చిత్రం: గొల్లభామ (1947) సంగీతం: ఎస్.బి దినకర్ రావు, ఎస్.హనుమంతరావు మాటలు, పాటలు: సదాశివ బ్రహ్మం గానం: కె. రఘురామయ్య, సి. కృష్ణవేణి నటీనటులు: కె.రఘురామయ్య, సి.కృష్ణవేణి, అంజలీదేవి దర్శకత్వం: సి.పుల్లయ్య నిర్మాణ సంస్థ: శోభనాచల స్టూడియోస్ విడుదల తేది: 22.02.1947
Songs List:
పొద్దోడిసిందే రాయె - ముద్దరాలా పాట సాహిత్యం
చిత్రం: గొల్లభామ (1947) సంగీతం: ఎస్.బి దినకర్ రావు సాహిత్యం: సదాశివ బ్రహ్మం గానం: సి. కృష్ణవేణి పొద్దోడిసిందే రాయె - ముద్దరాలా యెదురు పొదల్లోంచి - ఎలుగొచ్చిందే సెట్టు సేమల్లోకి సెదరీ పోతాది మందా కళ్ళు తెరుసుకోయె - పిల్లదానా మళ్ళించుకొనిరాయె గొల్లభామా కొండెక్కి కూకున్న కోనారిగొల్లడా పిల్లంగో నీవూదె నల్లని పిల్లడా మాటాడి పోదు వొకమాటు రార అల్లుడా గొల్లడా - పిల్లడా వకమాటురారల్లుడా పొద్దుపొడి సేముందు నిద్దరోతుంటేను నాకాసి సూసి నువు నవ్వుతు నిలుసున్నావు కళ్ళు తెరసేతలికి - కనబడక పోనావు నీమీద నామనసు నిలిసిందోరల్లుడా
సందమామా - ఓ సందమామా పాట సాహిత్యం
చిత్రం: గొల్లభామ (1947) సంగీతం: ఎస్.బి దినకర్ రావు / ఎస్.హనుమంతరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మం గానం: సి. కృష్ణవేణి, కె. రఘురామయ్య సందమామా - ఓ సందమామా అందమైన ఓ సందమామా తొలికొండ యెనకాలా తొంగిసూసీ పండువెన్నెల తెచ్చి పారబోసి నువ్వు పరుగెత్తిపోతావు ఎందుకోయీ నిన్ను పట్టొకో రెవ్వరు బలిమి సేసి నువ్వు అలసీపోతావోయి ఆగవోయీ ! నిను మాసి ఓ సుక్క - మిలామిలా మెరిసింది కను సైగ సేసింది తుదకి కలుసుకుంది పలుకరించవేమి సందమామా పలు బంగారమ సందమామా దూరాన మేఘాన - దోబూచులాడుదువు చిరునవ్వు లెందుకో తరుచు దాచుదు నీవు తేట తెల్లము సేయ రాదొ ప్రేమా చాటుమాటూయేల చందమామా
ధన్యతమము నా జన్మ లలనా పాట సాహిత్యం
చిత్రం: గొల్లభామ (1947) సంగీతం: ఎస్.బి దినకర్ రావు సాహిత్యం: సదాశివ బ్రహ్మం గానం: కె. రఘురామయ్య ధన్యతమము నా జన్మ లలనా అగణ్యమగు నీ ప్రేమ కలనా పుణ్య మేమి నే చేసితినో లావణ్యరాశి నిను చేకొనగా ప్రేమ మలచి ప్రతిమ చేసి ప్రేమ చిలికి ప్రాణముపోసి ప్రేమమంత్ర ముపదేశము చేసి నాకై నిను నిర్మించే విరించి
ప్రేమసుధా మధురకథా పాట సాహిత్యం
చిత్రం: గొల్లభామ (1947) సంగీతం: ఎస్.హనుమంతరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మం గానం: సి. కృష్ణవేణి, కె. రఘురామయ్య ప్రేమసుధా మధురకథా యెవరరుంగరోయీ యీవసుధా కొమ్మకొమ్మకేగీ కొమ్మకొమ్మకేగీ తుమ్మెదవై పువ్వులతో అనవలెనా! కొమ్మచాటునో ఆకుమాటునో యెచటున్నావని అడుగుదునే ప్రేమమల్లికా వెదుకుదునే నీకొరకే॥ యెలమావి పైన కలకంఠముతో చాటుదు వెందుకు ప్రేమకథా గండు కోయిలా వినపడదా నా పలుకే ప్రణయగానమున తన్మయమైనా ప్రేమజీవులకు మాటేలా చాటేలా మాటేలా ప్రేమపల్లికా జడుపేలా సిగ్గేలా! ప్రేమ సుధా మధురకథా దివ్య భవ్య మహా యీ వసుధ
ఓ - ఓహో యేమే నీ భాగ్యం పాట సాహిత్యం
చిత్రం: గొల్లభామ (1947) సంగీతం: ఎస్.బి దినకర్ రావు / ఎస్.హనుమంతరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మం గానం: బృందగానం ఓ - ఓహో యేమే నీ భాగ్యం మాటలాడ విది యేమే వెరపో, మరపో, వలపో, యేమి తెలుప విదేమే ఓ - ఓహో - యేమీ నీ భాగ్యం !!
ప్రియతమా ప్రియతమా పాట సాహిత్యం
చిత్రం: గొల్లభామ (1947) సంగీతం: ఎస్.బి దినకర్ రావు సాహిత్యం: సదాశివ బ్రహ్మం గానం: సి. కృష్ణవేణి, కె. రఘురామయ్య ప్రియతమా ప్రియతమా ఆనందమాయె ప్రేమా - ప్రేమా సుధామూర్తివి - నీ దర్శనమే ప్రమోదావహం బౌగా మధురమోహన రూపా నా మనోమందిర దీపా పరితాప భారమాప రావోయి జీవితమున యీ దినమే - యీదిన మే శుభదినమౌ - అనుపమశీలా నిముసమేని వృధ సేయక రావో జాలమేల నో బాలా యీవేళా పావన మీ ప్రేమా శుభదాయకమౌ ప్రేమా మధుమంజుల భావనమే శుభదాయకమా ప్రేమా
రావోయి రావోయి ఈ రేయి పాట సాహిత్యం
చిత్రం: గొల్లభామ (1947) సంగీతం: ఎస్.బి దినకర్ రావు సాహిత్యం: సదాశివ బ్రహ్మం గానం: సి. కృష్ణవేణి రావోయి రావోయి ఈ రేయి ఓ ప్రియతమా నే హాయిగ నిద్దురపోవుదునోయి వేగమే మేల్కొని పోవోయి రావోయి ప్రేమదామములో నిను గూడి ప్రేమ గీతములే పాడి ప్రేమలోనే మునిగి తేలుడు మానస మలరార ప్రియతమా
హాయినిడేగా రుతుశోభా పాట సాహిత్యం
చిత్రం: గొల్లభామ (1947) సంగీతం: ఎస్.బి దినకర్ రావు / ఎస్.హనుమంతరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మం గానం: హాయినిడేగా రుతుశోభా రుతుశోభా నవజీవనమే జగము దోచే మై మరపించే రుతుశోభా యవ్వన వేళా మధురము చాలా నేడే నీదౌ జీవన శోభా యవ్వన వేళా మధురము చాలా నేడే నీదౌ జీవన శోభా కాంతల కౌగిలిలోన కలలుగన మనసు మరచెడి వేళా సుధలు జిలికే పూలలోనే ఝుమ్మని తుమ్మెద తేనెల నను ఆనంద సామ్రాజ్య సుఖ సీమలో ఆశలు జిందె వసంతమే బ్రతికిన ఫల మనురాగమే యువజన వాంఛ యిహసుఖమే ప్రణయ సుధామున యవ్వనఫలమే సుఖమే యిహ సుఖమే
వలపు తేనియ లూనిన వనజమీవు పాట సాహిత్యం
చిత్రం: గొల్లభామ (1947) సంగీతం: ఎస్.హనుమంతరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మం గానం: కె. రఘురామయ్య, సి. కృష్ణవేణి పద్యం: వలపు తేనియ లూనిన వనజమీవు మధుర మధు పిపాసాసక్త మదుప మేను ఏను నీవాడ నీవు నాదానవు ఇచట ఎవ్వరెవరను ప్రశ్నలివేల బాల
ప్రేమ మధువుల గ్రోల పాట సాహిత్యం
చిత్రం: గొల్లభామ (1947) సంగీతం: ఎస్.బి దినకర్ రావు సాహిత్యం: సదాశివ బ్రహ్మం గానం: కె. రఘురామయ్య, సి. కృష్ణవేణి ప్రేమ మధువుల గ్రోల అనురాగ జలదిదే పావన శీల ఇదే ప్రేమ మధువుల గ్రోల మధురాతి మాధుర్యమైన నీ ప్రనయంబుతో వివశ్యమాయే ఆనంద రసానుభూతి నా మన మేమో అతివా రావో జీవన వినోదలిలా తమ యవ్వనమున ఈ ప్రేమ ప్రణయ జీవులెడబాయగ ఔనా నిముషమైనా మధుర మధుర ప్రణయ జలది ఓల లాడి తన్మయమై నీలో నేను నాలో నీవు లీనమైపోదాము లేదేమెరెకా
ఉన్నావా లేవా కరునింపగ ఓ దేవా పాట సాహిత్యం
చిత్రం: గొల్లభామ (1947) సంగీతం: ఎస్.బి దినకర్ రావు సాహిత్యం: సదాశివ బ్రహ్మం గానం: సి. కృష్ణవేణి ఉన్నావా లేవా కరునింపగ ఓ దేవా అతి హీనపు బ్రతుకేల నన్ గొనిపోవా నా ప్రాణపతి నీ సుతునీ మాయముచేసి యేకాకినిచేసే దుఃఖాంబుధి త్రోసీ యేనాటికి తుదిలేని నా జన్మ మికేలా యేపాపము నే చేసితినో కోప మీదేలా యేనాటికి నాకష్టముల కంతమె లేదా నాకెందుకు శిక్షా యిదియేమి పరీక్షా జీవచ్ఛవమై దురితముననే మనవలెనా
వద్దువద్దంటే గుర్రాన్ని పాట సాహిత్యం
చిత్రం: గొల్లభామ (1947) సంగీతం: ఎస్.బి దినకర్ రావు / ఎస్.హనుమంతరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మం గానం: బుర్ర పాట వద్దువద్దంటే గుర్రాన్ని పట్టుకొని చెట్టునకు గట్టేడు యెంటనున్న రాజుకొడుకు గుర్రమడిగితే వుద్దమని వురిమేడు సిద్దమ ! నీ లవుడు సెయ్యికలిపేడమ్మ రాజుకొడుకు రామబాణ మేశాడు ధరణిమీద ఒరిగేడు నీకొడుకు తనయా! నేనిక మనగలనా నీ చిరునవ్వుల మోమే గననీ జీవితమే వృధాకదా ప్రాణవాధునీ బాసిన నాకే ఆశారేఖా నీవని యనుకొన్నా నీవే లేనిచో ఘోరనిరాశా |
భూపతిఁ జంపితిన్ పాట సాహిత్యం
చిత్రం: గొల్లభామ (1947) సంగీతం: ఎస్.బి దినకర్ రావు సాహిత్యం: సదాశివ బ్రహ్మం గానం: సి. కృష్ణవేణి పద్యం భూపతిఁ జంపితిన్ మగడు భూరి భుజంగ ము చేతఁ జచ్చె నే నాపద జెంది చెంది యుదయార్కుని పట్టణ మేగి వేళ్యనై పాపము గట్టుకొంటి నట పట్టి విటుండయి రాగఁ జూచి సంతాపముజెంది యగ్గివడి దగ్ధము గా కిటు గొల్లభామనై యీ పని కొప్పుకొంటి నృపతీ ! వగ పేటికి చల్ల చిందినన్ !!
No comments
Post a Comment