది లాగేత్తంది హో
వయసు ఊగేత్తంది ఊగేత్తంది ఊగేత్తంది హా

ఆ... నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్
ఆ... నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్
ఆ... నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్
నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్
వలపు ఒలికేత్తంది ఒలికేత్తంది ఒలికేత్తంది రో
వయసు ఒనికేత్తంది ఒనికేత్తంది ఒనికేత్తంది రో

హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో

దిం దిం దిం ధింతనక జుం
దిం దిం దిం ధింతనక జుం
దిం దిం దిం దిం దిం దిం ధింతనక ఉఁ హా
దిం దిం దిం దిం దిం దిం ధింతనక ఉఁ హా

ఆ... అప్పరాల చెరువులోన అమ్మడు ఉఁ హా
కప్పపిల్ల బుస కొడితే అమ్మడు ఉఁ హా
ఒళ్ళు జివ్వు జివ్వుమంటు అమ్మడు ఉఁ హా
లవ్ పుట్టుకొస్తదంటా అమ్మడు ఉఁ హా
తిమ్మరాజు రేవుకాడ పిల్లగో ఉఁ హా
తొండ పిల్ల తొడగొడితే పిల్లగో ఉఁ హా
తాటి మట్ట తగులుకోని పిల్లగో ఉఁ హా
తాటలేసి పోతదంట పిల్లగో ఉఁ హా
కోపమేల బాల కొంగు చేరే వేళ
కుర్రవాడి స్పీడు చూసుకో

హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో

ఆ ఆ ఆ నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్
ఆఁ హ హ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్
నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్

హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో

ఆ... గోలిగూడా సెంటర్లో పిల్లగో ఉఁ హా
గొడవ గొడవ చేసేస్తే పిల్లగో ఉఁ హా
చిక్కడపల్లి సెంటర్లో పిల్లగో ఉఁ హా
చింతకాయ తినిపిస్తా పిల్లగో ఉఁ హా
ఒట్టి ఊక దంపుడేలా అమ్మడు ఉఁ హా
కొత్త పాట నేర్చుకోవే అమ్మడు ఉఁ హా
మడతపేచి మానుకుంటే అమ్మడు ఉఁ హా
తాళిబొట్టు కట్టిపెడతా అమ్మడు ఉఁ హా
తాళిబొట్టు మోజు పెళ్ళికొడకు
పోజు పక్కనెట్టి స్టెప్ లెయ్యారో

హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో

ఆ... నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్
ఆ... నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
ఆ... నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్
నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
మనసు లాగేత్తంది లాగేత్తంది లాగేత్తంది హో
వయసు ఊగేత్తంది ఊగేత్తంది ఊగేత్తంది హా

ఆ... నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్
ఆ... నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్
ఆ... నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్
నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్
వలపు ఒలికేత్తంది ఒలికేత్తంది ఒలికేత్తంది రో
వయసు ఒనికేత్తంది ఒనికేత్తంది ఒనికేత్తంది రో

హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో (2)







చిత్రం: యమలీల (1994)
సంగీతం: ఎస్.వీ.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గాత్రం: చిత్ర , యస్. పి. బాలు

ధర్మపరిరక్షణ ధురంధరుండా
సకలపాప శిక్షణ దక్షుండా
చండతర దండథర బహుమండిత విగ్రహుండా
నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా
నియముండా హ యముండా

అభివందనం యమ రాజాగ్రణీ
సుస్వాగతం సుర చూడామణీ
తమ సుగుణాలు పలుమారు కీర్తించనీ
ఆ..ఆ.. అ అ అ అ
ఏమీ శభాష్ సెహబాసులే నర నారీమణి
బహుబాగులే సుకుమారీమణి
నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ
ఆ..ఆ.. అ అ అ అ

సరసాలు చవిచూడ ఇటురా దొరా
నవమన్మథాకార నడుమందుకోరా
రాకాసి కింకరుల రారాజునే
నరకాన నీవంటి సరుకెపుడు కననే
పాపాలు తెగ మోసి తల మాసెనేమో
నా పాలబడి కాస్త సుఖమందుకోవోయ్
ఆ..ఆ.. అ అ అ అ
అవశ్యము అటులనే కానిమ్ము
నీ కౌగిలే నవ సింహాసనం
రసలోకమే ఇక మన కాపురం
యమ సరదాగా సాగాలి ఈ సంబరం
ఆ..ఆ.. అ అ అ అ

ఊర్వశికి నీవేమి కజినవుదువా
కాకున్న నీకింత సౌందర్యమేల
నరలోకమున ఊరికొక ఊర్వశి
స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి
ఊరించకే ఇక నా రాజహంస
యమ హాయి నీదేలే రసికావతంస
ఆ..ఆ.. అ అ అ అ

రసికాగ్రేసరుండా యముండా

మైకాలలో తమ మతిపోవగా
నా కేళిలో పడి మునకేయగా
గద వదిలేసి ఒడిలోకి రా దేవరా
ఆ..ఆ.. అ అ అ అ

మజ్జారే మదవతీ 
సెహబాసులే నర నారీమణి
బహుబాగులే సుకుమారీమణి
నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ
ఆ..ఆ.. అ అ అ అ

ధర్మపరిరక్షణ ధురంధరుండా
సకలపాప శిక్షణ దక్షుండా
చండతర దండథర బహుమండిత విగ్రహుండా
నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా
నియముండా హ యముండా







చిత్రం: యమలీల (1994)
సంగీతం: ఎస్.వీ.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గాత్రం: చిత్ర , యస్. పి. బాలు

డింకు టకుమ్, టకుమ్, టకుమ్, టకుమ్ (5)

ఓ... ఓ... ఓ...

ఎర్ర కలువ పువ్వా ఎద్దమా చలి మంట
ధింత నకిట తాత్త నకిట
ఎవరు చూడని చోట పొగరాని పొదరింటా 
ధింత నకిట తాత్త నకిట

ఎర్ర కలువ పువ్వా ఎద్దమా చలి మంట
ఎవరు చూడని చోట పొగరాని పొదరింటా

రా మరి చాటుకి సందామామ
కౌగిలి విందుకి సందామామ
సయ్యనె కాముడే సందామామ
ఆశలే తీరని సందామామ

సై రా సరదా గువ్వ పండించు నా పంట
పదరా మధన జాతర చేద్దాము పడకింటా
గాజుల మోతలో సందామామ
మోజులే మోగని సందామామ
తోడుగా సేరుకో సందామామ
ప్రేమనె తోడుకో సందామామ

రంప రపరి రంప రపరి రంప రపరి రా (2)

గిలి గిలి సల్లగాలి తగిలిందే ఓ హంస
సలి సలి సంబరాలు సాగిస్తే హైలెస్స
కేరింత కెరటలా... మునగాలా
కేరింత కెరటల ఊరంత మునగాల
ఉపందుకోవాల నీ పొందు కావాలా
నీ ఒడిలో తొంగుంట సందామామ
నీ కలలో నేనుంటా సందామామ
నా దొర నీవుర సందామామ
ఉహాల రాణివె సందామామ

సై రా సరదా గువ్వ పండించు నా పంట
పదరా మధన జాతర చేద్దాము పడకింటా

ఎన్నెలో ఎన్నెల ఎన్నెలో ఎన్నెల (2)

హా..కులుకులు కుమ్మరించి మురిపాలే తేవాలా
తళుకుల పూల తీగ సరసాల తేలాల
వయ్యారి అందాలు... ఒడిలోనా హోయ్
వయ్యారి అందాలు గాంధాలు తీయాల
మందారు బుగ్గల్లో మద్దెల్లు మోగాలా
ఏడేడు జనమాలు సందామామ
ఎలీకగ ఉంటనే సందామామ
తానుకే నేనిక సందామామ
నా ఎద నీదిక సందామామ 

ఎర్ర కాలువ పువ్వా ఎద్దమా చలి మంట
ధింత నకిట తాత్త నకిట
ఎవరు చూడని చోట పొగరాని పొదరింటా 
ధింత నకిట తాత్త నకిట

సై రా సరదా గువ్వ పండించు నా పంట
పదరా మధన జాతర చేద్దాము పడకింటా
గాజుల మోతలో సందామామ
మోజులే మోగని సందామామ
తోడుగా సేరుకో సందామామ
ప్రేమనె తోడుకో సందామామ


No comments

Most Recent

Default