చిత్రం: అల్లుడొచ్చాడు (1976) సంగీతం: టి. చలపతి రావు నటీనటులు: రామకృష్ణ , రాజబాబు, నాగభూషణం, జయసుధ, ప్రభ, కృష్ణ కుమారి కథ: భమిడిపాటి రాధాకృష్ణ దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ బ్యానర్: ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత: ఎ. వి. సుబ్బారావు విడుదల తేది: 10.06.1976
Songs List:
లేత కొబ్బరి నీళ్ళల్లే పాట సాహిత్యం
చిత్రం: అల్లుడొచ్చాడు (1976) సంగీతం: టి. చలపతిరావు సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు పల్లవి: లేత కొబ్బరి నీళ్ళల్లే పూత మామిడి పిందల్లే లేత కొబ్బరి నీళ్ళల్లే పూత మామిడి పిందల్లే చెప్పకుండా వస్తుంది చిలిపి వయసు నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు.. మనసూ చరణం: 1 పొంగువస్తుంది నీ బాల అంగాలకు ఏహే రంగు తెస్తుంది నీ పాల చెక్కిళ్ళకు కోక కడతావు మొలకెత్తు అందాలకు ఏహే కొంగు చాటేసి గుట్టంత దాచేందుకు దాగలేనివి ఆగలేనివి దారులేవో వెతుకుతుంటవి చరణం: 2 కోటి అర్ధాలు చూసేవు నా మాటలో ఓ... కోర్కెలేవేవో రేగేను నీ గుండెలో నేర్చుకుంటాయి నీ కళ్ళు దొంగాటలు ఆడుకుంటాయి నాతోటి దోబూచులు చూచుకొమ్మని దోచుకొమ్మని చూచుకొమ్మని దోచుకొమ్మని దాచుకున్నవి పిలుస్తుంటవి చరణం: 3 ఓ...వయసు తెస్తుంది ఎన్నెన్నో పేచీలను ఏహే... మనసు తానొల్లనంటుంది రాజీలను ఆహా...పగలు సెగబెట్టి వెడుతుంది లోలోపల...ఓహో రాత్రి ఎగదోస్తు ఉంటుంది తెల్లారులు రేపు ఉందని తీపి ఉందని ఆశలన్నీ మేలుకుంటవి
మా తెలుగు తల్లికీ మల్లె పూదండ పాట సాహిత్యం
చిత్రం: అల్లుడొచ్చాడు (1976) సంగీతం: టి. చలపతిరావు సాహిత్యం: గానం: సుశీల మా తెలుగు తల్లికీ మల్లె పూదండ మా కన్న తల్లికీ మంగళారతులు కడుపులో బంగారు కినుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు పొరలించు మా తల్లి మా తెలుగు తల్లికీ మల్లె పూదండ మా కన్న తల్లికీ మంగళారతులు గలగలా గోదారి కదిలి పోతుంటేనూ బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను దింగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికీ మల్లె పూదండ మా కన్న తల్లికీ మంగళారతులు అమరావతీ నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కన్న కలములో తీయందనాలు నిత్యమై, నిఖిలమై నిలిచి వుండేదాక మా తెలుగు తల్లికీ మల్లె పూదండ మా కన్న తల్లికీ మంగళారతులు
కొడితే పులినే కొట్టాలి పాట సాహిత్యం
చిత్రం: అల్లుడొచ్చాడు (1976) సంగీతం: టి. చలపతిరావు సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: యస్.పి.బాలు, పి. సుశీల కొడితే పులినే కొట్టాలి పడితే చెలినే పటాలి ఆ చెలి కౌగిలిలో చలిమంటలు పుట్టాలి గిలిగింతలు పెట్టాలి కొడితే పులినే కొట్టాలి. పడితే చెలినే పట్టాలి. ఆరె చెలి కౌగిలి కై పది జన్మలు కావాలి పడిగాపులు కాయాలి నీలాటి రేవుకాడ నీలాంటి చిన్నది నీళ్ళల్లో రగిలే నిప్పల్లే వున్నది చూపు చూసింది చురక వేసింది మేను కదిలింది. మెరుపు మెరిసింది పిల్లనుకౌనూ పిడుగే నన్నది పడితే ఆ పిడుగు నేపట్టాలి...పట్టాలి...పట్టాలి.... కొడితే పులినే కొట్టాలి కోటప్ప కొండమీద కోలాటమాడుతుంటే కొవ్వెక్కి కోడెగిత నా వెకి దూకుతుంటే గడుసైన చినవాడే తొడగొటి నిలిచాడే కొమ్ములు విరిచేశాడే కోడెను తరిమేశాడే ఈలవేసి నే రమ్మంటే ఎటో జారిపోయాడే పడితే ఆ గడుసోన్నే పట్టాలి... పట్టాలి...పటాలి... కొడితే పులినే కొట్టాలి గోల్కొండ ఖిల్లా పైన గొంతెత్తి పాడితే ఆకాశం అంచులదాకా నా పాటే మోగితే మోగితే ఏమయింది? ఆకాశం కూలిందా, పాతాళం పేలిందా, కాకమ్మ మెచ్చిందా ? కోకిలమ్మ చచ్చిందా ? కాదు; కాదు- కాలేజీ పిల్లికూన కౌగిట్లో వాలింది పడితే ఆ పిల్లికూననే పట్టాలి...పట్టాలి... పట్టాలి... కొదితే పులినే కొట్టాలి
వేళా పాళా ఉండాలమ్మా పాట సాహిత్యం
చిత్రం: అల్లుడొచ్చాడు (1976) సంగీతం: టి. చలపతిరావు సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా నువ్వు వేగిరపడితే రాదమ్మా తేరగ వచ్చేదైనా కోరిక నీలో ఎంతవున్నా తీర్చే మొనగా డెదుట వున్నా వేడి ఎక్కడో పుట్టాలి నీ వేడుక అప్పుడు తీరాలి వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా నువ్వు వేగిరపడితే రాదమ్మా తేరగ వచ్చేదైనా పొదలో తుమ్మెద రొద పెడితే మొగ్గకు తేనె వచ్చేనా ఎదలో ఏదో సొదపెడితే ఎంకి పాటగా పలికేనా పెదవులూ రెండూ కలవాలి నీ ఎదలోని కుతి తీరాలి వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా నువ్వు వేగిరపడితే రాదమ్మా తేరగ వచ్చేదైనా పదహారేళ్ళ ప్రాయంలోన పైటజారక నిలిచేనా ఎదిగే పొంగు ఏనాడైనా అదిమిపట్టితే ఆగేనా ! ఆగని వన్నీ రేగాలి అప్పుడు మన కథ సాగాలి.... వేళా పాళా ఉండాలమ్మా దేనికైనా నువ్వు వేగిరపడితే రాదమ్మా తేరగ వచ్చేదైనా
ఉరకల పరుగుల పాట సాహిత్యం
చిత్రం: అల్లుడొచ్చాడు (1976) సంగీతం: టి. చలపతిరావు సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి. సుశీల ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం దీనిదుంప తెగ వాడకపోతే ఎంతో ఎంతో నష్టం ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం దీన్దుంప తెగ వాడకపోతే ఎంతో ఎంతో నష్టం వద్దు వద్దు వద్దు వయస్సు పోనీయొద్దూ ఇంత వాటంగా నీకు నాకు మళ్ళీ మళ్ళీ దొరకదు ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం దీన్దుంప తెగ వాడకపోతే ఎంతో ఎంతో నష్టం కోడె వయసుకున్నవీ కొండగుర్తులు ఎన్నో కొండగురులు ఏమిటవి? కోర్కె పుట్టేది గుండె చెదిరేది తోడు వెతికేది దుడుకు పెరిగేది ఆ వయసుకే వస్తాయి కొంటెచేష్టలు ఎన్నో కొంటెచేష్టలు ఏమిటవి , కళ్ళు కలిపేది నీళ్ళు నమిలేది వొళ్ళు విరిచేది తల్లడిల్లేది... ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం దీన్దుంప తెగ వాడకపోతే ఎంతో ఎంతో నష్టం ప్రేమకే వస్తాయి పిచ్చి ఊహలు ఎన్నో పిచ్చి ఊహలు ఏమిటవి? పంటి నొక్కుల్లో పెడవి కాటుల్లో కంటిపాపల్లో కలలమాపుల్లో ఆ ఊహలకొస్తాయి రూపు రేఖలు ఎన్నో రూపురేఖలు ఏమిటవి? జగమే మనదని సగమూ సగమని జన్మజన్మ లకు మనదే జంటని ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం దీన్దుంప తెగ వాడకపోతే ఎంతో ఎంతో నష్టం ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం
ఎలా చెప్పేదెలా చెప్పేది పాట సాహిత్యం
చిత్రం: అల్లుడొచ్చాడు (1976) సంగీతం: టి. చలపతిరావు సాహిత్యం: కొసరాజు గానం: పి. సుశీల ఎలా చెప్పేదెలా చెప్పేది చల్ మోహన రంగా చెప్పబో తే సిగ్గు ముంచుకు వస్తుంది చాటు చాటుగా చెబుదామంటే మాయదారి చంద్రుడున్నాడు చల్లచల్లగా చెప్పాలంటే అల్లరిగాలి వింటున్నాడు తిక్క రేగుతుంది. వేడెక్కిపోతుంది వళ్ళు తెలియకుంది గుండెల్లో గుబులుంది ఊపిరాడదయ్యో అయ్యో ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఎలా చెప్పేదెలా చెప్పేది చల్ మోహన రంగా పక పక నువ్వు నవ్వితే నా చెక్కిలి ఎరుపెక్కుతుంది చిలిపిగ నువ్వు చూస్తే నా కళ్ళకు కై పెక్కుతుంది. నువ్వంటే పిచ్చి నీమాటంటే పిచ్చి నువ్వుంటేను పిచ్చి లేకుంటేను పిచ్చి నీ పాటంటే అబ్బో అబ్బో మరీ మరీ పిచ్చి ఎలా చెప్పేదెలా చెప్పేది చల్ మోహన రంగా
అంతే నాకు చాలు పాట సాహిత్యం
చిత్రం: అల్లుడొచ్చాడు (1976) సంగీతం: టి. చలపతిరావు సాహిత్యం: దాశరథి గానం: పి. సుశీల అంతే నాకు చాలు తమలపాకు తొడిమే పదివేలు నే నేదింక కోరేదిక లేదు అందరివోలె అడిగేదాన్ని కాను కొందరివోలె కొసరేదాన్ని కాను ఓహో బంగారు మావా ఓహో బంగారు మావా ముక్కుకు ముక్కెర లేక ముక్కు చిన్నబోయినాది ముద్దుటుంగరం కుదువబెట్టి ముక్కుకు చక్కని ముక్కెర తేరా...మావా అంతే నాకు చాలు తమలపాకు తొడిమే పదివేలు నడుమా వడ్డాణం లేక నడుము చిన్నబోయినాది నాణ్యమైన ధాన్యం అమ్మీ నడుముకు వడ్డాణం తేరా.....మావా | అంతే నాకు చాలు తమలపాకు తొడిమే పదివేలు కాళ్ళకు కడియాలు లేక కాళ్ళు చిన్నబోయినాయి కోడి ఎద్దుల నమ్ముకోని కాళ్ళకు కడియాలు తేరా....మావా అంతే నాకు చాలు తమలపాకు తొడిమే పదివేలు పట్టెమంచం పరుపు లేక మనసూ చిన్నబోయినాది పంట భూములమ్ముకోని పట్టెమంచం పరుపూ తేరా... మావా అంతే నాకు చాలు తమలపాకు తొడిమే పదివేలు
No comments
Post a Comment